ఈమాట » జూలై 2012

విషయ సూచిక: జూలై 2012

ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం!

పాబ్లో పికాసో, సాల్వడోర్ డాలి, ఎడ్గార్ డెగా, వాసిలీ కాండిన్‌స్కీ తదితరుల సరసన సమాన స్థాయిలో నిలబడిన చిత్రకారుడు ఎస్. వి. రామారావు. భారతీయ చిత్రకళా పద్ధతులను యూరోపు నైరూప్య చిత్రకళతో రంగరించి తనదంటూ ఒక ప్రత్యేకమైన భావప్రకాశకత్వాన్ని సాధించుకున్న రంగులకవి. చిత్రకారుడు, కవి, వ్యాసకర్త అయిన రామారావు కళాజీవన పరిణామాన్ని పరిచయం చేస్తూ వేలూరి వేంకటేశ్వర రావు వ్రాసిన వ్యాసం, నైరూప్యచిత్ర కళాయాత్రికుడు; చారిత్రక నవల లక్షణాల పరిశీలన, చర్చ కోసంగా మూడు ప్రత్యేక వ్యాసాలు - ఆంధ్రభాషలో చారిత్రక నవల గురించి నోరి నరసింహశాస్త్రి పరిచయ వ్యాసం, కొల్లాయి గట్టితేనేమి నవలపై రారా సమీక్షావ్యాసం, ఇర్వింగ్ స్టోన్ వ్రాసిన జీవిత నవల వ్యాసానువాదం ఈ సంచికలో మీకోసం.


ఈ సంచికలో: పాలపర్తి ఇంద్రాణి, తః తః, వైదేహి శశిధర్, విన్నకోట రవిశంకర్, కనకప్రసాద్‌ల కవితలు; సి. ఎస్. రావ్, జెజ్జాల కృష్ణ మోహన రావు, సురేశ్‌ కొలిచాల, వేలూరి వేంకటేశ్వర రావు, పప్పు నాగరాజుల వ్యాసాలు;గౌరి కృపానందన్, మాధవ్‌ మాచవరం, కొల్లూరి సోమ శంకర్, ఆర్. దమయంతిల కథలు; చీమలమర్రి బృందావనరావు, కనకప్రసాద్‌ల శీర్షికా వ్యాసాలు - నాకు నచ్చిన పద్యం, మూడు లాంతర్లు, రెండు కవితలకు గిరిధరరావు ప్రశంస, వేలూరి చెప్పే కథ నచ్చిన కారణం

పూర్తిగా »       6 అభిప్రాయాలు

చరిత్రాత్మక నవల అంటే?

మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభ కాలం నుండి, ఇప్పటివరకూ, అంటే ఈ నూరు సంవత్సరాలలో ప్రచురించబడ్డ ‘చారిత్రక నవలల’కు లూకాచ్ చెప్పిన లక్షణాలు ఉన్నాయా, లేవా? అనే ప్రశ్నకి సమాధానం వేరే మరొక వ్యాసం మరొకరు రాయవలసి ఉంటుంది. అసలు, లూకాచ్ ఉద్ఘాటించిన లక్షణాలు ఈ కాలపు చారిత్రక నవలలకి ఆపాదించవచ్చా అన్నది మౌలిక మైన ప్రశ్న.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

బింబం

ఎవరబ్బా ఈ మీనాక్షి? ఆమెకి నా ముఖం ఉంది. నా రూపం ఉంది. కాని వట్టి ఆమె కాదు నేను. రాబోయే కాలంలో నా పేరు మారు మ్రోగబోతుంది. చిన్నప్పటి నుంచీ అదే నా కల. అదే నా లక్ష్యం. ఎంతో మంది మీనాక్షిలలో నేను కూడా ఒక మీనాక్షినా? కానే కాదు. నేను వాణిని. చదువుల తల్లిని. పూలమాలతో దేవేరుని అలంకరించిన ఆండాళ్ నేనే.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       6 అభిప్రాయాలు

