ఈమాట » రెండు శ్రీల విరించి - ఈమాట జనవరి 2010 శ్రీశ్రీ ప్రత్యేక సంచికకు స్వాగతం

Expand to right
Expand to left

రెండు శ్రీల విరించి - ఈమాట జనవరి 2010 శ్రీశ్రీ ప్రత్యేక సంచికకు స్వాగతం

!!!ఈమాట పాఠకులకు, రచయితలకు, సమీక్షకులకు, వ్యాఖ్యాతలకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు
!!!

రెండు శ్రీల విరించి


శ్రీరంగం శ్రీనివాసరావు
02 జనవరి 1910 - 15 జూన్ 1983

తెలుగు కవిత్వానికి ఒక వినూత్న విభిన్న దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఈ సంచికను శ్రీశ్రీ స్మారక సంచికగా విడుదల చేస్తున్నాం. మహా ప్రస్థాన కవితా విరించిని వీలైనంత సంపూర్ణంగా పునఃపరిచయం చేసే సంకల్పంతో కొన్ని పాత వ్యాసాలను, అలాగే శ్రీశ్రీ సాహిత్యంలో అంత ఎక్కువగా పరిశీలనకు రాని విషయాలపై కొన్ని కొత్త విశ్లేషణా విమర్శా వ్యాసాలను కలిపి ప్రచురిస్తున్నాం. శ్రీశ్రీ గురించి ఆయనమాటల్లోనే తెలుసుకునేందుకు ఆయనతో జరిగిన చర్చల ఆడియో రూపకాలు, శ్రీశ్రీ ఉపన్యాసం, కవితా పఠనపు వీడియోలూ ఈమాట పాఠకులకి ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తున్నాం. ఈమాట పాఠకులకోసం శ్రీశ్రీ కవితకి బాపూ బొమ్మల సంకలనం ప్రత్యేక ఆకర్షణ.

ఈ సంచికలో మీకోసం:

 

(2 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. tatiraju venugopal అభిప్రాయం:

    February 25, 2010 3:28 pm

    ఇన్ని ప్రక్రియలు ప్రవేశ పెట్టారు గానీ మహా కవి నిర్వహించిన పదబంధ ప్రహేళికల గురించి మరచి పోయారా? లోగడ నేను రచన మాస పత్రికలో ‘శ్రీశ్రీ- ఆ పేరే ఒక పజిల్ ‘ అన్న వ్యాసంలో అష్టావధానం లో నిషిద్ధాక్షరి వగైరా - ఎలా ఉన్నాయో అలానే ఆయన తన పజిల్ కూర్పులో ఆరు విధానాలు అనుసరించారని వాటిని పట్టికలతో వివరించాను. రచన శాయి గారు ముచ్చట పడి స్వయంగా రాసిన లేఖ నా మనసులోనూ, నా కలక్షన్స్ లోనూ ఇప్పటికీ భద్రంగా ఉంది.

  2. Dr Ananda rao అభిప్రాయం:

    March 4, 2010 7:04 am

    It will be very good to include as requested

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a