రచయితలకు సూచనలు
తెలుగు వెబ్ పత్రిక ఈమాట ప్రపంచం నలుమూలల్లో ఉన్న రచయితలందరి దగ్గర్నుంచి రచనల్ని ఆహ్వానిస్తోంది.
ఈమాట లో కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇతర ఆసక్తికరమైన రచనలు ప్రచురిస్తాం. కథలు, వ్యాసాల విషయంలో ప్రవాసాంధ్రుల జీవన విధానాలు, అనుభవాలు, అనుభూతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా తెలుగు సంస్కృతీ సమాజాలకి సంబంధించిన ఏ రచనలైనా ప్రచురించబడతాయి. ఈమాట ఆశయాలు ముఖ్యంగా:
- తెలుగు వారి అనుభవాల్ని అనుభూతుల్నీ జీవనాన్నీ జీవితాన్నీ ప్రతిబింబించే రచనలకి, రచయితలకి ఒక వేదిక కల్పించటం
- ఈ వేదికను రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉంచడం.
- ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేటట్టు చూడటం.
తోటి రచయితలచే సమీక్షలు (Peer Reviews)
మంచి సాహిత్యానికి తోటి రచయితల సమీక్ష, విమర్శ మేలు చేస్తుంది తప్పితే కీడు చేయదు అన్నది మా బలమైన నమ్మకం. అందుకే ఈమాటకు వచ్చే రచనల ప్రచురణపై Peer Review పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం. ఈమాట రచయితలూ కవులే మాకు సమీక్షకులు కూడా. ఈమాటకు మీరు పంపే రచనల్ని మొదట మేము (సంపాదకులు) సమీక్షిస్తాం. ఆపైన, అవసరమైతే కనీసం ఇద్దరు సమీక్షకులకు పంపి, వారి సూచనల ఆధారంగా రచనల ప్రచురణార్హత నిర్ణయిస్తాం. సంపాదకులు, సమీక్షకులు రచనకు సూచించిన మార్పులు, చేర్పులు రచయితలు చేసిన తరువాత రచనలను ప్రచురణకు తగిన విధంగా పరిష్కరించి ప్రచురిస్తాము. ఈమాట స్థాయికి తగినట్లు రచనలకు చిన్న చిన్న మార్పులు చేసే అధికారం సంపాదకులకు ఉంటుంది. ఒకవేళ రచయితలకి మార్పులు నచ్చక పోతే, మార్పులు చేయకుండా ప్రచురించడం మాకు ఇష్టం లేకపోతే, వారి రచన ప్రచురింపబడదు. అది రచయిత ఉపసంహరించుకోవడమో, మేము తిరస్కరించడమో జరుగుతుంది. ఈ ప్రక్రియకు వీలుగా మీ రచనలని సంచిక ప్రచురణ తేదీకి కనీసం 20 రోజుల ముందుగా పంపాలి. ఆలస్యంగా అందిన రచనలను తరువాతి సంచికలో ప్రచురణకు పరిశీలిస్తాము.
ఈ రివ్యూ పద్ధతి తెలుగు రచయితలకు కొత్త. వారి రచనకు తగిన గౌరవం ఇస్తారో లేదో అనే భయమో, సంపాదకుల, సమీక్షకుల విద్వత్తూ, అర్హతల మీద అపనమ్మకమో ఇతరత్రా మరే కారణాల వల్లనో రచయితలలో జంకు కలగడం సహజం. అందువల్ల, మేము మార్పులూ చేర్పులూ చేసిన తరువాత రచయితలకు ప్రివ్యూ చూపించి వారికి నచ్చి, ఒప్పుకున్న తర్వాతే వారి కథనూ, కవితనూ, వ్యాసాన్నీ ఈమాటలో ప్రచురిస్తాం. ఈ ప్రివ్యూ పద్ధతి ఈమాటకు ప్రత్యేకం.
రచయితలకు ముఖ్య గమనికలు
- ఇంతకు ముందు మరొక పత్రికలో ఎక్కడైనా ప్రచురించిన, లేదా ప్రచురణకు పరిశీలించబడుతున్న సమకాలీన రచనలు ఈమాటలో ప్రచురించబడవు. అదే విధంగా, ఇంటర్నెట్లో, వెబ్ పత్రికలలో, స్వంత బ్లాగులలో, ఇతర వెబ్ సైట్లలో ప్రచురించబడిన రచనలకు కూడా ఈమాటలో ప్రచురణార్హత ఉండదు. అయితే, సంపాదకులు గతకాలం నుంచి కొన్ని అరుదైన రచనల్ని తిరిగి ఈమాటలో పాఠకుల కోసం ప్రచురించడం ఈ నిబంధనకు మినహాయింపు.
- రచనలు తమ స్వంతమనీ, మునుపెక్కడా ప్రచురించ లేదనీ, వేరే పత్రికల వద్ద పరిశీలనకు లేదనీ రచయితలు హామీ ఇవ్వాలి.
- ప్రచురణార్హత విషయంలో ఈమాట సంపాదకులదే తుది నిర్ణయం.
- ఈమాటలో ప్రచురింపబడిన రచనలను అచ్చుపత్రికలు, ఇతర సంకలనాలలో తిరిగి ప్రచురించుకోవడానికి రచయితలకి సర్వాధికారాలు ఉంటాయి. అయితే, రచయితలు తమ రచనలను వేరే వెబ్సైట్లలో మళ్ళీ ప్రచురింపదల్చుకుంటే, వారు తమ రచన మొత్తమంతా కాకుండా, అందులో కొన్ని భాగాలు (excerpts) మాత్రమే ఉటంకిస్తూ, ఈమాటలో పూర్తి రచనకి లింకు జతచేయాలి (తమ సొంత వెబ్సైట్ లేదా బ్లాగులు దీనికి మినహాయింపు - వీటిలో రచయితలు ఈమాటకు లింకునిచ్చి తమ పూర్తి రచనని తిరిగి ప్రచురించుకోవచ్చు. ఐతే, మరుసటి రోజే కాకుండా కనీసం రెండు వారాల వ్యవధిని ఇవ్వమని మా విన్నపం). అచ్చుపత్రికలు లాంటి ఇతర మాధ్యమాలలో పునః ప్రచురణకు పంపేటప్పుడు ఆ రచన ఈమాటలో ముందు ప్రచురించబడిందని ఆయా పత్రికా సంపాదకులకు తెలియజేయాలి.
రచనలు పంపే పద్ధతి
- రచయితలు తమ రచనల్ని submissions AT eemaata.com కి ఈమెయిల్ ద్వారా పంపాలి. రచనలని టెక్స్ట్ ఫైళ్ళ రూపంలో పంపడం ఉత్తమం. తమ రచనలతో పాటు చిత్రాలు జత చేయదల్చుకున్నవారు ఆయా చిత్రాల కాపీరైటు నిబంధనలకి లోబడి వ్యవహరించాలి. ఎక్కువ చిత్రాలు పంపే ముందు సంపాదకులని సంప్రదించడం మంచిది. రచయితలు తమ రచనలతోబాటు తమ ఫోటో, వివరాలు కూడా జత చేయవచ్చు.
- రచయితలు తమ రచనల్ని R.T.S. లో కానీ, యూనికోడ్ లో కానీ టైపు చేసి పంపవచ్చు. రచయితల సౌలభ్యం కోసం తెలుగులో టైపు చేయడానికి సహాయపడే పరికరాలు కొన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాం.
- కేవలం పీ.డీ.ఎఫ్ (pdf), లేదా చేతివ్రాత స్కాన్ చేసి బొమ్మల (jpg, gif వగైరా) రూపంలో పంపిన రచనలు పరిశీలించబడవు.
- తమ రచనల్ని శ్రవ్య రూపంలో పంపదలుచుకున్న వారు ఎంపీత్రీ (MP3) ఫార్మాట్లో కానీ, రియల్ ఆడియో (Real Audio) ఫార్మాట్లో కానీ పంపితే మంచిది. అలా కుదరని వారు మాతో సంప్రదిస్తే వేరే మార్గాలు సూచించగలం.
