ఈమాట » నిరీక్షణ

Expand to right
Expand to left

నిరీక్షణ

ఒంటి స్తంభం మేడలా

ఇంటి ముందర చింత చెట్టు,

వెలుతురు వచ్చిన వెంటనే

తనని వదిలిన పక్షుల కోసం,

చీకటి పడ్డ క్షణం నుండీ

చింతిస్తుంది.

ఆలస్యంగా వచ్చినా,

ఆగ్రహించాల్సింది పోయి

అక్కున చేర్చుకుంటుంది.

అచ్చం అమ్మలాగే…

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a