తెంపుకోవే బంధనాలు
రెస్టారెంట్ నుండి రోజు సాయంత్రం సఖి ఆఫీసుకు వెళ్ళడం, అక్కడ కౌన్సెలింగ్ సెంటర్‌లో వాళ్ళు చెప్పే సలహాలు వినడం, తిరిగి మధుబనితో కలిసి ఇంటికి రావడం, రాత్రికి వంట చేయడం చారుమతి చేసే పని. ఆమె మానసికంగా కొంత తేరుకుంది. వేళకు తిని సంతోషంగా ఉంది కాబట్టి కాస్త ఒళ్ళు చేసింది. మునుపటి కన్నా అందంగా కనిపిస్తుంది. సఖి ఆఫీస్ వాళ్ళు ఇచ్చే కౌన్సెలింగ్ చారుమతి మీద బాగా పనిచేసింది. స్వతంత్రంగా ఎలా బ్రతకాలో వాళ్లు నేర్పించారు.
ముందు కొన్ని రోజులు రెస్టారెంట్‌లో కబుర్లు చెప్తూ, వాళ్ళకు పనుల్లో సహాయం చేసింది చారుమతి. తర్వాత వంటలు తయారుచేయించడం, కొత్తవి తను చేసి చూపించడం. ఒక్కటేంటి అన్ని పనులు తను దగ్గరుండి చేసేది. రెస్టారెంట్ ఆవిడ చారుమతికి డబ్బులు ఇచ్చింది పనుల్లో సాయం చేసినందుకు. అది కాక టిప్స్ వచ్చేవి. చాల సంతోషంగా వుంది చారుమతికి. తన తొలిసంపాదన చూసి మురిసిపోయింది.
రెస్టారెంట్ ఆవిడ చారుమతి పనితనం, చురుకుతనం చూసి మెచ్చుకుంది. వర్క్ పర్మిట్ ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వగలనని చెప్పింది.
నెల రోజుల్లో ఆ రెస్టారెంట్‌లో చాల మార్పులు వచ్చాయి. చారుమతి లేకపోతే జరగని పరిస్థితి. చారుమతి కాస్త మిస్ చాల్స్ అయింది. థాంక్స్ తప్ప మరో పదం తెలీదు. అయినా మానేజ్ చేస్తుంది. రెస్టారెంట్‌కు వచ్చిన అమెరికన్స్‌ని చిరునవ్వుతో నమస్కారం అంటూ వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంది. కూర్చోండి అంటూ కుర్చీ చూపిస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. ఎలాంటి సంకోచం లేకుండా మెన్యూ చూపించి ఏం కావాలి అంటూ తెలుగులో అడుగుతుంది. దగ్గర వుండి వడ్డిస్తుంది. ఆ రెస్టారెంట్ కొచ్చే వాళ్ళకు ఇదంతా చాల బాగా నచ్చుతుంది. ఇండియన్ కల్చర్, ఇండియన్ బ్యూటీ అంటూ చారుమతి వైపు ఆరాధనగా చూస్తారు. చారుమతి చీర, గాజులు, కుంకమ, జుట్టు, ముక్కుపుడక, వాలుజడ, అందులో అమెరికాలో పూచిన రంగురంగుల పూలు. ఇవన్ని ప్రత్యేక ఆకర్షణలు వాళ్ళకు. ముఖ్యంగా ఆమె తెలుగు మాటలు.
రెస్టారెంట్ కు వెళ్ళడం కాస్త ఆలస్యమైతే చారుమతికి ఫోన్లు వచ్చేవి. చారుమతి జీవితం మారిపోయింది. ఇప్పుడు ఇండియా వెళ్తానని అనడం లేదు.
“వంట చేయడం తప్ప నాకేమీ చేతకాదు అనేవాడు మా ఆయన. ఆ వంటే ఈ రోజు నా జీవితాన్ని మార్చేసింది. వంట చేసినందుకు రెస్టారెంట్‌లో డబ్బులు ఇస్తున్నారు. వడ్డించినందుకు టిప్స్ ఇస్తున్నారు. రుచిగా ఉందని మెచ్చుకుంటూ తిని థాంక్స్ చెప్పి వెళ్తున్నారు. మా ఆయన ఒక్క రోజైనా మెచ్చుకుంటూ తిన్నాడా?” అంది చారుమతి.
చారుమతిలో ఈ మార్పు చాలా సంతోషం కలిగించింది మధుబనికి.
“చారుమతి ఫెమినిస్ట్ అయిపోయిందిరా. డొమెస్టిక్ లేబర్ కు ఎకనామిక్స్ కలిపి చెప్తుంది” అన్నాడు ఇంద్రనీల్.
“నాకు బాగా నచ్చిందిరా చారుమతి” అన్నాడు అనిరుధ్.
“ఆశలు పెంచుకోకు. త్వరలో వెళ్ళిపోతుంది”
“నేను వెళ్ళనిస్తేగా? .. ధనంజయ్ చారుమతికి డివోర్స్ ఇచ్చేస్తే నేను పెళ్ళి చేసుకుంటాను” అన్నాడు అనిరుధ్.