ఇతరత్రా సందేహలుంటే, పైన సూచించిన ఈమెయిల్ అడ్రస్‌కు మీ ప్రశ్నలు పంపవచ్చు, లేదా ఈ పేజీలో ఉన్న అభిప్రాయాల పెట్టెలో రాసి పంపవచ్చు. సాధ్యమైనంత త్వరలో సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాం.
K.S.Hareesh Kumar అభిప్రాయం:
May 12, 2006 8:12 am
We congratulate you for the excellent contribution for the cause of telugu. Your editorial team has done exceedingly well in portraying this magazine. It goes a long way in the development of telugu. It is a great pleasure and satisfaction to browse through the various sections of this magazine and hope that your team would continue to endeavour to instill a sense of pride among all telugus.
Deepak అభిప్రాయం:
September 12, 2006 8:07 am
ఇవ్వాలే ఈ నైటు చూసాను.. ఫస్ట్ యునికోడ్ తెలుగు నైటు.. తెలుగు వ్రాయటం కొంచం కష్టం అయినా వ్రాయగలిగాను. ముచ్చట వేసింది.. కీప్ అప్ ది గుడ్ వర్క్
వుంటాను
దీపక్
శ్రీకాంత్ రెడ్డి లంకిరెడ్డి అభిప్రాయం:
October 10, 2006 10:56 pm
మీ web site చాలా బాగుంది. Site in Telugu with following all standards like unicode, and even RSS feeds! Great!!
నేను మీ web site లోని కళా పూర్ణోదయం పుస్తకాన్ని అందరికీ distribute చెయ్యొచ్చా!
సందేహం: Firefox లో ఎందుకు ఇంత neat గా తెలుగు కనిపించట్లేదు.???
swarup krishna అభిప్రాయం:
November 5, 2006 9:04 am
మీ మాగజైను చాలా బాగున్నది. మీ కృషి ఫలించాలనీ ఆశిస్తూ
Sudhama అభిప్రాయం:
November 18, 2006 6:00 am
మీ ప్రయత్నం చాలా బాగుంది.ఇన్నాళ్ళూ ఎందుకు చూడలేదా అనుకున్నాను.అభినందనలు.-సుదామ.
bharathi అభిప్రాయం:
December 15, 2006 6:42 pm
I think “సాధారణ మెయల్” means postal address . right?
I had reread couple of times to understand it.
May be it can be re written as “చిరునామా”.
Please don’t think other wise. My intention here is not to find mistakes. I am just suggesting alternative to avoid confusion between postal mail address and email address
John Hyde Kanumuri అభిప్రాయం:
January 18, 2007 7:06 am
Viewed 1st time in unicode.
its wonderful
John Hyde Kanumuri, Hyderabad
Dr.K. Sujatha అభిప్రాయం:
January 28, 2007 10:54 pm
Being outside India we miss terribly telugu literature especially meaningful discussions.
It is good today I came across your website. You are doing agreat service.Congrtaulations.
Dr.K. Sujatha
Canberra ,Australia
మిరపకాయ్ అభిప్రాయం:
March 16, 2007 6:15 pm
మీ ప్రయత్నం అద్భుతం . వెబ్ సైట్ డిజైన్ కూడా చాలా చక్క గా ఉంది , కళ్ళు మిరుమిట్లు గొలిపే బ్యానర్లు లేకుండా చూడగానే చదవాలనిపించేట్టు .
Khaja అభిప్రాయం:
April 8, 2007 11:24 pm
ఈ మాట బాగుంది. ఇందులో మీ మాటలూ బాగున్నాయి.
ఖాజా, హైదరాబాద్
kompella ramakrishna murty అభిప్రాయం:
April 13, 2007 7:01 am
ఇప్పుడే ఈ సైట్ చూసాను.చాలా ఆనందం కలిగింది.దీనిలో ఇండియాలో ఉన్న
రచయితల రచనలు ప్రచురించరా?
రచనలు ఎలా పంపాలి
ఇలా తెలుగులో టైప్ చేసి పంపవచ్చునా
తెలుగు పీపుల్.కామ్ కు రచనలు పంపగల్గుతున్నాం.అలాగే దీనికి కూడా
పంపగల మార్గం సూచించండి.
Vamshidhar Kudikala అభిప్రాయం:
May 14, 2007 6:22 am
ఈ రోజే మీ సైటు చూశాను. చాలా బగుంది. మీకు నా అభినందనలు.
ఇందులోని గ్రంధలయములో మరిన్ని పుస్తకాలు చోటుచేసుకుంటాయని ఆశిస్తున్నాను.
ఇందులో పంపిన రచనలు ప్రచురించేది లేనిది ముందుగా రచయితలకు మెయిల్ ద్వార తెలియజేస్తారా? ప్రచురణకు ఎంత సమయం పడుతుందో తెలుపగలరు.
వంశీధర్ కుడికాల
perugu.ramakrishna అభిప్రాయం:
May 15, 2007 6:43 am
ఈమాట.కామ్ చూసాను. చాలా బాగుంది. ఉత్తమ సాహిత్యం అందిస్తున్నందుకు
ధన్యవాదాలు.
పెరుగు రామకృష్ణ
pallam madhavi latha అభిప్రాయం:
July 10, 2007 12:00 am
10/07/2007,
వరంగల్లు,
నమస్కారం,
ఇప్పుదడే ఈ సైటు చూసాను బాగున్నది.భారత దేశం లో ఉన్న రచయితల రచనలు ప్రచురణకు అవకాశం లేదా,తెలుపగలరు.
శ్రవణం లో పంపాలంటే ఏ విధంగా పంపాలో,విధము తెలుపగలరు.
ధన్యవాదాలతో
సాహితీ అభిమాని
పల్లం్ మాధవీ లత
Purnapragnabharathy అభిప్రాయం:
July 30, 2007 10:04 am
ఈ పత్రికను మొట్టమొదటి సారి చదివినప్పుడు చాలా ఆనందం అనుభవించాను. నేను హైదరాబాదులో ఉంటాను. నేను నా రచనలని పంపవచ్చా?
santhosh అభిప్రాయం:
August 7, 2007 8:08 am
ప్రియమైన ఎడిటర్ గారికి,
మీ website చూడముచ్చటగ వుంది. మీ ప్రయత్నానికి జోహార్లు.
ధన్యవాదములు
ఇట్లు
సంతోష్ కుమార్
keshav అభిప్రాయం:
September 6, 2007 6:53 am
మీ ప్రయత్నం చాలా బాగుంది. అభినందనీయం.
rajay అభిప్రాయం:
September 17, 2007 5:50 am
మీ ఈ మాట పత్రిక బాగున్నది. ఇందులోని కథలు కూడా బాగున్నవి.
మీ పత్రిక ముందు ముందు బాగా ముందుకు సాగాలని ఆశిస్తూ
శుభకామనలతో
జయ.
swarupkrishna అభిప్రాయం:
September 18, 2007 4:01 am
ధన్యవాదాలు.
తెలుగులో ఒక మంచి పత్రికను అందించినందుకు అభినందనలు. కన్యాశుల్కం ప్రత్యేక సంచిక బాగుంది.
నమస్కారములతో
స్వరూప కృష్ణ
apchowdary అభిప్రాయం:
September 19, 2007 9:11 am
ఈ మాట పత్రిక బాగున్నది. ఇందులోని కథలు కూడా బాగున్నవి. ఇందులో మీ మాటలూ బాగున్నాయి.
This site is excellent! keep up the good work!
apchowdary
Hyderabad
srinivasaraoachalla అభిప్రాయం:
October 21, 2007 9:26 am
నమస్కారం ! ఈ మాట చాలా బాగుంది. మా ప్రాణం భారత దేశం.మా ప్రణవం భారత దేశం. అని మనస్పూర్తి గా నమ్మి ఆ దేశ భాషలందు లెస్స
అయిన తెలుగు భాష పై ఎంతో మక్కువ వుంటే తప్ప ఇలా తీర్చి దిద్దడం సాధ్యం కాదు. అభినందనలు, కృతజ్ఞతలు.
venkat అభిప్రాయం:
November 30, 2007 1:31 pm
ఈమాట చాలా బాగుంది!
