ఈమాట » జనవరి 2011

విషయ సూచిక: జనవరి 2011

ఒక పండితుడి స్మరణలో…: ఈమాట జనవరి 2011 సంచికకి స్వాగతం

!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

కోవెల సంపత్కుమారాచార్య (26 జూన్ 1933 - 6 ఆగస్ట్ 2010): శ్రీ కోవెల జననం వరంగల్లులో. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు, హిందీ భాషలలో ఎం. ఏ., ఆపై కాకతీయ విశ్వవిద్యాలయం నుండి 1978లో ‘తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ: సంప్రదాయము’ అనే సిద్ధాంత గ్రంథంతో డాక్టరేట్ డిగ్రీలు. అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ - లక్షణ దీపిక, తెలుగు ఛందోవికాసము, మధుర గాథలు, తదితర గ్రంథాలు; ఆముక్త, చేతనావర్తం కవితా కావ్యాలు; విశ్వనాథ కవిత్వ విమర్శ, కన్యాశుల్క నాటక విమర్శ, వచన పద్య లక్షణంపై చేరాతో చర్చ, అనేక తదితర సాహిత్య వ్యాసాలు - తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో పరిపుష్టం చేసిన పండితుడు, కవి, విమర్శకుడు, నిగర్వి, స్నేహశీలి, ఒక మామంచి మనిషీయన. సంపత్కుమారాచార్య సాహితీప్రస్థానంపై సమగ్ర పరిచయాత్మక ప్రత్యేక వ్యాసం ‘విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార‘ సహితంగా ఈ స్మారక సంచికలో మీకోసం…

పూర్తిగా »       4 అభిప్రాయాలు

ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం

ఏ కవితనో చదువుతున్నప్పుడు మనందరికీ ఎప్పుడో ఒక్కప్పుడు వచ్చే సందేహం - ఇదసలు కవితేనా, లేకపోతే వాక్యాన్ని పొట్టీ పొడుగూ ముక్కలుగా విరక్కొట్టి ఇది కవితే అని రాసినవారు బుకాయిస్తున్నారా అని. అది కవిత్వమే అయితే, కవి ఏ ఆధారంతో ఆ కవితలో పాదాలని విరక్కొడుతున్నాడు? అని.

పూర్తిగా »       17 అభిప్రాయాలు

సిరుల సంక్రాంతి

ప్రాంగణాన పెద్ద ముగ్గు. ప్రహరీ గోడ బయట వీధిలో మరో ముగ్గు. గేట్ తీసుకుని బయటకు తొంగి చూస్తే ఇంటింటికీ ముగ్గులు. తెల్లగా నక్షత్రధూళి దారంతా పరుచుకున్నట్టు తోచేది.

పూర్తిగా »       11 అభిప్రాయాలు

రెక్కలు: కథ నచ్చిన కారణం

సుమారు 1991 ప్రాంతంలో లండన్ నుండి తిరిగొస్తూ హైద్రాబాదు ఎయిర్‌పోర్టులో ఇండియా టుడే తెలుగు పత్రిక కొన్నాను. అప్పుడే తెలుగు వెర్షన్ కొత్తగా మార్కెట్లో ప్రవేశ పెట్టారు. సాధారణంగా వార్తా కథనాలే ఉండే పత్రికలో ఒక కథ! ఆ కథ పేరు ‘రెక్కలు’.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

కమాండో: డా. నిసి షామల్ నొవెల్లా

లైలా యెర్నేని

“క్రైం బ్రాంచ్ ఛీఫ్ మనకు బాగా తెలిసినవాడే కదా. విషయం చెప్పి, 48 -72 గంటల వ్యవధి అడుగు. ఆటాప్సీ ఈ హాస్పిటల్లోనే చెయ్యనీ. ఇచ్చిన గడువు లోపల నేను హంతకుడెవరో చెప్పలేకపోతే, ఆ తర్వాత కథ వాళ్ళిష్టమైనట్లు నడిపించవచ్చు.”

పేజీలు: 1 2 3 4 5      అంతా ఒకే పేజీలో       3 అభిప్రాయాలు

మరో విఫల యత్నం

“ఛ, మీతో మహా విసుగ్గా ఉంది. ఎందుకిలా నస పెడుతున్నారు నా చావేదో నన్ను చావనివ్వక! సరే, ఓపని చేద్దాం. మీరు దూకేయండి, ఆపై నేనేమైనా మీకనవసరం కదా. నేను దూకేస్తా అప్పుడు.”