అప్పుడే “అనిరుద్ధా!” అని పిలుస్తూ బయటికి వచ్చింది చారుమతి. “నీలయ్య, నువ్వు కూడ వెళ్లలేదా ఆఫీసుకు?” అంది ఇంద్రనీల్ వైపు చూస్తూ.
“ఇప్పుడే బయలుదేరబోతున్నాం” అన్నాడు ఇంద్రనీల్ నవ్వుతూ.
“ఏమైనా పనుందా మాతో?” అన్నాడు అనిరుధ్.
“టైం ఉందా నీకు?” అడిగింది చారుమతి.
“ఖాళీగా ఉన్నాను చెప్పు” అన్నాడు అనిరుధ్.
“కుంకుడుకాయలు కొనుక్కురావాలి. పక్కసందు మలుపు కాడ దింపుతావా?”
“అలాగే”
హ్యాండ్‌బ్యాగ్ తెచ్చుకోవడానికి లోపలికి వెళ్ళింది చారుమతి.
“నాకేమో బిజీగా ఉన్నానన్నావు, చారుమతికేమో ఖాళీగా వున్నానన్నావ్. ఏంటి సంగతి?” అడిగాడు ఇంద్రనీల్.
“పాపం ఆడపిల్లరా” అన్నాడు అనిరుధ్.
“కుంకుడుగాయలు, సందు మలుపు. భలే దొరికింది చారుమతి నీకు”
“నాకు దొరకాల్సిన పిల్లేరా. పొరపాటున వాడికి భార్య అయింది”
“వాళ్ళింట్లో పాలేరును పిలిచినట్టు నన్ను నీలయ్య అని పిలుస్తుంది చూడు” అన్నాడు ఇంద్రనీల్.
“అమెరికాలో మనల్ని అంత ప్రేమగా పిలిచేవాళ్ళు ఎవరున్నారు చెప్పు?” అన్నాడు అనిరుధ్.
“సరే, ఆ పిల్లను డ్రాప్ చేసి మనం వర్క్ కెళ్దామా?” అన్నాడు ఇంద్రనీల్.
“నువ్వు వర్క్ కెళ్ళు. నా సెక్రటరీకి చెప్పు కాస్త ఆలస్యంగా వస్తానని. ఈ రోజు చారుమతితో పర్సనల్ గా మాట్లాడాలి” అన్నాడు అనిరుధ్.
స్నేహితుని వైపు నవ్వుతూ చూసి వెళ్ళిపోయాడు ఇంద్రనీల్.
“కార్లో కూర్చున్నావా ఎప్పుడైనా?” అడిగాడు అనిరుధ్.
“లేదు, జట్కా బండిలో కూర్చున్నాను మా ఊర్లో” అంది చారుమతి.
“కబుర్లు చెప్పు”
“మీ ఊర్లో ఆడవాళ్ళు తల్లో మల్లెపూలు పెట్టుకోరా?”
“నీ అంత జడ ఉంటేగా పూలు పెట్టుకోవడానికి?”
“మరేమో .. అనిరుద్ధా, మీ ఊర్లో .. ” ఏదో చెప్పబోయింది చారుమతి.
“మీ ఊరు, మీ ఊరు అనకు మాటకు ముందు. నా ఊరు అమెరికా కాదు. ఉద్యోగం కోసం వచ్చాను ఇక్కడికి. ఏదో ఒక రోజు ఇండియా వెళ్ళిపోవాలి కదా!” అన్నాడు.
“ఆఁ ఏదో చెప్పబోయావు ఇందాక”
“మీ ఊర్లో .. సారీ, అమెరికాలో .. మల్లెపూలు దొరకవా?”
“దొరకవనుకుంటాను. కావాలా?”
కావాలి అన్నట్టు తల ఊపింది చారుమతి.
వెంటనే సెల్ ఫోన్‌లో ఇండియన్ ఫ్రండ్స్‌కి ఫోన్ చేసి “నెక్స్ట్ వీక్ వస్తున్నారు కదా న్యూయార్క్ కి, ఒక మల్లెపూల బాస్కెట్ కావాలి, మరిచిపోకుండా తీసుకురండి” అని చెప్పాడు.
“ఎంత మంచివాడివి అనిరుద్ధా నువ్వు! నా గురించి ఎంత పట్టించుకుంటావు! నన్ను పెళ్ళి చేసుకున్న మనిషి సరిగ్గా నీలాగే ఉండాలనుకున్నాను. కాని దేవుడు నాకు అన్యాయం చేసాడు” అంది చారుమతి.
ఆ మాటలకు జవాబుగా చారుమతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అనిరుధ్.
“ఏం ఆలోచించావు నీ గురించి? ధనంజయ్ బాగా చూసుకుంటే అతని దగ్గరికి వెళ్ళిపోతావు లేదా మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లిపోతావు. ఏం చేస్తావు మీ ఊరు వెళ్ళి? మళ్ళీ పిడకలు చేసి, అన్నం వండి పాలేర్లకు పెట్టి, పాలు పితికి … ఇవే కదా నువ్వు చేసే పనులు?”