కాల్వీనో కథల నుంచి - 4

“ఆ కళ్ళు ఇంతకు ముందు నిన్ను ఇలా నిలదీసి చూడలేదు. నిన్ను చూసి చూపు తిప్పుకునే కళ్ళు నిన్నిప్పుడు సూటిగా చూస్తున్నాయి. నువ్వూ మెల్లిగా మర్చిపోతున్నావు. ఆ కళ్ళు అప్పటి శత్రువులవి. వీళ్ళవి కాదు. ఇప్పుడు వీళ్ళూ అవే కళ్ళతో మనల్ని చూస్తున్నారు.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       2 అభిప్రాయాలు

అంతరం

కొల్లూరి సోమ శంకర్

నాకు బాగా జ్ఞాపకం ఉంది. చిన్నప్పుడు నాకెప్పుడు ఒంట్లో బాలేకపోయినా, అమ్మ ఇలాగే చేసేది. ఎన్నోసార్లు నా రోగాలు అమ్మ చేతి స్పర్శ తగలగానే మంత్రం వేసినట్లు మాయమయ్యేవి. అమ్మ అరచేతుల స్పర్శ స్నేహితంగా ఎంతో ఆనందంగా ఉండేది, గంగ, యమున నదుల నీళ్ళలా చల్లగా హాయిగా ఉండేది.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       8 అభిప్రాయాలు

ఉరుము ఉరిమి…

నాగమ్మ పని మానేయడానికి నన్ను కారణం చేస్తున్నందుకు నాకైతే భలే మండుకొచ్చింది. శాసన సభలోలా, ఈ సంసారంలో - ఈవిడ ఎప్పుడు ప్రతిపక్షమౌతుందో, ఎప్పుడు మిత్రపక్షం వహిస్తుందో తెలీదు. తను నాకు అత్తగారన్న సంగతి ఆర్నెల్లకో సారి ఇదిగో ఇలా గుర్తు చేస్తూ వుంటుంది. సుర్రుమంది మనసు. పీకల దాకా వచ్చిన కోపాన్ని నిభాయించుకోవాల్సి వచ్చింది.

పూర్తిగా »       26 అభిప్రాయాలు

హోమగుండం: కథ నచ్చిన కారణం

“స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా వుందా? నిజం చెప్పండి.” అని వరాహమిహిరుడి శ్లోకం మకుటంగా ఈ కథ ప్రారంభమవుతుంది. కథా వస్తువు ముందుగానే తెలిసిపోతుంది. కథ అంతా చదివిన తరువాత, బహుశా ఆ వాక్యం ఆఖరిగా రాసి వుంటే బాగుండేదేమో ననిపించింది, నాలో ‘విమర్శకుడి’కి.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

రెండు కవితలు - ఇద్దరు కవులు

ఇంకొక విశేషమేమిటంటే - ఈ కవితలు వ్రాసిన కవులు ఒకరు ఆంధ్రలో, మరొకరు అమెరికాలో ఉన్నా, ఇద్దరూ కూడబలుక్కుని వ్రాసినట్లనిపించాయి. ఒకరు ‘చందవరం, ప్రకాశం జిల్లా’లో మనల్ని ఒక రౌండ్ కొట్టిస్తే, మరొకరు అధునాతనమైన బంగళాలోకి ‘తేనీటి సమయానికి’ సాదరంగా ఆహ్వానించారు.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

నాకు నచ్చిన పద్యం: ద్రౌపది పరివేదన

నిద్ర లేచిన భీముడు ‘ఎవరూ’ అని అడిగి, ద్రౌపది గొంతు గుర్తించి - కీచకుని దురాగతం నాకు చెప్పి వాణ్ణి చంపేందుకు నన్ను నియోగించడానికి వచ్చింది కాబోలు అనుకుంటూ, అయినా తన నోటితోనే విందామని నిశ్చయించుకొని - ‘ఇంత రాత్రివేళ ఎందుకొచ్చావు, ఎవరూ చూళ్ళేదు గదా’ అంటాడు. ఆమె ఆ మాత్రం అర్థం చేసుకోలేదా?

