రచయితలకు సూచనలు
తెలుగు వెబ్ పత్రిక ఈమాట ప్రపంచం నలుమూలల్లో ఉన్న రచయితలందరి దగ్గర్నుంచి రచనల్ని ఆహ్వానిస్తోంది.
ఈమాట లో కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇతర ఆసక్తికరమైన రచనలు ప్రచురిస్తాం. కథలు, వ్యాసాల విషయంలో ప్రవాసాంధ్రుల జీవన విధానాలు, అనుభవాలు, అనుభూతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా తెలుగు సంస్కృతీ సమాజాలకి సంబంధించిన ఏ రచనలైనా ప్రచురించబడతాయి. ఈమాట ఆశయాలు ముఖ్యంగా:
- తెలుగు వారి అనుభవాల్ని అనుభూతుల్నీ జీవనాన్నీ జీవితాన్నీ ప్రతిబింబించే రచనలకి, రచయితలకి ఒక వేదిక కల్పించటం
- ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండడం.
- ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేటట్టు చూడటం.
తోటి రచయితలచే సమీక్షలు (Peer Reviews)
మంచి సాహిత్యానికి తోటి రచయితల సమీక్ష, విమర్శ మేలు చేస్తుంది తప్పితే కీడు చేయదు అన్నది మా బలమైన నమ్మకం. అందుకే ఈమాటకు వచ్చే రచనల ప్రచురణపై Peer Review పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం. ఈమాట రచయితలూ కవులే మాకు సమీక్షకులు కూడా. ఈమాటకు మీరు పంపే రచనల్ని మొదట మేము (సంపాదకులు) సమీక్షిస్తాం. ఆపైన, అవసరమైతే కనీసం ఇద్దరు సమీక్షకులకు పంపి, వారి సూచనల ఆధారంగా రచనల ప్రచురణార్హత నిర్ణయిస్తాం. సంపాదకులు, సమీక్షకులు రచనకు సూచించిన మార్పులు, చేర్పులు రచయితలు చేసిన తరువాత* రచనలను ప్రచురణకు తగిన విధంగా పరిష్కరించి ప్రచురిస్తాము. ఈమాట స్థాయికి తగినట్లు రచనలకు చిన్న చిన్న మార్పులు చేసే అధికారం సంపాదకులకు ఉంటుంది. ఒకవేళ రచయితలకి మార్పులు నచ్చక పోతే, మార్పులు చేయకుండా ప్రచురించడం మాకు ఇష్టం లేకపోతే, వారి రచన ప్రచురింపబడదు. అది రచయిత ఉపసంహరించుకోవడమో, మేము తిరస్కరించడమో జరుగుతుంది. ఈ ప్రక్రియకు వీలుగా మీ రచనలని సంచిక ప్రచురణ తేదీకి కనీసం 20 రోజుల ముందుగా పంపాలి. ఆలస్యంగా అందిన రచనలను తరువాతి సంచికలో ప్రచురణకు పరిశీలిస్తాము.
(* ఈ రివ్యూ పద్ధతి తెలుగు రచయితలకు కొత్త. వారి రచనకు తగిన గౌరవం ఇస్తారో లేదో అనే భయమో, సంపాదకుల, సమీక్షకుల విద్వత్తూ, అర్హతల మీద అపనమ్మకమో ఇతరత్రా మరే కారణాల వల్లనో రచయితలలో జంకు కలగడం సహజం. అందువల్ల, మేము మార్పులూ చేర్పులూ చేసిన తరువాత రచయితలకు ప్రివ్యూ చూపించి వారికి నచ్చి, ఒప్పుకున్న తర్వాతే వారి కథనూ, కవితనూ, వ్యాసాన్నీ ఈమాటలో ప్రచురిస్తాం. ఈ ప్రివ్యూ పద్ధతి ఈమాటకు ప్రత్యేకం.)