“మరి ఇంకేం చేయను?”
“ఇక్కడే ఉండు. నిన్ను పెళ్ళి చేసుకుంటాను.”
“ధనంజయ్ కన్నా ముందు నువ్వు మా నాన్నకు కనిపించి ఉంటే నీకిచ్చి చేసి ఉండేవాడు. మా నాన్నకు కావల్సింది అమెరికా అల్లుడు” అంది.
ధనంజయ్ సఖి ఆఫీసులో బాగా లాబీ చేసాడు. చారుమతిని తనతో పంపమని పదేపదే ప్రాధేయపడ్డాడు. ఇండియా కి ఫోన్ చేసి చారుమతి తల్లిదండ్రులని పొరపాటయింది, క్షమించమని అడిగాడు. చారుమతి నాన్నగారు మధుబనికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. ధనంజయ్‌లో మార్పు వచ్చింది కాబట్టి చారుమతిని ధనంజయ్‌తో పంపించడానికే నిర్ణయించింది సఖి సంస్థ.
చారుమతికి అనిరుధ్ పట్ల ఇష్టం వున్నప్పటికి ఆ విషయం బయటికి చెప్పలేకపోయింది. ధనంజయ్ కొంచెం మెరుగ్గా ప్రవర్తిస్తే చాలు, అతనితో జీవితం గడిపేయాలనుకుంది. విడాకులంటే మాటలా? తల్లిదండ్రులకు ఎంత అప్రతిష్ట? పల్లెలో తన గురించి ఏమనుకుంటారు అనుకుంది. స్త్రీలు తరతరాలుగా ఆలోచించే పద్ధతిలోనే ఆలోచించింది. మరోసారి ఆహుతై పోవడానికే నిర్ణయించుకుంది.
ఆ రోజు సఖి ఫర్ సౌత్ ఏసియా ఆఫీస్‌లో పీటర్‌కు థాంక్స్ చెప్పే పార్టీ జరిగింది. ఒక ఇండియన్ అమ్మాయిని డొమెస్టిక్ వయొలెన్స్ నుండి కాపాడినందుకు అందరు పీటర్‌ను అభినందించారు. పీటర్‌కు చాల సంతోషంగా వుంది. చారుమతి కట్టిన రాఖీ చూసి మురిసిపోతున్నాడు. అందరికి “నా ఇండియన్ సిస్టర్” అంటు పరిచయం చేస్తున్నాడు. అనిరుధ్, ఇంద్రనీల్ కూడ ఉన్నారక్కడ.
ముభావంగా ఉన్న స్నేహితుడి భుజం మీద చెయ్యి వేసి “ఏరా అలా వున్నావు?” అన్నాడు ఇంద్రనీల్.
“రేపు చారుమతి వెళ్ళిపోతుంది; బహుశా తిరిగి రాక పోవచ్చు” అన్నాడు అనిరుధ్ దిగులుగా.
“ఒకసారి స్వేచ్ఛ రుచి చూసాక, ధనంజయ్ దగ్గర ఇమడ లేదు. వచ్చేస్తుంది. లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ అయాక వెంటనే పెళ్ళి చేసుకో” అన్నాడు ఇంద్రనీల్.
సంతోషం ఆపుకోలేక “నీల్” అంటూ ఇంద్రనీల్‌ని ఎత్తుకున్నాడు అనిరుధ్.
“ఒరేయ్ దించరా. మనల్ని గే అనుకుంటారు. అప్పుడు నాకు మధు వుండదు, నీకు చారుమతి వుండదు” అన్నాడు ఇంద్రనీల్.
“నేనంటే ఇష్టమే చారుమతికి. కాని ధైర్యం చేయలేకపోతుంది” అన్నాడు అనిరుధ్.
పార్టీ నుండి అందరు ఇంటికి వచ్చేసారు. చారుమతి ఇంటికి రాగానే తనకు నీరసంగా ఉందని, తల తిరుగుతున్నట్టుందని చెప్పింది.
మధుబని తన డాక్టర్ ఫ్రండ్‌ని పిలిచింది ఫోన్ చేసి. డాక్టర్ చెకప్ చేసి చారుమతి ప్రెగ్నెంట్ అని చెప్పింది.
“మా ఆయన ఇన్ని మందు బిళ్ళలు తెచ్చి రోజు ఒకటి మింగమన్నాడు, పిల్లలు పుట్టకుండా ఉంటారని. నేను బిళ్ళలు వేసుకుని ఎరగను. పడేసాను” అని మధుబనితో చెప్పింది చారుమతి.
“ఎంత దుర్మార్గుడైన మగవాడైనా భార్య కడుపుతో ఉందంటే సంతోషిస్తాడు. నా బిడ్డే నా భవిష్యత్తుకు ఆలంబన” అనుకుంది చారుమతి బట్టలు సర్దుకుంటూ.
“నెల రోజులు చాల బాగా గడిచిపోయింది నీతో. అప్పుడప్పుడు మాకు ఫోన్ చేయి. రెస్టారెంట్‌కు వెళ్ళడం మానేయకు. లేకపోతే మళ్ళీ నీకు బోర్ అయిపోతుంది లైఫ్. మేమంతా నీతో ఉన్నాం” అన్నారు మధుబని, ఇంద్రనీల్.