ఇది చాలా అద్బుతం ముందు ముందు ఎంతో ప్రజాదరణ పొందగలరు
-
వెంకట్ , New Jersey.
Suryanarayana Saripalle అభిప్రాయం:
December 19, 2007 3:23 pm
అయ్యా
పత్రిక చూడగానే ప్రవాసం లో ఉన్న నేను పరమానంద భరితుణ్ణయ్యాను.
మిత్రుడు కొడవటిగంటి రోహిణీ ప్రసాదు గారి వ్యాసం సంగీత ప్రియులకి చాలా ఆసక్తిజనకం గాను , ప్రత్యక్ష పురాణం లాగా సందర్భోచిత ఆడియో క్లిప్పింగుల తో కూలంకషం గానూ ఉంది. పత్రిక ప్రచురణ లో మీరు నిలబెడుతున్న సాంకేతిక సాహిత్య విలువల ప్రమాణాలకి జోహార్లు !
అభినందనలతో
సూర్యనారాయణ సరిపల్లి
Syed Hussain అభిప్రాయం:
January 1, 2008 11:19 pm
చాల బాగుంది. మొదటి సారిగా చూసాను. తెలుగు భాషా పరిజ్ఞానం అంతా ఒకచోట పొందు పరచారు. అందరికి హార్ధిక అభివందనలు.
సయ్యద్ హుస్సైన్.
జెద్దహ, సౌదిఅరబియా.
pnvijaykumar అభిప్రాయం:
March 7, 2008 6:12 am
ఈ పత్రిక చాలా బాగుంది.
dresudhakar అభిప్రాయం:
March 17, 2008 3:32 am
ఈ మాట మీ మాట కాదు, మా మాట .మనందరిమాట ప్రజల మాట కాలం మాట కలకాలం కలాలమాట.
కాలంమీద మీసంతకానికి
అభినందనలతొ……….
మీ… డా.ఈదూరు. సుధాకర్
అద్యక్షులు
నెల్లూరు జిల్లా రచయితల సంగం
నెల్లూరు
sasidhar pingali అభిప్రాయం:
March 29, 2008 1:26 am
ఆర్యా !
మీ సంపాదకత్వంలో వెలువడే ఈమాట చాలా హృద్యంగా వున్నది. అభినందనలు. మా కుటుంబ సభ్యులు కొన్ని సాంప్రదాయక కవిత్వం లో పద్యాలు వ్రాశారు. నేనూ కొన్ని కవితలు వ్రాయడం జరిగింది. ఆయితె అవి ఎక్కడికీ ప్రచురణార్థం పంపలేదు. మీకు ఎలా పంపగలమో తెలుపగలరు. మా వద్ద లికిత తెలుగు సాఫ్ట్ వేరుంది. అందులొ పంపవచ్చా? లేదా ఎలా పంపాలో తెలుప గలరు.
ధన్యవాదములు
పింగళి శశిధర
venu అభిప్రాయం:
March 30, 2008 12:46 am
తెలుగు భాషాభివృద్ధికై మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందించదగ్గది.
chokkakula prasad అభిప్రాయం:
April 30, 2008 9:12 am
నమష్కారములు.
వూడితేగాని పన్ను విలువ తెలియదు, వదిలితేగాని తెలుగు విలువ తెలియదు. ఇక్కడకు వచ్చాక మంచి సాహిత్యం ఈమాట ద్వారా చదివే అవకాశం కలిగినందుకు ఆనందంగా వుంది. కృతజ్ఞతలు.
చొక్కాకుల ప్రసాద్
మాంట్రియల్, కెనడా
శివకుమార్ దిన్నిపాటి అభిప్రాయం:
June 3, 2008 2:40 am
అయ్యా ముందుగా నమస్కారములు,
మీ యొక్క భాషాభిమానానికి, మన భాషకు మీరు చేస్తున్న కృషికి మీరు అభినందనీయులు. మీ ఈమాట మరిన్ని హంగులతో అందరిని అలరించాలని సహృదయంతో,
శివకుమార్ దిన్నిపాటి.
దుబాయ్ - యునైటెడ్ అరబ్ యెమిరేట్స్
Saisahithi అభిప్రాయం:
July 7, 2008 8:33 am
అందరికి నమస్కారములు,
మీ పత్రిక చాలా బాగుంది. దీనిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న మీకృషి
అధ్భుతంగా ఉంది.
bhaavana అభిప్రాయం:
July 14, 2008 11:55 pm
నిన్నటి దాకా కూనలైనట్టి భావాలు
రెక్కలు విప్పార్చుకుని ఎగురుతూన్నట్టి నేటి పద్యాలు
“ఈ మాట”విశాల నీలి గగనంలో.
Dr.Jonnalagadda Markandeyulu అభిప్రాయం:
August 5, 2008 11:33 pm
మీ పత్రిక బాగుంది. ఈమాట మనమాటగా ఆంధ్రులందరిదీ అనిపించేలా పత్రికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్న సంపాదకవర్గానికి ఒక రచయితగా నా అభినందనలు.
డా. జొన్నలగడ్డ మార్కండేయులు
పేరవరం-533235-తూ.గో.జిల్లా ఆంథ్ర ప్రదేశ్
Nirmala Kondepudi అభిప్రాయం:
August 28, 2008 8:38 am
మీ పత్రిక బావుంది చాలా చాలా….అభినందనలు.
"Vidyavachaspati" Prof Dr N N Murthy అభిప్రాయం:
September 7, 2008 2:18 am
పత్రిక చూడగానే ప్రవాసం లో ఉన్న నేను పరమానంద భరితుణ్ణయ్యాను. మీ పత్రిక బాగుంది.
నేనూ కొన్ని కవితలు వ్రాయడం జరిగింది. ఆయితె అవి ఎక్కడికీ ప్రచురణార్థం పంపలేదు. మీకు ఎలా పంపగలమో తెలుపగలరు. మా వద్ద లికిత తెలుగు సాఫ్ట్ వేరుంది. అందులొ పంపవచ్చా? లేదా ఎలా పంపాలో తెలుప గలరు.
“విద్యావాచస్పతి” డా. నరసింహ ముర్తి
Audisesha Reddy Kypu అభిప్రాయం:
September 15, 2008 5:52 am
eemaata.com చూశాను బాగుంది. మంచి కథలు, కవితలతో చూడ చక్కగా వుంది. నిర్వాహకులకు ధన్యవాదాలు.
— కైపు ఆదిశేషా రెడ్డి, రచయిత.
23-1-1256 , అరవింద నగర్ ,
నెల్లూరు - 524 003 ( ఆం .ప్ర ))
KATTULA.VENKATESWARARAO అభిప్రాయం:
September 15, 2008 10:50 pm
మీ పత్రిక చాలా బాగుంది. నేనూ కొన్ని కవితలు వ్రాయడం జరిగింది. అయితే అవి ఎక్కడికీ ప్రచురణార్థం పంపలేదు. మీకు ఎలా పంపగలమో తెలుపగలరు.
కె.వి.రావు.
[కె. వి. రావు గారు, రచయితలకు సూచనలు మరొకసారి చదవమని మనవి. — సంపాదకులు]
Saisahithi అభిప్రాయం:
October 17, 2008 4:13 pm
మీ పత్రిక చాలా బాగుంటుంది.
సమకాలీన రచయితలకి స్థానం కల్పిస్తూ, అనేక సాహిత్య విషయాలను పరిచయం చేసే మీ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.
katti ramdas అభిప్రాయం:
November 4, 2008 9:22 am
బాగుందండి. ఛాలా బాగుంది ఈ వెబ్ సైటు.