రచయితలకు ముఖ్య గమనికలు
- ఇంతకు ముందు మరొక పత్రికలో ఎక్కడైనా ప్రచురించిన, లేదా ప్రచురణకు పరిశీలించబడుతున్న సమకాలీన రచనలు ఈమాటలో ప్రచురించబడవు. అదే విధంగా, ఇంటర్నెట్లో, వెబ్ పత్రికలలో, స్వంత బ్లాగులలో, ఇతర వెబ్ సైట్లలో ప్రచురించబడిన రచనలకు కూడా ఈమాటలో ప్రచురణార్హత ఉండదు. అయితే, సంపాదకులు గతకాలం నుంచి కొన్ని అరుదైన రచనల్ని తిరిగి ఈమాటలో పాఠకుల కోసం ప్రచురించడం ఈ నిబంధనకు మినహాయింపు.
- రచనలు తమ స్వంతమనీ, మునుపెక్కడా ప్రచురించ లేదనీ, వేరే పత్రికల వద్ద పరిశీలనకు లేదనీ రచయితలు హామీ ఇవ్వాలి.
- ప్రచురణార్హత విషయంలో ఈమాట సంపాదకులదే తుది నిర్ణయం.
- ఈమాటలో ప్రచురింపబడిన రచనలను అచ్చుపత్రికలు, ఇతర సంకలనాలలో తిరిగి ప్రచురించుకోవడానికి రచయితలకి సర్వాధికారాలు ఉంటాయి. అయితే, రచయితలు తమ రచనలను వేరే వెబ్సైట్లలో మళ్ళీ ప్రచురింపదల్చుకుంటే, వారు తమ రచన మొత్తమంతా కాకుండా, అందులో కొన్ని భాగాలు (excerpts) మాత్రమే ఉటంకిస్తూ, ఈమాటలో పూర్తి రచనకి లింకు జతచేయాలి (తమ సొంత వెబ్సైట్ లేదా బ్లాగులు దీనికి మినహాయింపు - వీటిలో రచయితలు ఈమాటకు లింకునిచ్చి తమ పూర్తి రచనని తిరిగి ప్రచురించుకోవచ్చు). అచ్చుపత్రికలు లాంటి ఇతర మాధ్యమాలలో పునః ప్రచురణకు పంపేటప్పుడు ఆ రచన ఈమాటలో ముందు ప్రచురించబడిందని ఆయా పత్రికా సంపాదకులకు తెలియజేయాలి.
రచనలు పంపే పద్ధతి
- రచయితలు తమ రచనల్ని submissions AT eemaata.com కి ఈమెయిల్ ద్వారా పంపాలి. రచనలని టెక్స్ట్ ఫైళ్ళ రూపంలో పంపడం ఉత్తమం. తమ రచనలతో పాటు చిత్రాలు జత చేయదల్చుకున్నవారు ఆయా చిత్రాల కాపీరైటు నిబంధనలకి లోబడి వ్యవహరించాలి. ఎక్కువ చిత్రాలు పంపే ముందు సంపాదకులని సంప్రదించడం మంచిది. రచయితలు తమ రచనలతోబాటు తమ ఫోటో, వివరాలు కూడా జత చేయవచ్చు.
- రచయితలు తమ రచనల్ని R.T.S. లో కానీ, యూనికోడ్ లో కానీ టైపు చేసి పంపవచ్చు. రచయితల సౌలభ్యం కోసం తెలుగులో టైపు చేయడానికి సహాయపడే పరికరాలు కొన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాం.
- కేవలం పీ.డీ.ఎఫ్ (pdf), లేదా చేతివ్రాత స్కాన్ చేసి బొమ్మల (jpg, gif వగైరా) రూపంలో పంపిన రచనలు పరిశీలించబడవు.
- తమ రచనల్ని శ్రవ్య రూపంలో పంపదలుచుకున్న వారు ఎంపీత్రీ (MP3) ఫార్మాట్లో కానీ, రియల్ ఆడియో (Real Audio) ఫార్మాట్లో కానీ పంపితే మంచిది. అలా కుదరని వారు మాతో సంప్రదిస్తే వేరే మార్గాలు సూచించగలం.
