ఈమాట » మార్చి 2011

విషయ సూచిక: మార్చి 2011

ఈమాట మార్చ్ 2011 సంచికకు స్వాగతం!

ముళ్ళపూడి వెంకటరమణ (28/06/1931 - 23/02/2011)

ముళ్ళపూడి వెంకట రమణ (28 జూన్ 1931 - 24 ఫిబ్రవరి 2011): సాక్షి, ముత్యాలముగ్గు, రాజాధిరాజు, అందాలరాముడు, బుద్ధిమంతుడు, గోరంత దీపం, స్నేహం, వంశవృక్షం, రాధాకళ్యాణం - ఇలా ఎన్నో బాపూ చిత్రాలకు మాటలద్దిన మాంత్రికుడు. బుడుగు, సీగాన పెసూనాంబ, అప్పుల అప్పారావు, కాంట్రాక్టరు, రాధా గోపాళం, రెండుజెళ్ళ సీత - ఇలా ఎన్నో పాత్రలకు జన్మ నిచ్చి మాటలు పోసి పెంచి సజీవులను, చిరంజీవులను చేసిన వాక్య బ్రహ్మ, ఋణానందలహరి భాష్యకారుడు, అర్ధబాపూ అయిన శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ పెన్ను మూశారు. వారికి మా శ్రద్ధాంజలి.


  • ఈమాట ప్రచురణ నియమాలలో ఒక చిన్న మార్పు ప్రవేశపెడుతున్నాం.
  • పలుకుబడి - తెలుగు పదాలపై సురేశ్ కొలిచాల కొత్త శీర్షిక ప్రారంభం.
  • ఒక కథ చెప్పిన కథ; కనకప్రసాద్ కవిత, వ్యాసం, శబ్ద సాహిత్యం; సత్య పెట్లూరి మొదటి కథ కాలనీ భోగి; ఇంద్రాణి, దమయంతి, ఉదయకళ, రవిశంకర్, కృష్ణదేశికాచార్యుల కవితలు, వేలూరి వేంకటేశ్వరరావు, గొర్తి బ్రహ్మానందంల కథలూ, ఇతర శీర్షికలు, వ్యాసాలు - ఈ సంచికలో మీకోసం.
పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

ఈమాట ప్రచురణలో చిన్న మార్పు

ఈ మధ్య ఒకరిద్దరు రచయితలు, తమ వ్యాసాలను మరింత తరుచుగా ప్రచురించే వీలుంటే బాగుండునని మాతో తమ కోరిక వెలిబుచ్చారు. మాకూ సబబే అనిపించింది.

పూర్తిగా »       4 అభిప్రాయాలు

ఏడు గోరీల కథ

ఎన్ని సంవత్సరాల నుంచీ ఆ గోరీలు అక్కడ ఉన్నాయో ఖచ్చితంగా ఎవడికీ తెలియదు. సుబ్బయ్య నాయుడు ముత్తాత ఇల్లు కట్టుకోక పూర్వంనుంచే అక్కడ ఏడు గోరీలు ఉన్నాయని వాదు.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

కథ కథ

నేను మిమ్మల్ని మోసం చేయబోవడం లేదు. చేసి మీ దృష్టిని ఆకట్టుకునే ఉద్దేశమే ఉంటే నా మొదటి వాక్యం “చిమ్మ చీకట్లోంచి ఒక స్త్రీ ఆర్తనాదం హృదయ విదారకంగా వినిపించింది” అయి ఉండేది.

పూర్తిగా »       12 అభిప్రాయాలు

కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ

“ఊరందరికీ ఇలాంటి పుకార్లంటే భలే ఇష్టం. పంకజానికి పొలం వ్యవహరాల్లో మా బావ సాయం చేస్తున్నాడు. అంతే! అందర్నీ పిలిచినట్లుగానే మా అక్క ఆవిణ్ణీ పిలిచింది. ఏం పిలవకూడదా?”

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       8 అభిప్రాయాలు

కాలనీ భోగి

సాయి గాడి ఆనందం అంతా ఇంతా కాదు. ఉబ్బి తబ్బిబ్బు అయిపోయి స్పెషల్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హరిగాడయితే ఇంక చెప్పక్కర్లేదు. రామకృష్ణ “ఒరేయ్, గ్యారంటీనా?” అంటూ డౌటు పడ్డాడు.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       9 అభిప్రాయాలు

సామాన్యుని స్వగతం: మంచి స్నేహితురాలు

నేను ఉద్యోగంలో చేరిన రోజు తను ఆస్పత్రి, ఆఫీసుల మధ్య తిరుగుతోంది. వాళ్ళ నాన్నకిది నాలుగో గుండె పోటు. ఆయనకు ఆరోగ్యం నెమ్మదించినప్పుడు మాత్రం వాళ్ళందరి జీవితాలను నియంత్రించేది నాయనే.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

పడిపోయిన సిపాయి: కథ నచ్చిన కారణం

ఏ దేశంలోనన్నా యుద్ధం వస్తే, యుద్ధపరంగా సాహిత్యం రావడం సహజం. ఆ విషయంలో మన తెలుగు సాహిత్యం కుంటుపడే ఉన్నది. బహుశా తెలుగునాడు నుంచి మిలిటరీలోకి వెళ్ళినవారు తక్కువై ఉండవచ్చు.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

నాకు నచ్చిన పద్యం: వామనావతారం

బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు పోతన.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

స్వేచ్ఛ?