Syed అభిప్రాయం:
November 6, 2008 9:40 am
ఈ మాట Team members అందరికి నా హ్రుదయపూర్వ అభివందనాలు.తెలుగు ప్రజలకు చాల మంచి site ఇచ్చారు.
sammeta umadevi అభిప్రాయం:
December 2, 2008 11:25 pm
తెలుగులో ఇలాంటి పత్రికను తెస్తున్న మీరు చాలా అభినందనీయులు. మీరు భారతదేశంలొ వారికి కూడా రచనలు పంపమని అవకాశం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు మరిన్ని మంచి రచనలు మీ పత్రికలో చదవగలమని ఆశిస్తున్నాం.
V V Raju అభిప్రాయం:
December 25, 2008 2:08 am
ఈమాట తెలుగు పత్రిక ఒక మంచి ఆలోచన. తెలుగు భాషకు మీరు ఈవిధంగా సేవ చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపొతున్నాను. మీకు తెలుగుతల్లి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి.
—— వి వి రాజు
Dr.tadepalli patanjali అభిప్రాయం:
December 30, 2008 1:06 am
నమస్తే. మీ నవంబరు సంచిక చూసాను. మీ ప్రయత్నం అభినందనీయం
-డా.తాడేపల్లి పతంజలి
Babu RVB అభిప్రాయం:
January 4, 2009 8:18 am
‘ఈమాట’ ప్రచురణ కర్తలకు శుభాభివందనములు. దండాలండీ .
ఒకమాట. తెలుగు లోని ‘అచ్చ తెలుగు’ క్రమంగా కనుమరుగమతోంది. అవును సంస్కృతం, ఆంగ్లం ఇవన్నీ తెలుగు భాషకు వన్నెతెచ్చి మెరుగులు దిద్ది ఉండవచ్చు. పదజాలాన్ని పెంచి యుండవచ్చు తద్వారా తెలుగును మరింత ఆధునిక భాషగా రూపొందిచి ఉండవచ్చు. ఐతే తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చిన ఈ సందర్భంలో మనం అంతా గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. అదే తెలుగు లోని ‘తెలుగు’ను కాపాడుకోవడం. నిజం. ఎన్నెన్ని అచ్చతెలుగు పదాలు మన కళ్ళ ముందే అదృశ్యం కావటం… సారీ… కనుమరుగు అవ్వడం లేదూ?
తెలుగంటే సంస్కృతం కాదు, అరవం కాదు ఆంగ్లం కాదు. తెలుగంటే తెలుగే కదా! మెరుగులు మెరుగులుగానే ఉండాలిగాని ‘అసలు’ను మరుగుపరచేదిగా ఉండకూడదుకదా!
ఉదాహరణకు మన ఈ ‘ఈ మాట’ సయిట్‌లోనే ఈ క్రింది మార్పులు చేయుచ్చుకదా.
ఎలాగంటే, సెర్చ్ అంటే ‘శోధన’ బదులూ ‘వెతకండి’ అనీ అడ్వాస్డ్ సెర్చ్ ‘మరింత వెదకండి’ అనీ .
అలానే హోంపేజ్ ‘ముఖపత్రము’ కాకుండా ‘మా ముంగిలి’ కావచ్చు కదా . అలాగనే ‘పాఠకుల అభిప్రాయాలు’ మారి ‘మీ యడద’ కావచ్చేమో.
చివరిగా ఈ కింది పదాలను ఎన్నాళ్ల క్రితం వాడి ఉంటారూ? ‘సముద్రము’ బదులుగా ‘కడలి’ అనీ ‘మనసు’ కాకుండా ‘మది’ అనీ ‘హృదయము’ బదులూ ‘గుండియ’ అనీ .
ఇంకా ఎన్నో! ప్రారంభిద్దాం, ‘సారీ’, మొదలెడదాం! తెలుగును రక్షించు కుందాం! సరేనా?
బై. వీడుకోలు.
[గమనిక: మీ అభిప్రాయాలు తెలియపర్చడానికి, దయచేసి నాన్-యూనికోడ్ ఫాంట్లు (హేమలత, ఈనాడు, శ్రీ900 వగైరా) వాడకండి. RTS లేదా యూనికోడ్ వాడితే, లేదా నేరుగా మా అభిప్రాయాల పెట్టెలోనే టైపు చేస్తే ప్రచురణకు సులభంగా వుంటుంది - సం.]
Malathi Nidadavolu అభిప్రాయం:
January 8, 2009 7:15 am
ఈ వివరణ చాలా విషయాలు స్పష్టం చేస్తుంది. బాగుంది. ధన్యవాదాలు.
మరొక సందేహం. ఈమాటలో ప్రచురించిన రచనలు తొలిగించినప్పుడు రచయితలకు తెలియజేసే అవకాశం వుందా? నా రచనలు రెండు (”రచయితలకీ పాఠకులకీ మధ్య గల అవినాభావసంబంధం” అన్న వ్యాసమూ, “అంపకాలు” అన్న కవితా తొలిసారిగా ఈమాట.కాంలోనే ప్రచురింపబడినాయి) ఇప్పుడు కనిపించడంలేదు.
- నిడదవోలు మాలతి
[ఈమాటలో ప్రచురించబడిన రచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణం చేతనూ తొలగించబడవు.
మీ ‘రచయితలకీ పాఠకులకీ మధ్య గల అవినాభావసంబంధం‘ వ్యాసం, మీ ‘అప్పగింతలు‘ కవిత (’అంపకాలు’ కాదు) తిక్కన ఫాంట్‌లో లేని కొన్ని ఇతర రచనలతో పాటుగా సాంకేతిక కారణాల వల్ల ఇంకా పీ.డీ.ఎఫ్ ఫైళ్ళు గానే ఉన్నాయి. వీటిని కూడా యూనికోడ్‌కి మార్చే ప్రయత్నాలు చేస్తున్నాము. మరి కొంతకాలం పట్టవచ్చు. పాత సంచికల్లో తమ రచనలు కనిపించని రచయితలు వాటి వివరాలతో మమ్మల్ని సంప్రదించవలసినదిగా కోరుతున్నాం - సం.]
K. Rohiniprasad అభిప్రాయం:
February 4, 2009 2:01 pm
ఈమాట రచయితల్లో చాలామంది అమెరికాలోనూ, ఇండియాకు దూరంగా ఇతర విదేశాల్లోనూ నివసిస్తున్నారు. కొందరు మూడు నాలుగు దశాబ్దాలు గడిపినవారు కూడా ఉన్నారు. ఇక్కడి పరిస్థితులను గురించిన వ్యాసాలు (కథలు కావు) రాస్తే ఇండియాలో ఉన్న తెలుగు పాఠకులకు ఆసక్తికరంగా ఉండవచ్చు. ఇక్కడి సాంకేతిక, విద్యా, వైద్య, న్యాయాలయ రంగాల్లోనూ, ఆఫీసుల్లోనూ కార్యకలాపాలు ఎలా జరుగుతాయో, పనిచేసేవారి వైఖరి ఎలా ఉంటుందో, మన దేశానికీ విదేశాలకూ అనేక విషయాల్లో ఎటువంటి తేడాలుంటాయో తెలియజేసే రచనలను ప్రచురిస్తే బావుంటుందేమో సంపాదకులు ఆలోచించవచ్చు. ఎల్లలు లేని పత్రికగా ఈమాట కొత్త ఒరవడిని సృష్టించగలదు.
rama bharadwaj అభిప్రాయం:
February 6, 2009 9:33 am
చాలా మంచి సూచన చేసేరు మీరు రోహిణీప్రసాద్ గారూ!!