ఇతరత్రా సందేహలుంటే, పైన సూచించిన ఈమెయిల్ అడ్రస్‌కు మీ ప్రశ్నలు పంపవచ్చు, లేదా ఈ పేజీలో ఉన్న అభిప్రాయాల పెట్టెలో రాసి పంపవచ్చు. సాధ్యమైనంత త్వరలో సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాం.
K.S.Hareesh Kumar అభిప్రాయం:
May 12, 2006 8:12 am
We congratulate you for the excellent contribution for the cause of telugu. Your editorial team has done exceedingly well in portraying this magazine. It goes a long way in the development of telugu. It is a great pleasure and satisfaction to browse through the various sections of this magazine and hope that your team would continue to endeavour to instill a sense of pride among all telugus.
Deepak అభిప్రాయం:
September 12, 2006 8:07 am
ఇవ్వాలే ఈ నైటు చూసాను.. ఫస్ట్ యునికోడ్ తెలుగు నైటు.. తెలుగు వ్రాయటం కొంచం కష్టం అయినా వ్రాయగలిగాను. ముచ్చట వేసింది.. కీప్ అప్ ది గుడ్ వర్క్
వుంటాను
దీపక్
శ్రీకాంత్ రెడ్డి లంకిరెడ్డి అభిప్రాయం:
October 10, 2006 10:56 pm
మీ web site చాలా బాగుంది. Site in Telugu with following all standards like unicode, and even RSS feeds! Great!!
నేను మీ web site లోని కళా పూర్ణోదయం పుస్తకాన్ని అందరికీ distribute చెయ్యొచ్చా!
సందేహం: Firefox లో ఎందుకు ఇంత neat గా తెలుగు కనిపించట్లేదు.???
swarup krishna అభిప్రాయం:
November 5, 2006 9:04 am
మీ మాగజైను చాలా బాగున్నది. మీ కృషి ఫలించాలనీ ఆశిస్తూ
Sudhama అభిప్రాయం:
November 18, 2006 6:00 am
మీ ప్రయత్నం చాలా బాగుంది.ఇన్నాళ్ళూ ఎందుకు చూడలేదా అనుకున్నాను.అభినందనలు.-సుదామ.
bharathi అభిప్రాయం:
December 15, 2006 6:42 pm
I think “సాధారణ మెయల్” means postal address . right?
I had reread couple of times to understand it.
May be it can be re written as “చిరునామా”.
Please don’t think other wise. My intention here is not to find mistakes. I am just suggesting alternative to avoid confusion between postal mail address and email address
John Hyde Kanumuri అభిప్రాయం:
January 18, 2007 7:06 am
Viewed 1st time in unicode.
its wonderful
John Hyde Kanumuri, Hyderabad
Dr.K. Sujatha అభిప్రాయం:
January 28, 2007 10:54 pm
Being outside India we miss terribly telugu literature especially meaningful discussions.
It is good today I came across your website. You are doing agreat service.Congrtaulations.
Dr.K. Sujatha
Canberra ,Australia
మిరపకాయ్ అభిప్రాయం:
March 16, 2007 6:15 pm
మీ ప్రయత్నం అద్భుతం . వెబ్ సైట్ డిజైన్ కూడా చాలా చక్క గా ఉంది , కళ్ళు మిరుమిట్లు గొలిపే బ్యానర్లు లేకుండా చూడగానే చదవాలనిపించేట్టు .
Khaja అభిప్రాయం:
April 8, 2007 11:24 pm
ఈ మాట బాగుంది. ఇందులో మీ మాటలూ బాగున్నాయి.
ఖాజా, హైదరాబాద్
kompella ramakrishna murty అభిప్రాయం:
April 13, 2007 7:01 am
ఇప్పుడే ఈ సైట్ చూసాను.చాలా ఆనందం కలిగింది.దీనిలో ఇండియాలో ఉన్న
రచయితల రచనలు ప్రచురించరా?
రచనలు ఎలా పంపాలి
ఇలా తెలుగులో టైప్ చేసి పంపవచ్చునా
తెలుగు పీపుల్.కామ్ కు రచనలు పంపగల్గుతున్నాం.అలాగే దీనికి కూడా
పంపగల మార్గం సూచించండి.
