ఈమాట » పాఠకులకు సూచనలు

Expand to right
Expand to left

పాఠకులకు సూచనలు

ఈమాట పాఠకులకు నమస్కారం.

ఈమాటలో రచనలపై మీ అభిప్రాయాలని విమర్శలనీ రాయడానికి వీలుగా ప్రతీ రచన చివర ఒక అభిప్రాయాల పెట్టె వున్న సంగతి మీకు తెలుసు. ఈ అమరిక ముఖ్యోద్దేశం ఒక రచనపై ప్రత్యక్షంగా మీ అభిప్రాయాలనీ, మీ దృక్పథాన్నీ రచయితకు తెలియజేసేదిగా ఉండటం. కానీ, క్రమేణా, రచనపైన అభిప్రాయాలు తక్కువైపోయి, సాటి పాఠకుల కామెంట్లపై విమర్శ-ప్రతివిమర్శలతో, ఈ అభిప్రాయ వేదిక ఒక చర్చారంగంగా, ఒక్కొక్క సారి కలహవేదికగా మారిపోతున్నది. ఇది ఇలానే కొనసాగనిస్తే, రచయితకీ పాఠకులకీ మధ్య సుహృద్భావ వాతావరణం సమసిపోయే పరిస్థితి వచ్చి ఈమాట ప్రాథమిక ఆశయానికే దెబ్బ తగిలే ప్రమాదం రావచ్చు. ఆ స్థితి రాకముందే ఈమాట రచనలపై మీ అభిప్రాయాలను ప్రకటించడానికి కొన్ని నియమాలను ప్రవేశపెడుతున్నాం. వీటిని, మీ వాక్స్వాతంత్ర్యానికి కట్టుబాట్లుగా కాకుండా, ఈమాటలో ఒక స్నేహపూరితమైన వాతావరణం కోసం ఏర్పరుచుకున్న ఒడంబడికలుగా భావించి మాతో సహకరించమని కోరుతున్నాం.

 

(22 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. siva rama prasad అభిప్రాయం:

    January 26, 2010 6:28 am

    ఇటు వంటి తెలుగు పత్రిక వుందని నాకు తెలియదు. 1999 నుండీ అంటె అసలు నమ్మశక్యంగా లేదు.మొదటి సారి చూడటం తటస్థించింది.చాల గొప్పగ ఉన్నది. శ్రీ శ్రీ మహా ప్రస్థానం బాపు బొమ్మలు, ఆ font లో అద్భుతం గా వుంది. మీకు నా కృతజ్ఞతలు.

  2. Pavankumar Krovvidi అభిప్రాయం:

    February 7, 2010 2:43 am

    అమెరికాలో ఇతరత్రా దేశాల్లో మన వాళ్ళు ఈ రకమైన తెలుగోష్ఠి చెయ్యడము చాలా ఆహ్లాదకరమైన విషయము.

  3. BATHINI THIMMAGURUDU అభిప్రాయం:

    February 20, 2010 1:18 am

    గౌరవనీయులైన సంపాదకునికి నా నమస్కారాలు.

    అయ్యా!
    మీ వెబ్ సైట్ చాలా బాగుంది. మీరు తెలుగుజాతి గౌరవాన్ని , ప్రతిష్టని పెంచుతున్నాను .దానికి నేను ఆనంద పడిపోతున్నాను . మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

    ధన్యవాదములు

    ఇట్లు
    సాహిత్య అభిమాని,
    బత్తిని తిమ్మగురుడు,
    ఇడుపులపాయ,
    ఎపి ట్రిపుల్ ఐటి,
    కడప జిల్లా,
    ఆంధ్రప్రదేశ్,
    భారతదేశం (ఇండియా).

  4. U.V.BHASKARA RAO అభిప్రాయం:

    March 23, 2010 7:01 am

    మొదటి సారి గా ఈ సైట్ చూడడం జరిగింది. చాలా చాలా ఉపయుక్తమవుతుంది. అందమైన తెలుగును ఈపత్రిక లొ చూపిస్తున్న మీకు ధన్యవాదములు
    యూ.వి.భాస్కర రావ్

  5. Dr. I.A.P.S. MURTHY అభిప్రాయం:

    March 28, 2010 1:20 am

    సంపాదకులకు నమస్కారం!
    ఈ వెబ్ సైట్ నాకు నిన్ననే పరిచయం అయ్యింది. చాలా చాలా నచ్చేసింది. పది సంవత్సరాల సంచికలను చదవాలంటే సమయం పడుతుంది.
    ఈ లోగా ఒక మనవి. మీరు ఎంతో చక్కని సంగీత సాహిత్య సంపదను మాకందిస్తున్నారు. అందులో భాగంగా అష్టావధానాలలో వచ్చే సమస్యా పూరణలూ దత్త పదులూ లాంటివి కూడా చేరిస్తే బాగుంటుంది.
    - ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి.
    (మహారాష్ట్ర లో చిప్లూన్ అనే చిన్న పట్టణం నుంచి)

  6. Madhu అభిప్రాయం:

    May 8, 2010 12:12 am

    ఈ మధ్య కొంత కాలం నుండి ‘ఈ మాట’ చదువుతున్నాను. తెలుగంటే తెలియకుండా పోతున్న ఈ రోజుల్లో ఇటువంటి పత్రిక చాలా అవసరం. ధన్యవాదాలు.