ఒక ఝంపా లహరి వంటి రచయిత్రి..ఇన్నేళ్ళ ల్లోనూ తెలుగు వారి లోంచి రాలేదేమన్న విమర్శ ఆంధ్రదేశం లో ఎప్పట్టునుంచో ఉంది. తెలుగు వాళ్ళు తెలుగులో ఎక్కువ రాయడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప.. అమెరికాలో ఉన్న మిగతా జాతుల వారికి…తెలుగు జీవితాన్ని పరిచయం చేసే పని ఇప్పటిదాకా సృజనాత్మక రంగాల్లో ఏ మేరకు చేసేరో ఇక్కడ స్పష్టంగా ఎవరికీ తెలీదు మరి.
.. మీరన్న ట్టుగా అమెరికా లోనూ..అలాగే యూరోప్ లోనూ ఉన్న తెలుగు వారి జీవితాల్లో వస్తున్న అనేక రకాల మార్పులు ఏ తరహా లో ఉన్నవీ కూడా..చెప్పడం… అందులోని క్లిష్టత ల్లోంచి వ్యక్తంచెయ్యగల్గితే ఎవరైనా… అప్పుడు మాత్రమే వైవిధ్య మైన రచనలు రాగల వీలు ఎక్కువ ఉంది.
ఇప్పటికీ అక్కడ ఉన్న వారు ఎక్కువగా nostalgia నే చూపించడం కన్పిస్తుంది. ఇది తప్పు కాదు..కానీ తప్పని అంశం అయిపోతే మాత్రం..కాస్త కష్టమే చదివే వాళ్ళకి. ఇదివరలో వేరే దేశాల గురించిన కుతూహలం..అలాగే అక్కడ ఎలా బతుకుని నెట్టుకొస్తున్నారా అన్న భయం ఇక్కడ ఉండేవి. కానీ ఇప్పుడు ఇంటికొకరు చొప్పున వేరే దేశాల్లో ఉంటున్నారు. గనక అంత కుతూహలం ఇవాళ కన్పించదు .నా ఉద్దేశ్యంలో తెలుగు వాళ్ళకి వేరే భాషల్లో చెప్పగల నైపుణ్యం అవసరం.
Now Indian diaspora is no more an isolated segment in the US. It is playing vital and vibrant role in social mileu as well as political field in the country they adopted. Telugus, for that matter all ethnic groups ,are very strategically placed, from where they can globalise the local isssue and at the same time localize the things that are global.
ఝుంపాలహరి ఒక అనుభవానికి ఉదాహరణ అయితే..రాజారావు ఇంకొక అనుభవానికి ఉదాహరణ. అలాగ అని నా అభిప్రాయం.
రమ.
note: మీరు కాల్పనిక సాహిత్యం్ కాకుండా అని____ అన్న ది..నేను గమనించాను. కానీ కాల్పనిక సాహిత్యానికి బలం ఎక్కువ. దాని వల్ల ఒకజాతికి వచ్చే గుర్తింపు ప్రత్యేకమైంది. అయితే రచయితల్ని ఎవరూ తయారుచేయలేరు. అందువల్ల ఆ లోటుని మిగతా అంశాలు పూర్తిచేయగల్గితే మంచిదే!! అయితే వీలైనంత వరకూ తెలుగువాళ్ళు తెలుగు వాళ్ళ కన్నా..వేరే భాషల వాళ్ళకి తెలుగు వారిని గురించి చెప్పటమే ఎక్కువ అవసరం.
suresh అభిప్రాయం:
April 26, 2009 12:33 am
పత్రిక చూడగానే ప్రవాసం లో ఉన్న నేను పరమానంద భరితుణ్ణయ్యాను.
మిత్రుడు కొడవటిగంటి రోహిణీ ప్రసాదు గారి వ్యాసం సంగీత ప్రియులకి చాలా ఆసక్తిజనకం గాను , ప్రత్యక్ష పురాణం లాగా సందర్భోచిత ఆడియో క్లిప్పింగుల తో కూలంకషం గానూ ఉంది. పత్రిక ప్రచురణ లో మీరు నిలబెడుతున్న సాంకేతిక సాహిత్య విలువల ప్రమాణాలకి జోహార్లు,ఈ మాట బాగుంది. ఇందులో మీ మాటలూ బాగున్నాయి
Dr.Appalayya Meesala అభిప్రాయం:
May 19, 2009 10:56 pm
గూగుల్ ఇండిక్ తెలుగులో టైపు చేసి పంపాలంటే ఏంచెయ్యాలి
డాక్టర్ అప్పలయ్య మీసాల
మృత్యుంజయరావు అభిప్రాయం:
June 24, 2009 3:43 am
ఈమాట పత్రిక లోని రచనలు అద్భుతంగా ఉంటున్నాయి. ఈ స్థాయి తగ్గకుండా పత్రిక చిర కాలం నడవాలని కోరుకుంటున్నాను
sudhama అభిప్రాయం:
August 26, 2009 6:33 am
మా రచనలు చేతితో రాసి స్కాన్ చేసి జె పి జె ఫయిల్ గా ఈమెయిల్ లో ఏల పంపించ కూడ దు.
[ఒకవేళ మీ చేతిరాత ముత్యాలు పేర్చినట్టున్నా కూడా, మీ చేతిరాతను మళ్ళీ మేము మా సమయం వెచ్చించో, ఇంకెవరికైనా డబ్బిచ్చో మేము మళ్ళీ టైపు చేయించాల్సి వస్తుంది. ఏదో ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప, ఇలా చేయడం మాకు కుదరని పని. అంతే కాక, మీరు ఇమేజీ ఫైల్స్ పంపితే వాటిలోంచి టెక్స్ట్ ని ఎక్స్‌ట్రాక్ట్ చేసే సదుపాయం లేదు మాకు ప్రస్తుతం. అందువల్లనే, RTS లేదా యూనికోడ్ తెలుగులో మాత్రమే మీ రచనలని పంపగలరు - సం.]
Rohiniprasad అభిప్రాయం:
August 26, 2009 11:44 am
Attn. sudhama
You can easily make use of a fcility like lekhini.org and then copy/paste your article in MSWord format for emailing.
gangakiran అభిప్రాయం:
September 6, 2009 4:55 am
ఓహొ, చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రోమాంచితము. ఏ దేశంలో ఉన్నా తెలుగు దాహం తీరుతుంది.
Siva Jasthi అభిప్రాయం:
December 19, 2009 7:35 pm
http://www.google.com/transliterate/indic/telugu
గూగుల్ ట్రాన్స్ లిటరేషన్ — ఈ పధ్ధతిలో కూడా మీరు తెలుగు రచనలను స్వీకరించవచ్చు
M.V.S.Prasad & Saroja అభిప్రాయం:
February 9, 2010 11:03 pm
ఈ మాట అద్భుతం! ఇన్నాళ్ళూ మాకు తెలియక పోవడం మా దురద్దృష్టం. మీ కృషి ఎంతైనా అభినందనీయం.- సరోజాప్రసాదు
manchikanti అభిప్రాయం:
August 17, 2010 9:24 am
ఈమాట మొదటి సారి చూస్తున్నాను.చాలా బాగా ఉన్నది.అందరికీ నచ్చేలా తీర్చిదిద్దుతున్నారు.శుభాకాంక్షలు
kameswari అభిప్రాయం:
September 16, 2010 2:30 pm
ప్రతి శీర్షికకీ అభిప్రాయాల పెట్టె ఉన్నట్లే ,పత్రికలో ప్రచురణకోసం కవితల కు ఒక పెట్టె, కథలకు ఒకపెట్టె, వ్యాసాలకు ఒకపెట్టె ఉంచితే రచయితలకు రచనలను పంపటం తేలిక అవుతుంది కదా!
యద్దనపూడి కామేశ్వరి
parimi sambayya అభిప్రాయం:
September 21, 2010 1:22 pm
నేను ఈమాటను ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగుంది.
కర్లపాలెం హనుమంత రావు అభిప్రాయం:
October 6, 2010 5:29 pm
ఈ మాట ఇప్పుడే చూస్తున్నాను.లే అవుట్ చూస్తే మంచి నాణ్యత కనపడుతుంది. చదివి నా స్పందన తెలియచేస్తాను .