Vamshidhar Kudikala అభిప్రాయం:
May 14, 2007 6:22 am
ఈ రోజే మీ సైటు చూశాను. చాలా బగుంది. మీకు నా అభినందనలు.
ఇందులోని గ్రంధలయములో మరిన్ని పుస్తకాలు చోటుచేసుకుంటాయని ఆశిస్తున్నాను.
ఇందులో పంపిన రచనలు ప్రచురించేది లేనిది ముందుగా రచయితలకు మెయిల్ ద్వార తెలియజేస్తారా? ప్రచురణకు ఎంత సమయం పడుతుందో తెలుపగలరు.
వంశీధర్ కుడికాల
perugu.ramakrishna అభిప్రాయం:
May 15, 2007 6:43 am
ఈమాట.కామ్ చూసాను. చాలా బాగుంది. ఉత్తమ సాహిత్యం అందిస్తున్నందుకు
ధన్యవాదాలు.
పెరుగు రామకృష్ణ
pallam madhavi latha అభిప్రాయం:
July 10, 2007 12:00 am
10/07/2007,
వరంగల్లు,
నమస్కారం,
ఇప్పుదడే ఈ సైటు చూసాను బాగున్నది.భారత దేశం లో ఉన్న రచయితల రచనలు ప్రచురణకు అవకాశం లేదా,తెలుపగలరు.
శ్రవణం లో పంపాలంటే ఏ విధంగా పంపాలో,విధము తెలుపగలరు.
ధన్యవాదాలతో
సాహితీ అభిమాని
పల్లం్ మాధవీ లత
Purnapragnabharathy అభిప్రాయం:
July 30, 2007 10:04 am
ఈ పత్రికను మొట్టమొదటి సారి చదివినప్పుడు చాలా ఆనందం అనుభవించాను. నేను హైదరాబాదులో ఉంటాను. నేను నా రచనలని పంపవచ్చా?
santhosh అభిప్రాయం:
August 7, 2007 8:08 am
ప్రియమైన ఎడిటర్ గారికి,
మీ website చూడముచ్చటగ వుంది. మీ ప్రయత్నానికి జోహార్లు.
ధన్యవాదములు
ఇట్లు
సంతోష్ కుమార్
keshav అభిప్రాయం:
September 6, 2007 6:53 am
మీ ప్రయత్నం చాలా బాగుంది. అభినందనీయం.
rajay అభిప్రాయం:
September 17, 2007 5:50 am
మీ ఈ మాట పత్రిక బాగున్నది. ఇందులోని కథలు కూడా బాగున్నవి.
మీ పత్రిక ముందు ముందు బాగా ముందుకు సాగాలని ఆశిస్తూ
శుభకామనలతో
జయ.
swarupkrishna అభిప్రాయం:
September 18, 2007 4:01 am
ధన్యవాదాలు.
తెలుగులో ఒక మంచి పత్రికను అందించినందుకు అభినందనలు. కన్యాశుల్కం ప్రత్యేక సంచిక బాగుంది.
నమస్కారములతో
స్వరూప కృష్ణ
apchowdary అభిప్రాయం:
September 19, 2007 9:11 am
ఈ మాట పత్రిక బాగున్నది. ఇందులోని కథలు కూడా బాగున్నవి. ఇందులో మీ మాటలూ బాగున్నాయి.
This site is excellent! keep up the good work!
apchowdary
Hyderabad
srinivasaraoachalla అభిప్రాయం:
October 21, 2007 9:26 am
నమస్కారం ! ఈ మాట చాలా బాగుంది. మా ప్రాణం భారత దేశం.మా ప్రణవం భారత దేశం. అని మనస్పూర్తి గా నమ్మి ఆ దేశ భాషలందు లెస్స
అయిన తెలుగు భాష పై ఎంతో మక్కువ వుంటే తప్ప ఇలా తీర్చి దిద్దడం సాధ్యం కాదు. అభినందనలు, కృతజ్ఞతలు.
venkat అభిప్రాయం:
November 30, 2007 1:31 pm
ఈమాట చాలా బాగుంది!