అద్భుతాల దీపాలు
అంతులేని శాపాలు
జాతకాలు పాతకాలు
దేవుడికే లంచాలు

పూర్తిగా »       ఒక అభిప్రాయం

భాషల ఋతువు

బ్రతుకు పోరాటంలో బయల్దేరినప్పుడు
అపరిచితమైన దూర తీరాలు చేరినప్పుడు
ఆప్త మిత్రునిలా ఆంగ్లభాష.

పూర్తిగా »       8 అభిప్రాయాలు

ఫాదరు జోజి

నేలబారు గద్ద
నిడుపు సూపు నేను
నేలమీద లేను
ధూళి రేగుతాను.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

మేఘాంగన

కఱ్ఱచట్రంబు పైఁ గట్టి గట్టిగాను
చిత్రలేఖన కనువైన శ్వేతపటము
వ్రాయఁ గాఁ గడంగితిఁ దద్వి హాయసానఁ
గ్రాలు ఘనమాలికాచిత్రమాలికలను.

పూర్తిగా »       13 అభిప్రాయాలు

నిరాశకై ఆశపడుతూ…

నాకు మళ్ళీ గుర్తొస్తోంది-
నువ్వొచ్చిన ఆ కాలమే ఇదనీ
చప్పున గుండె చప్పుడు ఆగి వెళ్ళిందనీ.

పూర్తిగా »       7 అభిప్రాయాలు

వాళ్ళు రాక ముందు

బుడి బుడి
నీటి తెప్పల కింద
తక్కుతూ తారుతూ

పూర్తిగా »       2 అభిప్రాయాలు

మూడు లాంతర్లు - 2

కళ, సారస్వతం వంటి వెసులుబాటు లేని రంగాల్లోన ఎవరైనా అంత ఓపిగ్గా పరిశ్రమ ఎందుకు చేస్తారు? వాళ్ళ మనస్తత్వానికి అది తప్పనిసరి అయితేనే కదా! కేవలం తెలివితేటలూ, స్వయంప్రతిభ తోటే గొప్ప ఫలితాల్ని సాధిస్తామనుకొనే వాళ్ళ విశ్వాసాలు, న్యూనతల్ని గురించి ‘రామానుజన్ సిండ్రోం’ అని ఒక కధ ఉన్నాది. ఆ కధ విని నాకు ఎక్కడో ‘చురుక్కు’మని గుచ్చుకుంది. ఇలాగని బిపిన్‌తో అంటే నవ్వీసి ఊరుకున్నాడు.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       6 అభిప్రాయాలు

మూడు లాంతర్లు - 3

సృజనశీలి యంత్రం కాదు. కాని అతని అంతరంగంలో ఒక కంప్యూటరు వంటి మెదడు, ఆ పైన ఒక ఆదిమ వానరం అనదగిన జాంతవ ప్రకృతి, ఆ పైన నాగరికుడు, మర్యాదస్తుడు, సంస్కారి అనదగిన ఒక మనిషి - వీళ్ళు ముగ్గురూ ఉన్నారు.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

పలుకుబడి: ముందుమాట

భాష అంటే జ్ఞాపకాల నిధి. ఒక జాతి సంస్కృతి, చరిత్ర ఆ భాషలో నిక్షిప్తమై ఉంది. భాషలోని ప్రతి పదం వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంటుంది. ఒక భాషలోని పదాల సామూహిక ఆత్మకథే ఆ భాషాచరిత్ర అని చెప్పుకోవచ్చు.

పూర్తిగా »       8 అభిప్రాయాలు

విద్యాసుందరి - వ్యాసానుబంధము

రాధికాసాంత్వనము ప్రచురితమైన సంవత్సర కాలం తరువాత, 1911లో, ‘శశిలేఖ’ అన్న పత్రికా సంపాదకులు ఇది అశ్లీల కావ్యమని అభ్యంతరం లేవనెత్తటముతో, ఈ పుస్తకం నిషేధింపబడి తెలుగు సాహిత్య, ప్రచురణా రంగములలో పెద్ద కార్చిచ్చు రేగిల్లినది.

పూర్తిగా »       11 అభిప్రాయాలు

త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు

సంగీతం శబ్ద ప్రధానమైనది కాబట్టి ఆ కవిత్వంలో వాడే పదాలు సరళంగానూ, సున్నితంగానూ ఉండే అవసరమొచ్చింది. అందువల్ల ఏ వాగ్గేయకారుడైనా భాష మీద చాలా పట్టుంటే కానీ శబ్దాలంకార ప్రయోగాలు చేయలేరు.

పేజీలు: 1 2 3 4      అంతా ఒకే పేజీలో       27 అభిప్రాయాలు

ఇల్లు విడిచి పోతావా రమణా?

ఇల్లు విడిచి పోతావా రమణా?
అన్ని తెలిసి ఇన్ని కలిగి
ఇల్లిల్లు తిరిగి ఉంఛమెత్తి
గుళ్ళవెంట పోతావా తగునా?

పూర్తిగా »       6 అభిప్రాయాలు

తానా జ్ఞాపిక ‘తెలుగు పలుకు’ - రచనలకు ఆహ్వానం

తానా (జులై 1-3, 2011) 18వ సభల సందర్భంగా వెలువడనున్న ‘తెలుగు పలుకు’ జ్ఞాపిక ప్రచురణ నిమిత్తమై రచనలు ఆహ్వానిస్తున్నాం.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి