ఈమాట » భయం

Expand to right
Expand to left

భయం

గూడు వదలాలంటే భయం
అడుగు వెయ్యాలంటే భయం
ఎవరికో ఎక్కుపెట్టబడ్డ బాణం
గుండెల్లో గుచ్చుకుంటుందని కాదు

నిన్నటిలా ఎగరాలంటే భయం
నింగి నీలంలో ఈదాలంటే భయం
కొత్తకొత్త సుడిగుండాలు కళ్ళుతెరిచి
చిత్తడి గుహల్లోకి లాగేస్తాయనీ కాదు

లెక్కలేనన్ని చిదుగుల్నీ
అంటి పెట్టుకున్న ఆకుల్నీ
ఆనవాలు పట్టలేని ఆకృతుల్నీ
సమీక్షించలేనన్ని సవ్వడుల్నీ
సమీకరించుకున్న ఆత్మీయతా
వాసం గూర్చి అసలు భయం !

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a