ఇది చాలా అద్బుతం ముందు ముందు ఎంతో ప్రజాదరణ పొందగలరు
-
వెంకట్ , New Jersey.
Suryanarayana Saripalle అభిప్రాయం:
December 19, 2007 3:23 pm
అయ్యా
పత్రిక చూడగానే ప్రవాసం లో ఉన్న నేను పరమానంద భరితుణ్ణయ్యాను.
మిత్రుడు కొడవటిగంటి రోహిణీ ప్రసాదు గారి వ్యాసం సంగీత ప్రియులకి చాలా ఆసక్తిజనకం గాను , ప్రత్యక్ష పురాణం లాగా సందర్భోచిత ఆడియో క్లిప్పింగుల తో కూలంకషం గానూ ఉంది. పత్రిక ప్రచురణ లో మీరు నిలబెడుతున్న సాంకేతిక సాహిత్య విలువల ప్రమాణాలకి జోహార్లు !
అభినందనలతో
సూర్యనారాయణ సరిపల్లి
Syed Hussain అభిప్రాయం:
January 1, 2008 11:19 pm
చాల బాగుంది. మొదటి సారిగా చూసాను. తెలుగు భాషా పరిజ్ఞానం అంతా ఒకచోట పొందు పరచారు. అందరికి హార్ధిక అభివందనలు.
సయ్యద్ హుస్సైన్.
జెద్దహ, సౌదిఅరబియా.
pnvijaykumar అభిప్రాయం:
March 7, 2008 6:12 am
ఈ పత్రిక చాలా బాగుంది.
dresudhakar అభిప్రాయం:
March 17, 2008 3:32 am
ఈ మాట మీ మాట కాదు, మా మాట .మనందరిమాట ప్రజల మాట కాలం మాట కలకాలం కలాలమాట.
కాలంమీద మీసంతకానికి
అభినందనలతొ……….
మీ… డా.ఈదూరు. సుధాకర్
అద్యక్షులు
నెల్లూరు జిల్లా రచయితల సంగం
నెల్లూరు
sasidhar pingali అభిప్రాయం:
March 29, 2008 1:26 am
ఆర్యా !
మీ సంపాదకత్వంలో వెలువడే ఈమాట చాలా హృద్యంగా వున్నది. అభినందనలు. మా కుటుంబ సభ్యులు కొన్ని సాంప్రదాయక కవిత్వం లో పద్యాలు వ్రాశారు. నేనూ కొన్ని కవితలు వ్రాయడం జరిగింది. ఆయితె అవి ఎక్కడికీ ప్రచురణార్థం పంపలేదు. మీకు ఎలా పంపగలమో తెలుపగలరు. మా వద్ద లికిత తెలుగు సాఫ్ట్ వేరుంది. అందులొ పంపవచ్చా? లేదా ఎలా పంపాలో తెలుప గలరు.
ధన్యవాదములు
పింగళి శశిధర
venu అభిప్రాయం:
March 30, 2008 12:46 am
తెలుగు భాషాభివృద్ధికై మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందించదగ్గది.
chokkakula prasad అభిప్రాయం:
April 30, 2008 9:12 am
నమష్కారములు.
వూడితేగాని పన్ను విలువ తెలియదు, వదిలితేగాని తెలుగు విలువ తెలియదు. ఇక్కడకు వచ్చాక మంచి సాహిత్యం ఈమాట ద్వారా చదివే అవకాశం కలిగినందుకు ఆనందంగా వుంది. కృతజ్ఞతలు.
చొక్కాకుల ప్రసాద్
మాంట్రియల్, కెనడా
శివకుమార్ దిన్నిపాటి అభిప్రాయం:
June 3, 2008 2:40 am
అయ్యా ముందుగా నమస్కారములు,
మీ యొక్క భాషాభిమానానికి, మన భాషకు మీరు చేస్తున్న కృషికి మీరు అభినందనీయులు. మీ ఈమాట మరిన్ని హంగులతో అందరిని అలరించాలని సహృదయంతో,
శివకుమార్ దిన్నిపాటి.