అనిరుధ్ దగ్గరికి వెళ్ళింది చారుమతి. “నీకు నా కంటె మంచి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి దొరుకుతుంది” అని చెప్పింది.
ఏమి మాట్లాడకుండా బరువెక్కిన మనసుతో కారు డ్రైవ్ చేస్తున్నాడు అనిరుధ్. పక్కన ఇంద్రనీల్, వెనక పీటర్ కూర్చున్నారు. వెనక ఇంకో కారులో చారుమతి, మధుబని, సఖి గ్రూప్ తో కలిసి వస్తున్నారు.
కారు దిగి అందరికీ వీడ్కోలు చెప్పింది చారుమతి. మధుబనికి, సఖి వాళ్లకు థాంక్స్ చెప్పి చారుమతిని బాగా చూసుకుంటానని వాగ్దానం చేసాడు ధనంజయ్.
అందరూ వెళ్ళిపోయారు చారుమతిని భర్త ధనంజయ్ దగ్గర దించి. ఇంట్లోకి అడుగుపెట్టింది చారుమతి.
చారుమతి ఇంటికి కొద్ది దూరంలో కార్లు ఆపి నిలబడ్డారు అందరు. ధనంజయ్‌ని ఎంతవరకు నమ్మవచ్చు అని ఆలోచిస్తున్నారు. సఖి గ్రూప్, మధుబని, పీటర్ ఒకచోట నిలబడి మాట్లాడుకుంటున్నారు. అనిరుధ్ స్టీరింగ్ ముందు తల ఆన్చి కళ్ళు మూసుకున్నాడు.
“అనిరుధ్, నువ్వేంటి ఇలా అయిపోయావు? నీ జీవితంలోకి చాలమంది ఆడపిల్లలు వచ్చారు కదా!” అన్నాడు ఇంద్రనీల్.
“పడకగది వరకు వచ్చారు, వెళ్ళిపోయారు. కాని చారుమతి పడకగదికి రాలేదు. జీవితంలోకి వచ్చింది. ఈ నెల రోజుల్లో నాకు బాగా దగ్గరైంది. చాల ప్రేమగా చూసుకుంది అమ్మ లాగా. నాకు అమ్మ లాంటి భార్య కావాలి. చారుమతి కావాలి” అన్నాడు అనిరుధ్.
“ఇంకొకరి భార్య కావాలంటే ఎలారా?”
“అదే, ఆ మాటే చెప్పొద్దంటున్నాను”
స్నేహితుడి బాధను అర్థం చేసుకుని మౌనంగా ఉండిపోయాడు ఇంద్రనీల్.
అదే సమయంలో ధనంజయ్ “కడుపు తెచ్చుకుని నెల రోజుల తర్వాత ఇంటికి వస్తావా?” అంటూ చారుమతి జుట్టు పట్టుకుని కొడుతున్నాడు.
పాత చారుమతి అయితే కాళ్ళు పట్టుకుని, కడుపులో ఉన్నది నీ బిడ్డే అంటూ దీనంగా వేడుకునేది. కాని ఇప్పటి చారుమతి వేరు. సూటిగా ధనంజయ్ వైపు ఒక్క చూపు చూసింది.
సూట్‌కేస్ తీసుకుని బయటకు వచ్చింది. ఆ ఇంటి నుండి, ధనంజయ్ జీవితం నుండి శాశ్వతంగా బయటికి వచ్చింది. ఈ సోకాల్డ్ మ్యారేజ్ ఇన్‌స్టిట్యూషన్ నుండి బయటపడింది.
బరువెక్కిన మనసుతో వడివడిగా అడుగులు వేస్తూ రోడ్డు మీదికి వచ్చింది. కట్టలు తెంచుకున్న దుఃఖం. అపరిచితమైన రోడ్డు. వివాహబంధం కూడ అపరిచితంగానే ఉంటుంది ఎప్పటికి. ఏడు అడుగులు ఏమయ్యాయి ఇప్పుడు? ధనంజయ్ ఎంత అపహాస్యం చేసాడు పెళ్ళిని! అనిరుధ్ ఎంత బాధ్యతగా ప్రవర్తించాడు తన పట్ల!
ఆలోచిస్తూ, ఏం చేయాలో తెలీక ఏడుస్తూ నడుస్తుంది చారుమతి.
ఏడుస్తూ వస్తున్న చారుమతిని కారు మిర్రర్ నుంచి చూసాడు ఇంద్రనీల్. “అనిరుధ్, నీ చారుమతి వచ్చేసింది, మనం ఊహించనంత త్వరగా” అన్నాడు.
ఇద్దరూ కారు దిగి నిలబడ్డారు. పది నిముషాల వ్యవధిలో ఏడుస్తూ తిరిగి వస్తున్న చారుమతిని చూసి, షాక్‌కు గురయ్యారు సఖి గ్రూప్. వెంటనే ఎలర్ట్ అయి పోలీస్‌కు ఇన్‌ఫర్‌మేషన్ పంపారు.