పూర్తిగా »       2 అభిప్రాయాలు

అమ్మ గోపెమ్మ

అన్నీ తెలిసిన ఆ భగవంతుడికి అంతా మాయే. అంతా లీలే. కాని ఆ తల్లికి మాత్రం తన బిడ్డడు నవ్వే ప్రతి నవ్వు, వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి చేష్టా ఒక అద్భుతము, అపూర్వము అయిన అనుభూతి. దాన్ని కాదనడానికి, త్రోసిపుచ్చడానికి సాధ్యాసాధ్యాలు అంటూ లేని ఆ దేవదేవుడికి కూడా సాధ్యం కాలేదు.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       4 అభిప్రాయాలు

స్మృతి

నిశ్శబ్దంగా లంగరెత్తి అంధకారపు కడలి కడుపు లోకి
మాయమయ్యే ఒంటరి నావలా నీవు వెళ్ళిపోయే క్షణాన
నీ అంతరంగంలో చెలరేగిన వేదనల తుఫానుల్ని …

పూర్తిగా »       4 అభిప్రాయాలు

ఇటు నేనే - అటు నేనే

తదేకంగా చూస్తున్నాను
“చోళీ వెనకాలేముంది?”
పాడుతూ ఆడుతోంది
కళా రింఛోళి మాధురి

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       13 అభిప్రాయాలు

వేసవి

చురుక్కు కొమ్ములు విసిరే ఎండకు
సింహం తల కూజా పంజా
సెగల రెక్కలు సాచిన ఇనునికి
పకపక నవ్వుల పంకా జోరు

పూర్తిగా »       5 అభిప్రాయాలు

జుగల్‌బందీ

అట్నుంచి హోరు
ఇట్నుంచి జల్లు
ఉరుముతున్నాది
ఎడ తెగని వాన.
అడుగులో అడుగు
తడిసిపోకుండా.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

ఆఖరి మనిషి

నటులేకాదు, ప్రేక్షకులు కూడా
ఒకరొకరుగా నిష్క్రమిస్తారు.
రంగస్థలం మీది విషాదానికి
కలిసి కన్నీరు పెట్టటానికి
ఇరువైపులా ఎవరూ కనబడరు

పూర్తిగా »       13 అభిప్రాయాలు

మూడు లాంతర్లు - 11

ఎందుకు రాస్తున్నావు? అంటే ఒక్క కనక ప్రసాదు కోసమే రాస్తున్నాను అని. మనం రోజూ అన్నం తినేటప్పుడు ఉన్నతమైన తెలుగు సస్యసీమల భవిష్యత్తు కోసమో, తెలుగు పిండివంటల భవిష్యత్తు ఏమవుతుందోనని బెంగపెట్టుకునో అన్నం తినము. మనకి ఆకలేస్తోంది కాబట్టి, తప్పనిసరై అన్నం - లేదూ ఏది దొరికితే అదీ తింటాము.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

తెలుగు వ్యాకరణాల పరిచయం

బాలవ్యాకరణం కన్నా ముందు వచ్చిన తెలుగు వ్యాకరణ గ్రంథాల గురించి చాలామందికి తెలియదు. పాణిని తనకన్నా ముందు వచ్చిన వ్యాకరణాల గురించి ప్రస్తావించినట్టుగా, చిన్నయ్యసూరి తనకంటే పూర్వం వెలువడిన వ్యాకరణాలను ప్రస్తావించలేదు. కానీ, తెలుగులో కూడా వ్యాకరణ గ్రంథాలు కవిత్రయ కాలం నుండీ వెలువడుతూ ఉన్నాయి.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       23 అభిప్రాయాలు

