!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
వెల్చేరు నారాయణ రావు (జననం: ఫిబ్రవరి 1, ప్రతి ఏడు కొత్తగా) ఈమాటకి ఆప్తుడు, ఆత్మీయుడు, అంతకంటే ముందు మామంచి నేస్తం. పుస్తకాలు చదువుకోడమన్నా, అందరితో కలిసి కూర్చుని వాటి కబుర్లు చెప్పుకోడమన్నా ఆయనకు గొప్ప సరదా. కానీ అదే సరదా ఇలా ఎనభయ్యో వడిలో పడిపోడంలో చూపిస్తాడని మేం అనుకున్నామా! ఈ సాహిత్యపు రాలుగాయి తెలుగు సారస్వతానికి ఏం చేశాడో, చేస్తున్నాడో స్థాలీపులాక న్యాయంగా మీకు రుచి చూపిద్దామని పది మెతుకులు (ఒకటి చాలదు గదా మరి!) పట్టుకొచ్చేసరికి ఏడాది పడుతుందని మాకు తట్టలేదు. ఆయన మాకోసం పెరగకుండా ఆగనూ లేదు. అందుకే, కాస్త ఆలస్యంగా అయినా అంతే ఆప్యాయంగా నారాయణ రావు విశేష సంచికగా ఈ ఈమాటను అందిస్తున్నాం. ఈయన లాంటి వాడు ఇప్పటి దాకా లేడు, ఇంకొకడు వస్తాడనే నమ్మకమూ లేదు. అందుకే తప్పని సరై అడగడం, “వీఎన్నారూ, వయసు మీద వేసుకోడం మీరు కాస్త ఆపుతారూ?” అని. వింటే ఎంత బాగుణ్ణు.
“The number of citizens capable of reading and understanding the texts and documents of the classical era … will very soon approach a statistical zero. India is about to become the only major world culture whose literary patrimony, and indeed history, are in the custodianship of scholars outside the country: in Berkeley, Chicago, and New York, Oxford, Paris, and Vienna. This would not be healthy either for India or for the rest of the world that cares about India.”
-Sheldon Pollock (’Crisis in Classics‘, 2011.)
పరుచూరి శ్రీనివాస్‌కి పదివేల నూటపదహారు; పప్పు నాగరాజుకి ఐదువేల నూటపదహారు; భైరవభట్ల కామేశ్వరరావుకి వెయ్యి నూటపదహారు; సురేశ్ కొలిచాలకు ఉత్తి నూటపదహారు - కృతజ్ఞతలు, ప్రత్యేకంగా!
పూర్తిగా » ఒక అభిప్రాయం