తెలుగు జానపద వాఙ్మయంలో, తరతరాల తెలుగు స్త్రీల పాటల్లో అంతర్భాగమైపోయిన రామాయణ కథల పరిశీలనలో, మరొక స్త్రీల పాట ‘సీత గడియ‘పై వెల్చేరు నారాయణరావు వ్యాసం; ఈ శీర్షికా సంప్రదాయంలో భాగంగా కోలవెన్ను మలయవాసిని 2000 ఆగస్ట్, షికాగోలో “సాహిత్యం - స్త్రీల చైతన్యం” అనే అంశం మీద, సాహిత్యంలో ఉపేక్షిత పాత్రలైన అనసూయ-ప్రియంవద, ఊర్మిళ, శ్రుతకీర్తులను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగం వీడియో; ఒకే గీతాన్ని ఇద్దరు గాయకులు, చిదంబరం, పద్మావతి వేర్వేరు రాగమాలికలుగా పాడిన కనకప్రసాద్ శబ్ద రచన త్రిపురాంతకేశ్వరా!; టంగుటూరి సూర్యకుమారి పాడిన నిర్వాణ షట్కం అపురూపమైన ఆడియో, ఈ సంచికలో ప్రత్యేకతలు.
ఈ సంచికలో: ఇంద్రాణి, దమయంతి, కనకప్రసాద్, తఃతః, రవి, ఉదయకళల కవితలు; రోహిణీప్రసాద్ పిలూ రాగ పరిచయం; కొక్కొండ పంతులుగారిపై కృష్ణ మోహన రావు సాహిత్య వ్యాసం; పూర్ణిమ, సాయి బ్రహ్మానందం, శారద, మాధవ్, గౌరిల కథలు; బ్రహ్మానందం పుస్తక సమీక్ష, వేంకటేశ్వరరావు వ్యంగ్య రచన, గిరిధరరావు చెప్తున్న కథ నచ్చిన కారణం, కినిమా పత్రిక ముచ్చట్లు; కనకప్రసాద్, సురేశ్, బృందావనరావుల ధారావాహికా వ్యాసాలు…
పూర్తిగా » 8 అభిప్రాయాలు