ఈమాట » ఎచ్4

Expand to right
Expand to left

ఎచ్4

కరెంటు స్టౌలతో వంట
తెచ్చింది నాకు పెద్ద తంటా

బొట్టుపెట్టుకోవాలో లేదో డైలమా
డ్రైవింగ్‌లో మొదలు పెట్టాను ఓనమా

పతిదేవుడే ప్రథమగురువు
అప్పుడే మొదలైంది అసలైన తలబరువు

అయ్యాము ఇండియా పాకిస్తాను
ప్రతిరోజు యింట్లో యుద్ధం సీను

ఇద్దరి మధ్య కొన్నాళ్ళ సైలెన్స్‌
అప్పటికి వచ్చింది డ్రైవింగ్‌ లైసెన్స్‌

చేరాలిక కమ్యూనిటీ కాలేజి
నేర్వాలేదో కంప్యూటర్‌ లాంగ్వేజి
వెయ్యాలి సాఫ్ట్‌వేర్‌ జాబ్‌కి బ్యారేజి
ఇవి చెయ్యకపోతే ఏమౌతుందో నా మ్యారేజి

వీకెండులు వస్తున్నాయి
విందులతో పోతున్నాయి

“వెళదామా సరదాగా హవాయ్‌ పోనీ?”
“సారీ, నా ప్రాజెక్ట్‌ టేప్‌ ఔట్‌ హనీ!”

ఈట్రేడ్‌ మీద ఉన్న మోజు
నామీద సగమైనా లేదు

వెయ్యాలి ఇండియాకు నాలుగు నెలల ట్రిప్పు
అప్పుడు తెలిసొస్తుంది అయ్యగారికి ముప్పు

ఫస్ట్‌ మ్యారేజ్‌ యానివర్సరీ గిఫ్ట్‌
అదే మరి! ఇండియాకి టికెట్‌!!

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a