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       ఒక అభిప్రాయం

తేడా

కొల్లూరి సోమ శంకర్

వ్యాన్‌ని సేఠ్‌జీకి అప్పగించేసి ఎక్కడైనా కూర్చుని ఒంటరిగా తాగితే బాగుంటుందని అనిపించింది. టైం ఇంకా మూడే అయింది.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

కోనసీమ కథలు: వామనుడు

ఏదయితేనేం పేరప్పగారు బ్రతికున్నంత కాలమూ ఆస్తి సంపాదించాడేమో కానీ ఎవరి ప్రేమా సంపాదించలేదు; కనీసం కన్నవాళ్ళ కన్నీళ్ళు కూడా దక్కించుకోలేక పోయాడు. రెండ్రోజులు పోయాక మా ఆవిణ్ణీ వెళ్ళి పలకరించి రమ్మన్మని చెప్పాను.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       4 అభిప్రాయాలు

సామాన్యుని స్వగతం: మా దేవక్క

మేము నలుగురు ఆడపిల్లలలో దేవక్క పెద్దది. మా నాయనకు మాత్రం ఆమె ఎప్పటికీ ‘సన్నక్క’నే. నేను చిన్నప్పుడెప్పుడూ అనుకునేదాన్ని. ఆమె మా అందరికన్నా పెద్దది కదా, దేవక్కను ఈయన ‘సన్నక్క’ అంటాడెందుకని.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన

ఇక ఆమె కూర్చున్న వైఖరి - రావణ నిర్మూలనానికి, అంటే అధర్మ నిధనానికి సన్నద్ధుడైన శ్రీరాముని పూనిక రూపం దాల్చినట్లు - లోనే ఆమె నిశ్చయమూ, ఆమె నిశ్చలతా, తన భర్త యెడ ఆమెకు గల అనంత విశ్వాసమూ అన్నీ ద్యోతకమౌతున్నాయి.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

పెండ్లి కల

[వేలూరి వేంకటేశ్వర రావు పరిచయంతో…]

వారణమాయిరం ప్రత్యేక గ్రంథం కాదని, అది నాచ్చియార్ తిరుమొళిలో ఒక ఖండమనీ, ఆ ఖండంలో గోదాదేవి రంగనాథునితో తనకు కలలో జరిగిన పెండ్లి చెలికత్తెకి వివరించిందనీ తెలిసింది. సంపత్కుమారకి ఆ ‘పెండ్లి కల’ తెలుగులోకి తేవాలనీ కోరిక కలిగింది.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       2 అభిప్రాయాలు

నవనాలంద

పదిల పరచంగ పుస్తకప్రతతు లెల్ల
రత్నసాగరమన, రత్నరంజకమన,
మఱియు రత్నోదధి యనంగఁ బరగు
మూఁడు గగనమంటెడి భవనాలు గట్టిరచట.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

మెరుపు

ఉండుండి గంతేసి
వెర్రిగా పరుగెడుతోంది
తుఫాను గాలి

పూర్తిగా »       ఒక అభిప్రాయం

శిశిర చిత్రాలు

గాలి వీచినప్పుడల్లా
పసిపిల్లల్లా
రోడ్డుకటూ ఇటూ
పరుగులు తీస్తాయి
రాలిన ఆకులు

పూర్తిగా »       2 అభిప్రాయాలు

తవ్విపోత

జాన్‌హైడ్ కనుమూరి

జీవితానికి శెలవుచీటిపెట్టిన ఉపాధ్యాయుల్ని
మననం చేసుకున్నప్పుడే కదా
వాళ్ళు మనకెంత ధారపోశారో తెలిసేది?

పూర్తిగా »       11 అభిప్రాయాలు

మంచుమనిషి

జెజ్జాల కృష్ణ మోహన రావు

పువ్వులో, యవి పుష్యరాగపు
రవ్వలో, యవి రజత వృక్షపు
రివ్వలో, యవి ఋతుకుమారికి
నవ్వులో, దువ్వల్

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       2 అభిప్రాయాలు

గురువు

దేవున్ని నమ్మిన వాళ్ళకు
నమ్మని వాళ్ళకు కూడా
ఏదో దైవ సాక్షాత్కారం జరిగినట్టు ఉంటుంది.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

చేరా కు ఒక శతమానం

బలవంతపు చదువుల వ
త్తిళులన్ బాల్యంపు సొగసు తీపిని దోచే
మలిన సమాజములో పి
ల్లలకన్ననూ దళితులెవరురా ఇట చేరా!

పూర్తిగా »       6 అభిప్రాయాలు

ఛందస్సే యయె నీదు కోవెల

ఛందశ్శాస్త్రమును సంపత్కుమార అధ్యయనము చేసి రాసిన గ్రంథాలు మంచి పండితునికి, పరిశోధకునికి మనసుంటే ఏదైనా అసాధ్యము కాదని మనకు నిరూపిస్తాయి.

పేజీలు: 1 2 3 4      అంతా ఒకే పేజీలో       ఒక అభిప్రాయం

విశ్వనాథ కోవెల

దేశీయతకు సంపత్కుమారగారి నిర్వచనం విశ్వనాథ అంతరంగానికి ప్రతిధ్వని. నేడు ప్రభంజనంలా వ్యాపిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ దేశీయత గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతయినా ఉంది.