BHAMATI అభిప్రాయం:
October 21, 2010 7:09 pm
ఈమాట పత్రిక ఇప్పుడే చూస్తున్నాను. బాగుంది.
కందర్ప కృష్ణ మోహన్ అభిప్రాయం:
November 2, 2010 12:50 pm
ఈ మాటకు నమస్సులు
రచనలు పంపవలసిన ఈ మెయిల్ అడ్రస్ కనిపించట్లేదు
దయచేసి తెలుపగలరు
కందర్ప కృష్ణ మోహన్
(submissions (AT) eemaata.com, పై వ్యాసంలో రచనలు పంపే పద్ధతి హెడ్డింగ్ కింది మొదటి బులెట్, మొదటి లైన్ చూడండి. - సం.)
Santosh Karteek అభిప్రాయం:
November 3, 2010 5:43 am
ఈమాట .com చూశాను.
చాలా ఆనందంగా వున్నది.
పద్మకళ అభిప్రాయం:
December 14, 2010 12:43 pm
చాలా బాగుంది.మంచి మంచి రచనలతో పాటు అనుభవజ్ఞుల సలహాలు పొందుపర్చటం హర్షణీయం. నా పేరు పద్మకళ. కవితలు,కథలు,వ్యాసాలు రాస్తూ ఉంటాను. మీకు పంపిన కథ మీ వెబ్సైట్ లో పెట్టేదీ లేనిదీ మాకు ఎలా తెలుస్తుంది? ఒక వేళ మీరు తిరస్కరించిన రచనల గురించి ఆయా రచయితలకు వెంటనే తెలియ జేస్తారా? పుస్తక సమీక్షలకి ఏ చిరునామాకి పంపాలి? సందేహ నివౄత్తి చేయగలరని ఆశిస్తున్నాను.
నమస్కారములు.
పద్మకళ
[1. తిరస్కరించినా, ప్రచురణకు తీసుకున్నా రచయితకు వెంటనే తెలియజేస్తాము. 2. ప్రచురణ ఏ సంచికలో ఉండేదీ రచయితకు తెలియజేస్తాము. ఇది సాధారణంగా ఆ తర్వాత రాబోయే సంచిక అయివుంటుంది. 2. మా అంతటమేము, సంపాదకులుగా, పుస్తక సమీక్షలు చేయము. మాకు వచ్చిన సమీక్షలను పరిశీలించి ప్రచురించటం వరకే. మా ప్రచురణ నిబంధనల కోసం పై వ్యాసం చూడండి - సం.]
పి రామచంద్ర రావ్ వైజాగ్ అభిప్రాయం:
January 1, 2011 2:03 pm
ఈమాట.కాం ప్రప్రథమంగా ఈ రోజే చూసాను. చిన్నచిన్న గేయాలు అవీ పంపాలంటే ఎలా పంపాలి? ఏ చిరునామాకి పంపాలి? దయచేసి తెలుప ప్రార్థన.
[పై శీర్షికలోనే చెప్పినట్లు RTSలో గానీ, unicode తెలుగులో గానీ type చేసిన రచనలు e-mail ద్వారా submissions@eemaata.com అన్న చిరునామాకు పంపాలి… సం.]
B.AMARANATHAREDDY అభిప్రాయం:
February 8, 2011 1:04 pm
డియర్ సార్
ఈ మాట.కామ్ చూశాను. చాలా బాగుంది. మీ ప్రయత్నం అభినందనీయం. మేము ఆంధ్ర నుఉండి గ్రామపంచాయతీ అనే మాసపత్రికను 2002 నుంచి తెలుగులో తెస్తున్నాం. ఈ పత్రికను పి.డి.యఫ్ అనుసంధానం చేసే వీలు ఉందా తెలపండి. our magazine is A.P first private rural development magazine in Telugu language. We r publishing rural information, aware the people about govt. schemes and other activities.
అమర్ నాథ్ రెడ్డి, editor,
gramapanchayathi mothly
madanapalli, chitoor dt. a.p india
+91 9885576646
amar2bv@yahoo.co.in
shailaja అభిప్రాయం:
February 17, 2011 4:16 am
అభినందనలు!
చాలా సంతొషముగా ఉంది.
చాలా exciting గా ఉంది.
wish u all the best.
raghu అభిప్రాయం:
April 21, 2011 4:16 am
హామీ ఇవ్వమన్నారు.వివరంగ చెప్పగలరని మనవి.
[మీరు పంపే రచన మీ స్వంతమనీ, ఇంతకు ముందు ప్రచురించలేదనీ, వేరే ఏ పత్రిక వద్దా ప్రచురణకు పరిశీలనలో లేదనీ, హామీ ఇవ్వాలి. అనువాద రచన అయితే, మూలపు రచయిత అనుమతి కూడా తీసుకోవలసి ఉంటుంది. - సం.]
naMdivADa udaya BAskar అభిప్రాయం:
September 10, 2011 2:03 pm
ఈమాట పాఠకులకి ఒక విషాదకరమైన వార్త తెలియపరచడానికి చింతిస్తున్నాము.
“మధ్యాహ్నం మాణిక్యం” కథా రచయిత్రి శ్రీమతి నందివాడ శ్యామల గారు 2011్ మే 20వ తేదీ నాడు హైదరాబాదులో తమ స్వగృహంలో మరణించారు.
2001 సంవత్సరంలో67 సంవత్సరాల వయసులో ఈమాట పత్రిక ద్వారా తెలుగు పాఠకులకి రచయిత్రిగా పరిచయమైన శ్రీమతి శ్యామల గారు ఆ తరవాత “వలస” పేరుతో మరొక కథను, తమ భర్తగారైన శ్రీ భీమారావు గారితో సంయుక్తంగా “కదిలే మబ్బులు, కదలని కొండలు” అనే శీర్షికతో తమ ఆత్మకథని, ప్రచురించారు. 2009 లో “కదిలే మబ్బులు, కదలని కొండలు” ఆవిష్కరణ సభలో ఆవిడ చేసిన ప్రసంగం స్ఫూర్తితో శ్రీ పాలగుమ్మి రామకృష్ణారావుగారు రాసిన “కదిలే మబ్బులతో ఒక చల్లని సాయంకాలం” కథని రంజని సంస్థవారు “బహుమతి కథ” సంకలనంలో ప్రచురించారు.
శ్రీమతి శ్యామల గారి అపూర్జీవ్యక్తిత్వానికి నివాళిని వీడియో రూపంలో ఈ క్రింది
You Tube వీడియోలో చూడగలరు -
నందివాడ భీమారావు, నందివాడ ఉదయభాస్కర్, కూచిమంచి నాగమణి, రత్నశ్రీ దాస్ గుప్త, నందివాడ సోమశేఖర్.
raavi rangarao అభిప్రాయం:
September 13, 2011 12:24 am
సంపాదకులకు నమస్కారం…
మీ ప్రయత్నం అద్భుతం…అభినందనలు
సుష@4U4ever@ అభిప్రాయం:
November 1, 2011 9:41 am
మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది మీ ఈ సైటు చూసి. చాలా ఆనందం కలిగించింది మీ ఈ ప్రయత్నం. ఎంతో ఉపయోగపడేలా, ఎంతో మంది తెలుగు బాషాభిమానుల దాహార్తి ని తీర్చేలా ఈ సైటుని తీర్చిదిద్దినందుకు నా మనఃపూర్వక అభినందనలు.
‘మా’ తెలుగు ..