“అనిరుద్ధా!” అంటూ ఏడుస్తూ వచ్చి చుట్టుకుపోయింది. చారుమతి భుజాల చుట్టూ చేతులు వేసి “ఇప్పుడు నన్ను చారుమతిని ఎవరూ విడదీయలేరు” అనుకున్నాడు అనిరుధ్.
వెనకే ధనంజయ్ పరుగెత్తుకు వస్తున్నాడు. వీళ్ళంతా వుంటారని ఊహించలేదు.
ధనంజయ్‌ని చూసి అనిరుధ్ చారుమతిని ఇంకాస్త దగ్గరికి లాక్కున్నాడు.
ఆ దృశ్యం చూసి ధనంజయ్ మండిపడ్డాడు.
“నువ్వేనా దీని ప్రియుడివి? అయినా నేను దీనికోసం రాలేదు. మెడలో ఉన్న పదితులాల మంగళసూత్రాల కోసం వచ్చాను” అన్నాడు.
ఆ మాటలకు గాయపడి చివ్వున తల ఎత్తింది చారుమతి. ధనంజయ్ వైపు నిరసనగా ఒక్క చూపు చూసింది. మెడలో చెయ్యి వేసి మంగళసూత్రాలు పట్టి బయటికి లాగింది.
అంతే, మరుక్షణం మంగళసూత్రాలు తీసి, ధనంజయ్ వైపు విసిరికొట్టింది చారుమతి.
ఈ మొత్తం వ్యవహారమంతా పీటర్‌కు అర్థమైంది. “గివ్ హర్ పాస్‌పోర్ట్ బాక్” అన్నాడు.
అంతలోనే పోలీసులు వచ్చారు. ధనంజయ్ మీద డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ ఫైల్ చేసారు సఖి వాళ్ళు.
ధనంజయ్‌ను ఎక్కించుకుని వెళ్ళిపోయారు పోలీసులు.
Savithri Machiraju అభిప్రాయం:
July 3, 2002 10:00 am
[Reposted from old guestbook - సంపాదకులు ]
I have just read the story “తెంచుకోవే బంధనాలు” by Mahe Jabeen in the July issue and was so appalled that I felt I must comment. The story uses the name of a well known organization, Sakhi for South Asian Women, based in New York, as a driving force in the plot. But it is clear that the author has no clue how such organizations operate in the U.S., nor what the relevant rules and laws are. Even someone with no first hand knowledge of the organization can take a quick look at their website for some basic information.
The first tip off is in the manner in which a group of Sakhi staff members go to the home of someone who has not called them, in fact, does not even know they exist, and inform her that they are there to rescue her! Later in the story, after separating the victim from her husband, they get taken in by his “lobbying” (author’s word) and “decide to return” his wife back to him. On neither occassion is the wife herself a participant in the decision. This “cell” (note the communist based terminology) of Sakhi does nothing to advise the wife of her rights, options, or legal recourses, but gives her some unspecified “counseling” that turns her into a “feminist”! And of what does her feminism consist? Why, it determines her to wish her father could’ve met the hero of the story before her husband, because then she would have been married to him instead, as all her father wanted was an “అమెరికా అల్లుడు”. And of course, at the end (after her husband starts to beat her up again within minutes of their reunion), it gives her the strength to throw her మంగళ సూత్రం at him and walk off in the hero’s embrace. And all this is applauded by the heroine of the story, the Sakhi staff member, a self-professed feminist who is steadfastly refusing all pleas by her boyfriend to marry, though she likes him, because “marriage means you are under a man’s control”. However, for the poor victim of domestic violence, marriage is the only solution on everyone’s mind, as from the minute she is taken from her home, everyone starts worrying over her poor chances of remarrying if she divorces her husband.
The subject of domestic violence, especially in the H1b/H4 community, has become very popular in Telugu stories and novels in the past few years, amounting almost to a fad or cliche. Perhaps it was the author’s intention to raise awareness in her readers, but such serious misinformation, almost amounting to disinformation, does no good, but absolute harm. (Example: at the end, Sakhi staff members “charge” the husband with domestic violence, even though they haven’t witnessed it; not the wife.) Also, this whole story takes place in New Jersey, so that the relevant Domestic Violence organization would be Manavi. I guess Ms. Mahe Jabeen hasn’t heard of them; thank god, or she would have libeled another fine organization (the oldest South Asian DV organization in the U.S.) If the author of the story is the well known poet Mahe Jabeen, who is supposed to be running a domestic violence organization in Hyderabad, I can only hope and pray that she doesn’t run her organization along the lines attributed to Sakhi here.