పేజీలు: 1 2 3 4 5      అంతా ఒకే పేజీలో       5 అభిప్రాయాలు

విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార

వ్యాకరణాల సంకెళ్లు విడగొట్టడానికి సంపత్కుమార అనుసరించిన రీతి ఇది. సంప్రదాయంలో ఆధునికతను, ఆధునికతలో సంప్రదాయాన్నీ రంగరించి చూపడమే సంపత్కుమార నవ్యసంప్రదాయ మార్గంలోని విశిష్టత.

పేజీలు: 1 2 3 4 5 6      అంతా ఒకే పేజీలో       ఒక అభిప్రాయం

కోవెల సంపత్కుమార, కన్యాశుల్కం - మరో కోణం: విమర్శలు - పరామర్శ

సంపత్కుమార కన్యాశుల్కం నాటకాన్ని రకరకాల కోణాలనుంచి పరిశీలించి తన అభిప్రాయాలని సూటిగా చెప్పారు. ఆ వ్యాసాలపై వచ్చిన విమర్శలన్నిటికీ సమాధానంగా రాసిన ఈ వ్యాసానికి, నిజంగా తగిన గుర్తింపు రాలేదు.

పూర్తిగా »       4 అభిప్రాయాలు

పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’

ఇప్పటి కుర్రకారుకి మన భారత దేశాన్నుంచి అమెరికా రావటమంటే నల్లేరు మీద బండి నడకే కావచ్చు. కానీ అప్పట్లో అదొక అద్భుతమైన సాహసయాత్రే!

పూర్తిగా »       6 అభిప్రాయాలు

మూడు లాంతర్లు

మనం ఏదైనా కాల్పనిక సాహిత్యాన్ని, అంటే కధ, కవిత వంటిదాన్ని చదివేటప్పుడు, ఎలా చదువుతున్నాము, ఎలా స్ఫురణకు తెచ్చుకుంటున్నాము, అర్ధం చేసుకుని ఆస్వాదిస్తున్నాము?

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       3 అభిప్రాయాలు

1. వచన పద్యం: ఆభాస లక్షణ నిరాకరణం

చాలామంది వచన పద్యం అంటే ఏమిటో చెప్పకుండానే దానిమీద పెద్ద పెద్ద వ్యాసాలు, వచన కవిత్వాన్ని గురించి కవితామయ నిర్వచనాలిచ్చారు. కవిత్వాన్ని గురించి కవిత్వంలో చెప్పితే అది లక్షణం కాదు.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

2. వచన పద్యం: లక్షణ నిరూపణం

ఒక్క అంశం మాత్రం ఇక్కడ అవసరంగా చెప్పవలసి వస్తున్నది - వచన పద్య ప్రయోక్త లందరూ వచన పద్యాన్ని ఒక ఛందోరూపంగానే భావిస్తున్నారు తప్ప కేవలం వచనంగానో, లేక గద్యంగానో భావించటం లేదు.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       ఒక అభిప్రాయం

3. వచన పద్యం ఛందో విభాగం కాదు

ఈ చిక్కులన్నిటికీ కారణం ఛందస్సాంప్రదాయంలో ఈ వచన పద్యానికి చోటు కల్పించటం కోసం ప్రయత్నించటం. ఏదో రకమైన ఛందస్సూ, గణ విభజన ఉన్నయ్యంటే, వచన పద్యానికి అదనంగా ఏదో గౌరవం వస్తుందనుకోవటం.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

4. వచన పద్యం పద్యమే

మాత్రాఛందస్సులను దాటివచ్చి, తనంతట తానే వచన పద్యం ఛందస్సాంప్రదాయంలో చోటు చేసుకున్నది. కాగా, నేను చేసింది ఆ చోటు యొక్క స్వరూపాన్ని స్పష్టం చేయటమే. ఛందస్సూ, గణ విభజనా ఉన్నంత మాత్రాన ఏ ‘పద్యా’నికీ అదనపు ‘గౌరవం’ రాదు.

పేజీలు: 1 2 3 4      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

5. పద్యం, గద్యం, వచన పద్యం వగైరా

భావగణ విభజనలో వ్యాకరణాంశాల పాత్రను సంపత్కుమార పూర్తిగా నిరాకరించలేదు. ఆ పాత్ర ఎంతవరకు అన్నదాంట్లోనే మాకీ అభిప్రాయ భేదం. వ్యాకరణ సంబంధాలకీ, భావాంశాలకీ ఏకైక సంబంధం ఉందని నా అభిప్రాయం.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

6. వచన పద్యం: వాద సమాపనం

వచన పద్యానికి నేను చెప్పిన లక్షణమే లక్షణమని, ఇది మాత్రమే నిర్దిష్టమయిందని కాని వాదించే అతిశయం నాకు లేదు. నాకు స్ఫురించిన ఒక పద్ధతిని సూచించటం మాత్రమే నా తాత్పర్యం.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

కృష్ణా తటచారిన్

హృద్యోతిత దీపా
విద్యాగమ విదురా
మాధ్యమికా చతురా

పూర్తిగా »       ఒక అభిప్రాయం