‘నా’ తెలుగు
మన(’మా'’నా’) తెలుగు
-సుష@4U4ever@
lakshmi అభిప్రాయం:
November 10, 2011 3:16 pm
Dear sir,
emaaTa patrika chaalaa baagundi. manchi patrikanu andistunna meeku naa abhinandanalu. mee patrikaku nenu kadha pampaalante gmail loe telugulo type cheasi attachment file gaa pampavachchaa. dayacheasi telupagalaru..
lakshmi madhav
mysore
[Yes. You can send a Telugu file as an attachment in gmail - Eds.]
mallikarjuna అభిప్రాయం:
January 19, 2012 6:56 am
మీ ‘ఈమాట’ చాలా బాగున్నది. ఈ మార్గము తెలుగు బాషాభిమానులందరిని ఒక దగ్గర చెర్చెలా ఉన్నది. కాని ఇన్కా(iMkA) ఇక్కడ వ్రాయడము అలవాటు కావాలి. అక్కడక్కడ చిన్న తప్పులు వున్నవి, మన్నిMచగలరు.సున్న మరియు త(TA)ని ఎలా type చెయాలొ తెలియటM లెదు.
మల్లికార్జున కొంగాని.
[M వాడితే సున్నా వస్తుంది. త(ta) ట(Ta). తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. - సం.]
Lalithasri అభిప్రాయం:
January 26, 2012 3:23 pm
గురువు గారికి, నమస్కారం!
ఇపుడే మన పత్రిక, మన గౌరవం మనసుని చూసుకొనె ఒక అద్బుతం దొరకటం మహదావకాశము.మీ క్రుషికి అభినందనలు తెలపాలి. రాయటానికి చాలానె వున్నది.పూర్తిగా రాయటానికి సమయం సాల్లెదు నమస్కారములతొ ముగిస్తున్నాను.
Dr.G.V.Krishnaiah అభిప్రాయం:
January 30, 2012 2:13 pm
సాహితీ ప్రపంచం ఎల్లలు చెరిపేసుకుని ఎక్కడెక్కడికో పయనిస్తుంది, చాలా సంతోషం. ఈమాట పదుగురినోట భాషిల్లే సుభాషితం కావాలని ఆకాంక్షిస్తూ…..డాక్టర్: జి.వి.కృష్ణయ్య
DR.G.V.KRISHNAIAH, KOTHAPATNAM 523286, PRAKASAM DT, Andhrapradesh.
peddada satya prasad అభిప్రాయం:
March 16, 2012 9:20 am
నేను ఈరొజు ఈ వెబ్ పత్రిక చూసాను. చాలా బాగుంది. నేను రచయితను, కవిని. నా రచనలు చాలా వాటిలొ ప్రచురితమయ్యాయి. ఈ మాటకు కూడా నా సాహిత్యాన్ని పంపుదామని అనుకుంటున్నాను. తెలుగులొ ఇటువంటి ప్రయోగం చేయడం ముదావహం. మీకు నా ధన్యవాదాలు.
పెద్దాద సత్యప్రసాద్
విశాఖపట్నం.
koride vishwanatha sharma అభిప్రాయం:
March 21, 2012 3:19 am
సంపాదకులకు, నమస్కారములు .
ఇప్పుడే మీ ఈ మాట చూసాను. చాలా సంతోషముగా ఉంది. తెలుగు సాహిత్యాభిమానులకు ఒక చక్కని వేదిక లభించింది. నేను సంస్కృత ఉపయాసకుడిని. ప్రతిజ్నా యౌగంధరాయణం పిల్లలకు చెప్పుతుంటాను. ఆ అంకకథలను, పుస్తక సమీక్షను మీకు పంపవలెననుకుంటున్నా. ప్రచురిస్తారా? బరహ. 8 లొ పంపవచ్చా? తెలియజేయండి.
మీ కొరిడే విశ్వనాథ శర్మ
[ప్రచురణార్హత నియమాలకు రచయితలకు సూచనలను చదవండి. యూనికోడ్‌లోకి మార్చగలిగిన ఏ ఫాంట్ అయినా వాడవచ్చును. - సం.]
dasthagiri అభిప్రాయం:
March 26, 2012 8:13 am
నమస్తే, రచనలు పంపడానికి మీరు ఇచ్చిన ఈ మైల్ submissionsATeemaata.com not recognized అని వస్తున్నది. తగు సలహా ఇవ్వగలరు.
-దస్తగిరి
[AT కి బదులుగా @ అని ఉంచి మెయిల్ పంపండి. - సం.]
Radha Krishna Bojja అభిప్రాయం:
April 4, 2012 5:02 am
” ఇంత తెలుగు ఇంకా బ్రతికి వుందా
అందులోను ఈ అంతర్జాల లోకంలో !!! ”
ఇవీ నాకు మీ “ఈమాట” చూసిన వెంటనే కలిగిన ఆలోచన.
నిజంగా ఇక్కడ రచయితల తెలుగు చూసాకా ప్రాణం లేచి వచ్చినట్లైంది
మహదానందంగా ఉన్నది
నాకు ఈమాట ను సిఫార్సు చేసిన సోదరుడు ఫణి గారికి ధన్యవాదాలు
Rohiniprasad అభిప్రాయం:
April 6, 2012 10:29 am
రాధాకృష్ణగారూ,
నాకు ఈమాటతో 1999 ప్రాంతాలనుంచీ పరిచయం ఉంది. క్రమంగా విష్ణుభొట్ల లక్ష్మన్న, సురేశ్ కొలిచాల, పరుచూరి శ్రీనివాస్ తదితరులతో సంపర్కం మొదలయింది.
మునుపు బొంబాయిలోనూ, తరవాత ఇతర ప్రాంతాల్లోనూ తెలుగువారిలో కనబడ్డ ‘ఆముదపు వృక్షా’లను చూసి నిరాశ పడుతున్న సందర్భంలో వీరంతా నాకు దూరంగా మినుకుమినుకుమనే ఆశాదీపాల్లా కనిపించసాగారు.
వీరితో ఈమెయిల్ తదితర పద్ధతుల్లో తరుచుగా సంభాషించడం, వ్యాసాల ద్వారా నా ఆసక్తిని పంచుకోవడం మొదలైన పనులు చేస్తున్నకొద్దీ life is worth living అని నాకనిపించసాగిందంటే అందులో అతిశయోక్తి ఏమీలేదు.
మన పొరుగింటివాడు సంగీతంలోనో, సాహిత్యంలోనో ఆసక్తి కనబరుస్తాడనుకోవడం ప్రస్తుతకాలంలో పేరాశే అవుతుంది కనక ఇలాంటి వ్యక్తులే మన సాంస్కృతిక జీవితానికి కొంతవరకూ ఆధారం అని నేననుకుంటాను. మరీ నిస్పృహకు లోనైనవారికి నేనిచ్చే సలహా కూడా ఇదే.
Dadala Venkateswara Rao అభిప్రాయం:
April 6, 2012 2:55 pm
గౌరవనీయులైన సంపాదకులకు నమస్కరించి వ్రాయునది:
మనలొ ‘మనమాట’ గా చెబుతున్నా
మీ ‘ఈమాట’ లొ ‘మామాట’ ‘ఏమాట’ తీయకుండా
ప్రతి మాట అదె మాటగా ప్రచురిస్తారని ఆశిస్తూ
ఈమాట సాక్షిగా మీ దగ్గర మాట తీసుకుంటున్నా
మా స్నెహితుడి ‘మాట’ విన్నాను
ఎల్లలులేని ప్రపంచానికి ఎలెక్ట్రానిక్ తెలుగు పత్రిక ‘ఈమాట’
ఎలా సేవ చెస్తుందొ మంచి మంచి మాటలు చదివి చూసాను
ఈమాటలోని మర్మాన్ని తెలుసుకొవడం ఇప్పుడె మొదలుపెట్టాను
ఈమాటని మావాడికి అందరికి మీ ఈమాటగా చెబుతాను
ఇట్లు
మీ ‘ఈమాట’ అభిమాని
-దడాల వెంకటెశ్వరరావు
అసిస్టంట్ కమిషనర్
న్యూ దిల్లీ
Varanasi Nagalakshmi అభిప్రాయం:
July 13, 2012 2:32 am
ఈ మాట వెబ్ పత్రిక చాలా బావుంది.పుస్తక సమీక్ష కోసం పుస్తకాలు పంపాలంటే ఎలాగో చెప్పగలరా?