Aside from the domestic violence issue, the story also abounds in cliche and stereotypes. We have Peter, an African American, so naturally he is a “trash collector”, and, when in a mellow mood, speaks in Swahili!! Can anything be more blatantly racist? Perhaps the author doesn’t know how many generations separate the present day African Americans from their ancestral homelands, nor how systematically and comprehensively their language and culture were eradicated in the days of slavery, nor that Swahili is spoken in east Africa, whereas most slaves were captured from west Africa. But never mind! Can’t let a few facts stand in the way of a “good” story! In your new guidelines to authors, you state that you continue to have all submissions go through the review process. May I request that, in future, in addition to whatever literary merits your reviewers are looking for, they also look for some veracity and verisimilitude in the submission before accepting it for publication?
dharani అభిప్రాయం:
November 13, 2007 8:26 am
I am sorry if the reply is too late…the story is very nice….i couldnt find the second part….would like to read the whole story…please let me know how I can get the second part
lalitha అభిప్రాయం:
November 17, 2007 4:47 am
ఈ వ్యాఖ్య కథ గురించి కన్నా సావిత్రి గారి వ్యాఖ్యకు స్పందనగా రాస్తున్నాను.
సావిత్రి గారు, ఇతరత్రా ఇలాంటి organisations కి సంబంధించిన వారు, ఈ విధంగా వారి మాటలలోనే వారి సంస్థలు ఎలా పని చేస్తాయో, అసలు సమస్యలు ఎలాంటివో పని కట్టుకుని ప్రచారమ్ చెయ్యాల్సిన పని ఉందేమో అనిపిస్తోంది.
feminism అన్న పదాన్ని చాలా తేలికగా, దాదాపు “తిట్టు”లాగా వాడుతున్నారు. ఎవరైనా వివరించ బూనితే వారిని తట్టుకోలేనంతగా ఎదురు వ్యాఖ్యలతో దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంటారు.
నేను ఈ మధ్యనే కొన్ని పుస్తకాలు చదివాను. దానికే నాలో స్త్రీవాదం పట్ల కొన్ని అపోహలు తొలిగిపోయాయి. అటువంటి పుస్తకాలు పాఠ్య పుస్తకాలుగా పెట్టవచ్చునేమో అన్నట్లు కనిపించింది. అయితే ఇవి ఎవరిని ప్రభావితం చేస్తాయి? Only those who are already sympathetic to the related issues. Not that that’s a small thing. But someone needs to come out and say that feminism does not mean separation. Feminism does not means western culture. feminism does not mean so many things.
In my point of view, feminism is also humanism. The principles in there apply to every human being who is being subdued by sytem. It could be work environment or family environment or the caste system.
Nature assigns some roles and limitations and humans do some for sake of organisation. Bottom line is not fighting the nature or defyinfgevery rule that is laid. The bottom line is allowing each individual to be respected for what they are. This is what I can express for now.
Ravikiran Timmireddy అభిప్రాయం:
November 17, 2007 6:34 pm
మాచిరాజు సావిత్రి గారి విమర్శని చదివిన తర్వాత, మహే జాబీన్ గారి “తెంచుకోవే బంధనాలు” కథని కూడా చదివేను.
గొప్ప కథగా నా కనిపించలేదు. కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు ఏ పాత్ర కూడా సరిగ్గా ఎష్టాబ్లిష్ కాలేదని నా అభిప్రాయం. చెప్పాలనుకున్న కథ వొకటికి పదిసార్లు చెప్పిన కథే ఐనా, వర్తమానానికి సంభందించిన అంశం కాబట్టి చెప్పిన పద్దతి బాగుంటే కథ కూడా బాగుండేది. తనకు సరిగా తెలియని దేశంలో, గబ, గబా నాలుగు పాత్రల్ని కలబోసి, కాగితం మీద కుమ్మరించినట్టుంది. సావిత్రి గారి విమర్శ చదవకపోతే, మహే జబీన్ గారి పేరు తెలియకపోతే, ఈ కథని కడ వరకూ చదవడం కష్టవే. కథ గొప్పగా చెప్పలేదు కాబట్టి, కథ వ్రాసింది గొప్ప పేరున్న రచయిత్రి కాబట్టి, కథని భూతద్దంలో చూసి, లేని లోపాల్ని కూడా కల్పించి విమర్శించాల్సిన అవసరం వుందని నేననుకోను.
సావిత్రి గారు అంతగా మదన పడిపోయ్యే విశేషాలేవీ నాకు కథలో కనపడలేదు. సఖి గురించి, అమెరికాలో గృహ హింస ప్రాసిక్యూషన్లో వున్నటువంటి రూల్స్, రెగులేషన్స్ గురించి రచయిత్రికి అవగాహనా లోపం వుందనడంలో అబద్దవేవీ లేదు, but there is nothing in this story that is so appalling, that requires such a libelous comment from Ms. Machiraju Saavitri.