దుబాయ్ - యునైటెడ్ అరబ్ యెమిరేట్స్
Saisahithi అభిప్రాయం:
July 7, 2008 8:33 am
అందరికి నమస్కారములు,
మీ పత్రిక చాలా బాగుంది. దీనిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న మీకృషి
అధ్భుతంగా ఉంది.
bhaavana అభిప్రాయం:
July 14, 2008 11:55 pm
నిన్నటి దాకా కూనలైనట్టి భావాలు
రెక్కలు విప్పార్చుకుని ఎగురుతూన్నట్టి నేటి పద్యాలు
“ఈ మాట”విశాల నీలి గగనంలో.
Dr.Jonnalagadda Markandeyulu అభిప్రాయం:
August 5, 2008 11:33 pm
మీ పత్రిక బాగుంది. ఈమాట మనమాటగా ఆంధ్రులందరిదీ అనిపించేలా పత్రికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్న సంపాదకవర్గానికి ఒక రచయితగా నా అభినందనలు.
డా. జొన్నలగడ్డ మార్కండేయులు
పేరవరం-533235-తూ.గో.జిల్లా ఆంథ్ర ప్రదేశ్
Nirmala Kondepudi అభిప్రాయం:
August 28, 2008 8:38 am
మీ పత్రిక బావుంది చాలా చాలా….అభినందనలు.
"Vidyavachaspati" Prof Dr N N Murthy అభిప్రాయం:
September 7, 2008 2:18 am
పత్రిక చూడగానే ప్రవాసం లో ఉన్న నేను పరమానంద భరితుణ్ణయ్యాను. మీ పత్రిక బాగుంది.
నేనూ కొన్ని కవితలు వ్రాయడం జరిగింది. ఆయితె అవి ఎక్కడికీ ప్రచురణార్థం పంపలేదు. మీకు ఎలా పంపగలమో తెలుపగలరు. మా వద్ద లికిత తెలుగు సాఫ్ట్ వేరుంది. అందులొ పంపవచ్చా? లేదా ఎలా పంపాలో తెలుప గలరు.
“విద్యావాచస్పతి” డా. నరసింహ ముర్తి
Audisesha Reddy Kypu అభిప్రాయం:
September 15, 2008 5:52 am
eemaata.com చూశాను బాగుంది. మంచి కథలు, కవితలతో చూడ చక్కగా వుంది. నిర్వాహకులకు ధన్యవాదాలు.
— కైపు ఆదిశేషా రెడ్డి, రచయిత.
23-1-1256 , అరవింద నగర్ ,
నెల్లూరు - 524 003 ( ఆం .ప్ర ))
KATTULA.VENKATESWARARAO అభిప్రాయం:
September 15, 2008 10:50 pm
మీ పత్రిక చాలా బాగుంది. నేనూ కొన్ని కవితలు వ్రాయడం జరిగింది. అయితే అవి ఎక్కడికీ ప్రచురణార్థం పంపలేదు. మీకు ఎలా పంపగలమో తెలుపగలరు.
కె.వి.రావు.
[కె. వి. రావు గారు, రచయితలకు సూచనలు మరొకసారి చదవమని మనవి. — సంపాదకులు]
Saisahithi అభిప్రాయం:
October 17, 2008 4:13 pm
మీ పత్రిక చాలా బాగుంటుంది.
సమకాలీన రచయితలకి స్థానం కల్పిస్తూ, అనేక సాహిత్య విషయాలను పరిచయం చేసే మీ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.
katti ramdas అభిప్రాయం:
November 4, 2008 9:22 am
బాగుందండి. ఛాలా బాగుంది ఈ వెబ్ సైటు.
Syed అభిప్రాయం:
November 6, 2008 9:40 am
ఈ మాట Team members అందరికి నా హ్రుదయపూర్వ అభివందనాలు.తెలుగు ప్రజలకు చాల మంచి site ఇచ్చారు.
sammeta umadevi అభిప్రాయం:
December 2, 2008 11:25 pm
తెలుగులో ఇలాంటి పత్రికను తెస్తున్న మీరు చాలా అభినందనీయులు. మీరు భారతదేశంలొ వారికి కూడా రచనలు పంపమని అవకాశం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు మరిన్ని మంచి రచనలు మీ పత్రికలో చదవగలమని ఆశిస్తున్నాం.