  7. Madhu అభిప్రాయం:

    May 8, 2010 12:18 am

    నేను కూడా ‘ఈ మాట’ కు నా కవితలు పంపాలనుకుంటున్నాను. ఎలా పంపాలో వివరాలు తెలియజేయగలరు. కృతజ్ఞుణ్ణి.

    [‘రచయితలకు సూచనలు’ చూడండి. - సం]

  8. geyamala అభిప్రాయం:

    May 23, 2010 2:09 am

    ఒక కోకిల తన పాటలను తెలుగు సిని జగత్తుకు దానం చేసి కానరాని లోకాలకు వెళ్లి పోయింది. మే 22 న చనిపోయిన శ్రీ వేటూరి గారి గురించి మీ పత్రికలో వ్యాసం ప్రచురించాలని నా కోరిక .

  9. దేశిరాజు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    June 18, 2010 3:13 am

    ఈ రోజు అనుకోకుండా మీ ఈమాట ను నెట్ లో చూడటం చాలా ఆనందం కలిగించింది. తెలుగు చదవటం రాదు అని చెప్పడం ఫాషను గా ఉన్న ఈరోజుల్లో, తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది. జై తెలుగు తల్లి.

  10. v sambasva rao అభిప్రాయం:

    August 14, 2010 11:37 am

    సంపాదకుల వారికి,
    అనేక కృతజ్నతాపూర్వక నమస్కారములతో,
    సాంబశివ రావు అనబడెడి భాగవత గణనాధ్యాయి వ్రాయునది. ఈమాట గురించి నా స్నేహితుడు ఛి. చంద్రశేఖర్ , తెలుగు పి హెచ్ డి విద్యార్డి ద్వారా తెలిసి ఇప్పుడే చూసాను.
    చాలా అద్భుతముగా ఉన్నది. సంతోషం.
    నేను ఆఫీసు 2007 - వర్డ, ఎక్సెల్ లలొ గౌతమి ఫాం’టు వాడుతూ పోతన తెలుగు భాగవతము గణనాధ్యాయము అని కంప్యూటరైజేషన్ & పరిశోధాత్మక వ్యాసంగము చేసుకొనుచున్నాను. అందుచేత ఈ టైపింగు అలబాటు లేక సంతృప్తికరంగా రాయలేకపోతున్నాను. తప్పులు ఉంటే క్షంతవ్యుడను.

    - సాంబశివ రావు,
    భాగవత గణనాధ్యాయి

  11. Dr.Sudhakar.A. అభిప్రాయం:

    January 1, 2011 9:35 am

    It is true that Eemaata is a non commercial online magazine of high literary quality.
    Unfortunately most ( telugu ) people who use internet are not aware of it’s existence
    ( as you note from the opinions page ).
    Why not consider advertising Eemaata in local ( AndhraPradesh ) news papers for the benefit of majority of telugu people?
    with best wishes to all the staff of Eemaata
    S.A. from UK.

  12. మోహన అభిప్రాయం:

    January 4, 2011 7:28 pm

    సుధాకర్ గారు మంచి సలహానే ఇచ్చారు. ఈమాట ప్రతి సంచిక ఎందరు చూస్తారో? ఒక పాఠకుల counter పెడితే బాగుంటుందేమో? - మోహన

  13. Dr.Vunnava Satyam అభిప్రాయం:

    June 28, 2011 5:09 am

    I am feeling highly relaxed by reading the stories in eemaata.

    I am thankful to you sir.

    Satyam.

  14. P.Rangaiah అభిప్రాయం:

    September 11, 2011 12:29 am

    ఈ మాట పత్రిక సంపాదకులకు నమస్కారాలతో,

    ఇలాటి పత్రిక సృష్టించిన వారికి సహకరించిన వారికి నడుపుతున్న వారికి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.

    రచనలల్లొ వంటల శీర్షికలు కూడా కలిపితే బాగుంటుందేమో!