సఖి సంస్థ సభ్యులు చారుమతి ఇంటికి పోవటం అంత పెద్ద తప్పుగా సావిత్రి గారికి ఎందుకు కనపడిందో మరి. నిజవే చారుమతికి సఖి గురించి తెలియదు, కానీ మదుబనికి చారుమతి గురించి తెలుసు కదా. గృహ హింస నుంచి దక్షణాసియా ఆడవాళ్ళకి విముక్తి కోసం స్థాపించబడిన సంస్థ, “Sakhi for South Asian Women is a community-based organization in the New York metropolitan area committed to ending violence against women of South Asian origin.” అని చెప్పుకునే సంస్థ, ఫలాని ఇంట్లో వొక అభం శుభం తెలియని ఆడపిల్ల, కనీసం తన బాధల్తో తండ్రికి వ్రాసిన వుత్తరం తను పోస్ట్ కూడా చేసుకోలోని స్థితిలో వున్నటువంటి అమాయకపు పిల్ల విషయం తెలిసి కూడా మౌనంగా వుంటారని నేననుకోను. ఫిర్యాదే అంత ముఖ్యవైతే మదుబనికి దొరికిన ఆ వుత్తరవే ఫిర్యాదుగా స్వీకరించడానికి వెనుకాడుతారని నేననుకోను. ఫిర్యాదే ముఖ్యవైతే చారుమతి ఇంటికి పోయిన తర్వాత తను చెప్పిన విషయాలే ఫిర్యాదుగా పరిగణించడాని వెనుకాడుతారని నేననుకోను. సఖి స్వంత మాటల్లోనే వారి మిషన్ గురించి, “Sakhi structured its programming to follow a two-pronged approach in addressing domestic violence within the South Asian community:
1. We create a safe place with support, friendship, and a full range of culturally-sensitive, language-specific information, services, and advocacy to South Asian women facing abuse in their lives; and,
2. We work to inform, actively engage, and mobilize the South Asian community in the movement to end violence against women forever.”
సావిత్రి గారి మరో ఫిర్యాదు, చారుమతికి ఎలాటి కన్సలింగ్ సఖి ఇచ్చిందో రచయిత్రి విపులంగా వివరించలేదని. ఇది లోపవే, కథలో చారుమతికి, ఆమె భర్త కి సఖి ఇచ్చినటువంటి కన్సెలింగ్ గురించి రచయిత్రి సూచనమాత్రంగానైనా చెప్పి వుండాల్సింది. ఇతే సావిత్రి గారు ఈ లోపాన్ని ఫెమినిస్టులని వ్యంగంగా వ్యాఖ్యానించడానికి వుపయోగించుకోవడం చాలా అసభ్యంగా వుంది. సావిత్రి గారు చెప్తారు, సఖి తన కన్సలింగ్ తో చారుమతిని ఫెమినిస్ట్ గా మలచేరంట. ఎలాటి ఫెమినిస్ట్, చారుమతి అనిరుధ్ ని తన భర్త గా కోరుకోవటం. తాళి కట్టిన మొగుడు ధనుంజయ్ కన్నా ముందు, అనిరుధ్ పరిచయం అయ్యుంటే ఇతనే తన భర్త అయ్యేవాడు కదా అని చారుమతి అనుకోవటం సావిత్రి గారు వొక నేరంగా పరిగణించారు. పెళ్ళి వలన కన్నీళ్ళు తప్ప మరోకటి పొందని ఆడకూతురు, తనంటే ఇష్టం చూపించే మరో వ్యక్తి తారస పడినప్పుడు, అతన్ని గురించి తలపొయ్యడంలో, అతన్ని కోరుకోవడంలో నేరపూరితవైన ఆలోచనని, ఆ రకవైన ఆలోచనలే (ఈ ఆలోచనకి ఫెమినిజానికి నిజానికి ఏ సంబధం లేదు) సఖి నుంచి చారుమతి నేర్చుకున్న ఫెమినిజం అని సావిత్రి గారు మరో నేరాన్ని మహె జబీన్ గారి మీదకి తోస్తారు. వాడు కట్టిన ఆ తాళిని తెంచటాన్ని వ్యంగంగా వ్యాఖ్యానిస్తారు.
సావిత్రి గారి మరో ముఖ్యవైన ఫిర్యాదు, మధుబని పెళ్ళితో సంబంధం లేకుండా ఇంద్రనీల్ తో కలసి వుండటం. ఇంద్రనీల్ పెళ్ళికి సుముఖంగా వున్నా, మధుబని కి పెళ్ళిమీద సద్భావం లేకపోవడం. అందరూ మదుబని ఆలోచనని హర్షించాలని లేదు, కానీ ఈ రోజుల్లో, అమెరికా దేశంలో ఆ ఆలోచనా సరళిని అంత ద్వేషించాల్సిన అవసరం నాక్కనిపించడం లేదు. సావిత్రి గారూ, మదుబని ఎప్పుడూ కథలో చారుమతి సమస్యలకి మరో పెళ్ళి పరిష్కారంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇంద్రనీల్, అనిరుధ్ ఆలోచనల తీరుతో చారుమతికి సహాయం చేసిన మదుబనికి, సఖి సంస్థకి, లేకపోతే ఫెమినిజానికి సంబంధం లేదు. కథలోనే వున్న ఈ చిన్న సత్యం మీ మసుకెందుకు ఎక్కలేదో మరి.
చారుమతి స్వయంగా పోలీస్ కి ఫిర్యాదు ఇచ్చేరని కథలో చెప్ప లేదు, సఖి సంస్థే ఫిర్యాదు చేసినట్టు రచయిత్రి వ్రాసేరు. నిజవే, కానీ చారుమతి ఫిర్యాదు లేకుండా ధనుంజయని పోలీసు అరెస్ట్ చేయగలదా? రచయిత్రి ఈ ముక్క చెప్పనందువలన కథకి, సఖి సంస్థకి అంత నష్టం వాటిల్లిందా, సావిత్రి గారు?