వారణాసి నాగలక్ష్మి
[ఈమాట సంపాదకులు పుస్తకాల సమీక్ష చేయరండీ. సమీక్షలు వ్రాసి లేదా వ్రాయించి ప్రచురణకి పంపితే పరిశీలించగలం. - సం.]
Raja Kishor Duggirala అభిప్రాయం:
July 29, 2012 2:52 pm
తెలుగు భాష ఎప్పతికీ బ్రతికే వుంటుంది. అందుకు ఈమాట వంటి వెబ్ సైట్ లే ప్రత్యక్ష తార్కాణం. ఎటొచ్చీ చాలా కాలంగా మన భావాలను తెలుగులొ వ్యక్తం చెసుకోడానికి ఉపకరించే సాధనాలే లభ్యం కాలేదు.
ఈమాట ఇప్పుడు ఆ కొరతను తీరుస్తొంది. ఈమాట బృందానికి అభినందనలు.
chandrasejkhar. అభిప్రాయం:
July 31, 2012 6:59 am
డియర్ సర్!
నేను ఈ మాటకు ఒక కధ పంపదలచాను. అది ఏ పత్రికలోను ప్రచురింపబడలేదుకానీ, ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన పోటీకి పంపగా ఎంపిక కాలేదు. మీరు అంగికరిస్తే పంపుతాను.
చంద్రశేఖర్.[-పెన్ నేం ]
[మీ రచన ఇంకే పత్రికకు పంపించకుంటే మాకు పంపించండి. ప్రచురణకు పరిశీలించగలం - సం.]
Ravi Shankar అభిప్రాయం:
August 8, 2012 6:56 am
“ఈమాట” ని నడుపుతున్న-నడిపిస్తున్న వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాకు కావలసిన చాలా సమాచారం ఎప్పటినుంచో ఇక్కడ లభ్యమవుతున్నది.
ఈ సమాచారదర్శిని ఇలాగే వర్థిల్లాలని కోరుకుంటున్నాను.
గౌరీ రవిశంకరశర్మా అహంభో అభివాదయే!
ఆకుండి శైలజ అభిప్రాయం:
October 11, 2012 11:37 am
పత్రిక ను మీ స్వీయ పుత్రిక లా తీర్చిద్దినందుకు ప్రధమంగా ఆభినందనలు. మా తండ్రి గారైన స్వర్గీయ ఆకుండి రాజేశ్వరరావు గారి కధలు ఆలనాటి భారతి, ఆంధ్ర పత్రిక(1960-70) మధ్య కాలంలో ప్రచురించబడి యున్నాయి. వాటిని మీ పత్రికలో పాఠకుల కొరకు ప్రచురించడం సాధ్యపడుతుందా… సాధ్య పడితే తెలియ చేయగలరు.
శైలజ ఆకుండి.
pavan santhosh surampudi అభిప్రాయం:
October 14, 2012 10:11 am
గత కొన్నాళ్ల నుండి ఈమాట చూస్తున్నాను. తెలుగు ప్రింట్ మీడియాలో గాని అంతర్జాలంలొ కాని ఈమాటకి సరితూగగల సాహిత్య పత్రిక లేదని నా అభిప్రాయం. ప్రత్యేకంగా నాకు ఇది ఒక నిధిలా ఉంది. పాత సంచికల ఖజానా ఎంత చదివినా మరిన్ని ఆణిముత్యాలు దొరికి నన్ను మురిపిస్తొంది.
వేనవేల ధన్యవాదాలతో,
సూరంపూడి పవన్ సంతొష్,
తాడేపల్లిగూడెం.
venkatesh nanduri అభిప్రాయం:
December 7, 2012 8:15 am
Thanks a lot. This is my first experience in going through your ‘ee maata’ e-magazine’very wonderful experience. Thanks for giving us a scope for participating, and for presenting the art if any hidden in me. generally we use Telugu shree lipi key board in my office. i feel a little bit of difficulty in the typing appropriate word with the tools provided by you.pl suggest me an easier way to present mini kavithalu’-
Venkatesh
అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ అభిప్రాయం:
December 25, 2012 10:13 am
ఆర్యా! నమస్సులు! అంతర్జాలపు తెలుగు పత్రిక ఇది. సంతోషము.
ఛందోభాషణము పేరిట కొంత స్థలమును కేటయించగలిగితే తప్పక నేను పాలుపంచుకుని పద్యములలో ప్రశ్నోత్తర విధానములో చక్కని చర్చలు జరపవచ్చు. అలాంటి పద్యకవులకు కూడా ఇది ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఇక ఈ పత్రికకు నా వైపు నుండి ఎంతటి సహాయమునైనా చేయగలను.
ధన్యవాదములు
రాంభట్ల పార్వతీశ్వర శర్మ - విశాఖపట్నము - ఆంధ్రప్రదేశ్. భారతదేశము.
తోట రమేశ్ అభిప్రాయం:
February 16, 2013 3:20 am
నమస్తే,
మన కరణ, శ్రావ్య, శబ్దసంకేతాల ముగ్దమనోహర రసరమ్య పద కదలికల ప్రవాహామే మన తెలుగు భాష.
ఇటువంటి భాషోన్నతికి మీ ఈవెబ్‌సైట్ చాలా ఉపయోగకరంగా ఉంది.
ధన్యవాదాలు
తోట రమేశ్
N.VENKATESWARARAO అభిప్రాయం:
April 29, 2013 9:52 pm
ఈ మాట సంపాదకులకు నమస్కారం.
మీరు సూచించిన క్విల్ పాడ్ ద్వార టైపు చేసిన తరువాత ఆ ఫైల్ నెట్ లొ ఎలా పంపాలి? అంటే ఆ ఫైల్ సేవ్ చేయడం ఎలాగొ తెలియటం లేదు కొంచెం వివరంగ చెప్పగలరు. లేదా ఇక్కడే అనగా (అభిప్రాయాల) స్పేస్ నుండి పంపవచ్చా తెలుపగలరు.
[మీరు టైప్ చేసిన సారాంశాన్ని నేరుగా మెయిల్ లోనో, లేదా నోట్ పాడ్ కానీ ఎం.ఎస్.వర్డ్ లో కానీ పేస్ట్ చేసి పంపండి. అభిప్రాయాల పెట్టె ద్వారా పంపించకండి. - సం]
G V GANESH KUMAR అభిప్రాయం:
May 4, 2013 1:01 pm
ఈమాట మాగజైన్ కు ఏమైనా సహకారం సాహిత్యపరంగా చేయగలనా చూడాలి. మాగజైన్ చాలా బాగుంది. ఆలస్యంగా చూశాను, తెలుసుకున్నాను. ఆనందంగా ఉంది.
SADHU MAHENDER అభిప్రాయం:
May 4, 2013 11:18 pm
గౌరవ సంపాదకుల వారికి నమస్కారాలు!
ఈ మాట తెలుగు వారికి, తెలుగు మరచే వారికి కనువిప్పు కావాలి
ఈ మాట ఆలోచించే మెదళ్ళకు పదును కత్తి కావాలి
ఈ మాట పలువురిని మెప్పించే తీయటి పాట కావాలి
ఈ మాట తెలుగు వాళ్ళకు పూల బాట కావాలి
ఈ మాట ప్రపంచపు బావుటా కావాలి
ఈ మాట అన్యాయాన్ని ఎదురించె తూటా కావాలి
ఈ మాట అవినీతి నెదురించే అంకుశం కావాలి
ఈ మాట అవనికి నీతి మూట కావాలి
SADHU MAHENDER అభిప్రాయం:
May 5, 2013 2:20 pm
గౌరవ ఎడిటర్ గారికి నమస్కారములు! ఈ మాటకు భావ గీతాలు, తెలుగు గజల్స్, ఎక్కడ ప్రచురితం కానివి తమ పత్రికకు పంపవచ్చునా ? తెలుపగలరు.
[పంపండి. పరిశీలించి ప్రచురణార్హం అనుకుంటే ప్రచురిస్తాము. - సం]