    ఎప్పుడో ఆంధ్ర వార పత్రికలో సాలూరి వారి కూరలు అని పల్లెటూళ్ళలో అతి సులభంగా రుచివంతంగా చేసికొనే వంటల గురించి చదివినట్లు గుర్తు. ఆ స్ఫురణతో నేను అమెరికాలొ ట్రెయినింగు నిమిత్తము చికాగొ డేస్ ఇన్ లో ఉన్న సమయంలో వండిన వంట పది మందికి ఆకలి తీర్చింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ప్రభావితం చేయడమంటే ఏమిటి అనడానికి. తెలుగు భాష వాడుక సరళికి సంబంధించి పాఠకుల సందేహాలకు సమాధానాల వంటివి కూడా ఉంటే బాగుంటుంది.

  15. subbarao అభిప్రాయం:

    November 8, 2011 1:24 pm

    అయ్యా ! నమస్కారము. ఈ రకమైన సాహిత్య సేవ చేయు చున్నందులకు మిమ్ములను అభినందించుచున్నాను. నా రచనలు పద్య రూపములో పంపుదును. మీ అంగీకారము తెలియ జేయ గోర్తాను.

    ఇట్లు,
    సుబ్బారావు పోచిరాజు
    (రిటైర్దు తెలుగు పండితుడు)

    [పై సూచనల ప్రకారంగా మీ రచనలు పంపిస్తే, పరిశీలించి ప్రచురణార్హమైనదీ లేనిదీ మీకు తెలుపగలము - సం.]

  16. parashuram అభిప్రాయం:

    December 29, 2011 9:24 am

    సంపాదకులకు నమస్కారం!
    ఈమాట వెబ్ సైట్ ను నేను ఈరోజే నెట్ లో చూసాను.
    Technology పెరుగుతున్న కాలంలో అదే Technologyని ఉపయోగిస్తూ తెలుగు భాషని develop చేయడానికి మీరు చేస్తూన్న కృషి నాకు బాగా నచ్చింది.
    అందుకు నా కృతజ్ఞతలు.

  17. t.sriranga swamy hanamakonda అభిప్రాయం:

    January 18, 2012 2:23 pm

    Today I have seen your magazine. It is good and most informative.

  18. srilakshmi chivukula అభిప్రాయం:

    February 19, 2012 2:18 pm

    ఇంట్లో కూర్చుని కంప్యూటరులోంచి ప్రపంచాన్నంతా చూడవచ్చు అన్నది ఎంత సాధ్యమో ఈమాట ద్వారా తెలుగు సాహితీ ప్రపంచాన్ని అరచేతిలో అమృతం లాగా జుర్రుకుంటున్నాము అన్నది అంతే నిజము.ఇలాంటి అవకాశాలు అందించిన అందరికీ వందనాలు.

  19. M Sudhakarudu అభిప్రాయం:

    March 17, 2012 3:13 am

    Is it possible to have a print copy?
    How can get one, on a regular basis?

  20. yssubramanyam అభిప్రాయం:

    March 17, 2012 7:03 am

    తీయని తెలుగుతో ఆనందాన్నిపంచుతున్నారు. ధన్యవాదములు.

  21. Rohiniprasad అభిప్రాయం:

    May 5, 2012 10:18 am

    ఇటీవలనే నేను ఒక వెబ్ సైట్‌కు సంబంధించిన డివిడిలను చూడడం తటస్థించింది. చిన్నపిల్లలకు ఇంగ్లీష్ అక్షరాలూ, అంకెలూ అన్నిటినీ సమర్థవంతంగా నేర్పేందుకు ఇవి చాలా బాగా పనికొస్తాయి. ఇటువంటివి తెలుగులో కూడా తయారుచెయ్యగలిగితే ఇంట్లోనే తెలుగువారు చిన్నపిల్లలకు తెలుగు అక్షరాలూ, అంకెలూ, చిన్న పదాలూ నేర్పవచ్చు.

    అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ సాఫ్ట్‌వేర్ తదితర సాంకేతికరంగాల్ల్లోనూ, తెలుగుభాషాశాస్త్రంలోనూ, సినీ టెక్నాలజీ రంగంలోనూ పనిచేసే నిపుణులు ఇందుకు పూనుకుంటే ఈ పని సాధ్యమేనని నా కనిపించింది.

    డా. వేమూరి వెంకటేశ్వరరావుగారివంటి తీరికలేని ప్రొఫెసర్ తెలుగు నిఘంటువునే రూపొందించగలిగితే ఉత్సాహవంతులైన యువతీయువకులు ఇటువంటిది తప్పక చెయ్యగలరు. వీలుంటే ఈ డివిడిలను చూసి అందుకు ప్రయత్నించడం భావితరాలకు చాలా మంచి చెయ్యగలదు.

  22. Rohiniprasad అభిప్రాయం:

    May 8, 2012 11:42 pm

    ఇటీవలనే లండన్‌లో దొరికిన 1912 నాటి కలకత్తా ఫోటోలు కొన్ని ఇక్కడ చూడవచ్చు. మన దేశంలో గత వందేళ్ళుగా మారకుండా ఉన్నవి ఎటువంటివో మనం గమనించవచ్చు.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a