“Aside from the domestic violence issue, the story also abounds in cliché and stereotypes.” అని చెప్పేరు. మొత్తం కథలో వున్న వొకే వొక తెలుగు కాని పాత్ర పీటర్. అయన ట్రేష్ కలక్టర్ అనిచెప్పటం మీకు జాతి వివక్షగా కనపడింది. పోనీ పదిమంది నల్ల వాళ్ళు ఈ కథలో వుండుంటే, అందరినీ ట్రేష్ కలక్టర్లు గా చూపించుంటే మీ అభ్యంతరానికి వొక విలువుండేది. మీరొప్పుకున్నా వొప్పుకోక పోయినా చిన్న, చిన్న వుద్యోగాలు చేసే వాళ్ళు ఆఫ్రికన్ అమెరికన్సే అనేది సత్యం. వున్నదాన్ని వున్నట్టు చెప్పటం జాతి వివక్ష కాదు సావిత్రి గారు, లేని దాన్ని వున్నట్టు ప్రచారం చెయ్యడవే వివక్ష. నాకు మీ విమర్సలోనే వివక్ష కనపడుతుంది. ఆచారాల్ని తోసిరాజనే వాళ్ళమీద వివక్ష, మదుబని లాటి వెన్నెముక కలిగిన ఆడవాళ్ళ పట్ల వివక్ష, మన వెనుకనున్న మన నలుపుని ఎత్తిచూపే మహ జాబీన్ లాంటి రచయిత్రుల పట్ల వివక్ష.
అభం, శుభం తెలియని అమాయక ఆడపిల్లలు, తమకు ఈ దేశంలో ఎదో గొప్ప బతుకుందని, పుట్టి పెరిగిన దేశాన్ని, నా అనుకునే నా వాళ్ళని, కష్టం సుఖం చెప్పుకోడానికి తన వాళ్ళంటూ ఎవరూ లేని దేశానికి, భాషా, సంసృతి గురించి ఏ మాత్రం అవగాహన లేనటువంటి ఈ దేశానికి మొగుడనే వాడ్ని నమ్ముకోని వస్తే, వాడు శారీరకంగానూ, మానసికంగానూ పెట్టె హింసని కనీసం చెప్పుకోడానికి కూడా మనిషి, మార్గం తెలియని దేశంలో చారుమతిలాంటి వారి బాధలు మీకు స్టీరియో టైపుగా, వొక క్లిషే లాగా కనపడటం నిజంగా దురదృష్టం. సఖి వారి వెబ్ ప్రకారం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 393 కాల్సు, ఈమైల్సు సఖికి వచ్చాయ్. ఇందులో 355 ఫిర్యాదులు గృహ హింస గురించే. అందులో మెజారిటీ ఫిర్యాదులు న్యూయార్క్ మెట్రోపోలిటన్ ఏరియానుంచే, కానీ దాదాపు 9% ఫిర్యాదులు న్యూజెర్సీ నుంచి కూడా వున్నయని తమరు గమనించాలి. How many women have resources and inner strength to break the mold of conventional beliefs to complain to sakhi? Very few, very few. Imagine majority of women that are victims of domestic violence silently undergoing that torture, because either they have no courage to break the mold of convention or they were deprived of the resources or not aware of the institutions like SAKHI. It is not a cliché Ms. Savitri. If the story failed in literary circles, but if it has informed one woman about the help that is available (like SAKHI), it is a successful storey in my opinion.
మహ జాబీన్ గారు హైదరాబాద్ లో నిర్వహించే సఖిలాంటి సంస్థమీద మీరు ఈ కథని కారణంగాతీసుకోని వ్యాఖ్యానించడం సభ్యతకాదేవో ఆలోచించారా శ్రీమతి మాచిరాజు సావిత్రి గారూ?
ఆఖరుగా ఇది 2007 కాబట్టి సరిపోయింది. ఇదే కాని 1950ల మెకార్థి కాలం అయ్యుంటే, సావిత్రి గారి లాంటి విమర్శకుల చలవ వల్ల “cell”(cell అనే ఆంగ్ల పదం కమ్యునిష్టు తాత్వికతని సూచిస్తుందని తెలియని నా అజ్ఞానానికి చింతిస్తూ) లాంటి కమ్యునిష్టు పదజాలం వున్న కథని ప్రచురించినందుకు, ఈమాట పత్రిక, సంపాదకులు, రచయితలు, రచయిత్రులు, పాఠకులూ అందరూ బ్లాక్ లిస్ట్ లో నమోదయ్యుండే వాళ్ళు. ముఖ్యంగా సంపాదకులు, మహ జబీన్ లాంటి రచయిత్రులూ, క్రిష్ణ జన్మస్థానాన్ని పావనం చేసుండే వాళ్ళనడంలో కోంత అతిశయోక్తి వుంటే వుండొచ్చేవోగాని, కించిత్తు నిజం కూడా వుందని నా అబిప్రాయం.