నైరూప్యచిత్ర కళాయాత్రికుడు

రామారావు లండన్‌కి కనీసం కుంచెలు కూడా తీసుకొని పోకుండా ఉట్టి చేతులతోనే వెళ్ళాడు. పాశ్చాత్య చిత్రకళారీతులను అక్కడి గురువుల నుండి మళ్ళీ కొత్తగా మొదటినుండీ నేర్చుకోడానికే నిర్ణయించుకోడమే ఇందుకు కారణం. అతని ప్రయత్నమంతా అక్కడ ఒక ఆధునిక చిత్రకారుడిగా ఎదగడమే.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       6 అభిప్రాయాలు

మత్తకోకిల కథ

జెజ్జాల కృష్ణ మోహన రావు

పారసీక ఉర్దూ భాషలలో మత్తకోకిల లయను బహర్ రమల్ ముసమ్మన్ మహజూఫ్ అంటారు (బహర్ అంటే పద్యము లేక వృత్తము). దీని సూత్రము ఫాయలాతున ఫాయలాతున ఫాయలాతున ఫాయలున్. దీనిని మన గురులఘువులవలెనే వివరిస్తారు. గాలిబ్ వ్రాసిన సబ్ కహాఁ కుఛ్ లాలహ్ ఓ గుల్ మేఁ నుమాయా హో గయీ అనే గజల్‌ ఈ లయలోనిదే.

పేజీలు: 1 2 3 4 5 6 7      అంతా ఒకే పేజీలో       6 అభిప్రాయాలు

యజ్ఞం కథ: మరో పరిశీలన

రామారావుగారి కధ మంచి ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటోలా ఉంటుంది. కానీ మంచి చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉండదు. రచయిత దృక్పధాన్ని కధను మధించి పట్టుకోవటానికి వీలుగా ఉండాలి. ఈ కధ ద్వారా రామారావుగారు ఇంతకూ చెప్పదలచుకున్నది ఏమిటంటే అదేదో చెప్పటం కష్టం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా కధ సాగుతుంది.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       20 అభిప్రాయాలు

చారిత్రక నవల: కొల్లాయి గట్టితే నేమి?

చారిత్రక నవలకుండవలసిన మొదటి లక్షణం చారిత్రకత. సాధారణంగా సాంఘిక నవలలన్నీ సమకాలిక సమాజాన్ని వాస్తవికంగానే చిత్రిస్తాయి. కానీ సామాజిక పరిస్థితులు యెంత వాస్తవికంగా, యెంత విపులంగా, యెంత కళాత్మకంగా చిత్రించినా, ఆ దేశకాల పరిస్థితులు అలా యెందుకున్నాయనే ప్రశ్న ఎప్పుడూ ఉత్పన్నంకాదు (ప్రశ్నే లేదు గనక సమాధానమూ లేదు).

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల

చరిత్రాత్మక నవల అనేది రెండు విరుద్ధ శబ్దాల సమ్మేళనమనే భ్రాంతి కలిగిస్తుంది. జరిగినదంతా వ్రాసుకుంటూ పోతే చరిత్ర కాదు. లోకానికో, దేశానికో, సంఘానికో, వ్యక్తికో, మంచికో, చెడుకో ప్రభావం కలిగించే సంఘటనలు వ్రాస్తేనే చరిత్ర. దానితో అనుగుణమైన కల్పన జోడిస్తే చరిత్రాత్మక నవల అవుతుంది. దానికి చరిత్ర బీజముంటే చాలును.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       2 అభిప్రాయాలు

జీవిత నవల - 1

ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇవ్వడానికి నాలుగేళ్ళు, ఔషధ నిర్మాతకి ఐదేళ్ళు, దంత వైద్యుడికి ఆరు, న్యాయవాదికి ఏడు, వైద్యుడికి ఎనిమిది సంవత్సరాలు శిక్షణ అవసరం అయినప్పుడు, అంతకు తక్కువ సమయం లోనే ఒక సుశిక్షితుడైన జీవిత నవలారచయితగా ఎదగడం ఎలా సాధ్యం?

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       2 అభిప్రాయాలు