V V Raju అభిప్రాయం:
December 25, 2008 2:08 am
ఈమాట తెలుగు పత్రిక ఒక మంచి ఆలోచన. తెలుగు భాషకు మీరు ఈవిధంగా సేవ చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపొతున్నాను. మీకు తెలుగుతల్లి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి.
—— వి వి రాజు
Dr.tadepalli patanjali అభిప్రాయం:
December 30, 2008 1:06 am
నమస్తే. మీ నవంబరు సంచిక చూసాను. మీ ప్రయత్నం అభినందనీయం
-డా.తాడేపల్లి పతంజలి
Babu RVB అభిప్రాయం:
January 4, 2009 8:18 am
‘ఈమాట’ ప్రచురణ కర్తలకు శుభాభివందనములు. దండాలండీ .
ఒకమాట. తెలుగు లోని ‘అచ్చ తెలుగు’ క్రమంగా కనుమరుగమతోంది. అవును సంస్కృతం, ఆంగ్లం ఇవన్నీ తెలుగు భాషకు వన్నెతెచ్చి మెరుగులు దిద్ది ఉండవచ్చు. పదజాలాన్ని పెంచి యుండవచ్చు తద్వారా తెలుగును మరింత ఆధునిక భాషగా రూపొందిచి ఉండవచ్చు. ఐతే తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చిన ఈ సందర్భంలో మనం అంతా గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. అదే తెలుగు లోని ‘తెలుగు’ను కాపాడుకోవడం. నిజం. ఎన్నెన్ని అచ్చతెలుగు పదాలు మన కళ్ళ ముందే అదృశ్యం కావటం… సారీ… కనుమరుగు అవ్వడం లేదూ?
తెలుగంటే సంస్కృతం కాదు, అరవం కాదు ఆంగ్లం కాదు. తెలుగంటే తెలుగే కదా! మెరుగులు మెరుగులుగానే ఉండాలిగాని ‘అసలు’ను మరుగుపరచేదిగా ఉండకూడదుకదా!
ఉదాహరణకు మన ఈ ‘ఈ మాట’ సయిట్‌లోనే ఈ క్రింది మార్పులు చేయుచ్చుకదా.
ఎలాగంటే, సెర్చ్ అంటే ‘శోధన’ బదులూ ‘వెతకండి’ అనీ అడ్వాస్డ్ సెర్చ్ ‘మరింత వెదకండి’ అనీ .
అలానే హోంపేజ్ ‘ముఖపత్రము’ కాకుండా ‘మా ముంగిలి’ కావచ్చు కదా . అలాగనే ‘పాఠకుల అభిప్రాయాలు’ మారి ‘మీ యడద’ కావచ్చేమో.
చివరిగా ఈ కింది పదాలను ఎన్నాళ్ల క్రితం వాడి ఉంటారూ? ‘సముద్రము’ బదులుగా ‘కడలి’ అనీ ‘మనసు’ కాకుండా ‘మది’ అనీ ‘హృదయము’ బదులూ ‘గుండియ’ అనీ .
ఇంకా ఎన్నో! ప్రారంభిద్దాం, ‘సారీ’, మొదలెడదాం! తెలుగును రక్షించు కుందాం! సరేనా?
బై. వీడుకోలు.
[గమనిక: మీ అభిప్రాయాలు తెలియపర్చడానికి, దయచేసి నాన్-యూనికోడ్ ఫాంట్లు (హేమలత, ఈనాడు, శ్రీ900 వగైరా) వాడకండి. RTS లేదా యూనికోడ్ వాడితే, లేదా నేరుగా మా అభిప్రాయాల పెట్టెలోనే టైపు చేస్తే ప్రచురణకు సులభంగా వుంటుంది - సం.]