ఈమాట » నవంబర్ 2009

విషయ సూచిక: నవంబర్ 2009

ఈమాట నవంబర్ 2009 కొ.కు ప్రత్యేక సంచికకు స్వాగతం

కొడవటిగంటి కుటుంబరావు

గతశతాబ్దపు సాహిత్యకారుల్లో ప్రముఖుడిగా పేరెన్నిక గన్న కొడవటిగంటి కుటుంబరావు గారి (అక్టోబర్ 28, 1909 - ఆగస్ట్ 17, 1980) శతజయంతిని పురస్కరించుకొని ఈ ఈమాటను కొ.కు స్మారక ప్రత్యేక సంచికగా మీకు సమర్పిస్తున్నాం. కొడవటిగంటి రాసిన ఉత్తరాలు, విమర్శకుల వ్యాసాలు, పాలగుమ్మి రేడియో చర్చ, అలాగే రోహిణీప్రసాద్, లక్ష్మన్న, హనుమంతరావుల కొత్త వ్యాసాలు ఈ సంచిక ప్రత్యేకం. ఇంకా…

పూర్తిగా »       ఒక అభిప్రాయం

బాలగోపాల్‌కొక నూలుపోగు

కే. బాలగోపాల్

బాలగోపాల్ బహుముఖప్రజ్ఞుడు అనడం అతిశయోక్తి కాదు. సాహిత్య విమర్శకుడిగా, తత్వశాస్త్రవేత్తగా, సామాజికశాస్త్ర వ్యాఖ్యాతగా తెలుగునాట ప్రసిద్ధికెక్కాడు.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

ఎవరి బిడ్డ ఇది?

సరిత, రత్తాలు చేతులు రెండూ పట్టుకుని, “రత్తాలూ, నీ మేలు జన్మలో మర్చిపోలేను! వేళకు చక్కగా భోజనం చెయ్యి, పళ్లూ, పాలూ విడవకుండా తీసుకో. డబ్బు నీది, బిడ్డ మాది…అన్నది మర్చిపోకు సుమీ” అంటూ రత్తాలుకి చెక్కు అందించింది.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

సామాన్యుని స్వగతం: మా అమ్మ - నడిచే బడి

నిప్పులు కక్కుతున్న రామయ్యను ఎలా చల్లబరచాలో అమ్మకు తెలుసు. వాళ్ళకు ఈమె మీద చాలా గౌరవం! “పోన్లేప్పా! దానికి బుద్ధి లేదు! దాని బదులు నేను చెప్తున్నా. తప్పయిందిలే, ఏమనుకోవద్దండి!

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       3 అభిప్రాయాలు

అమ్మ ఉత్తరం

అస్తమానూ, “ఉత్తరం రాయీ, ఉత్తరం రాయీ” అంటుంటే, “దేని గురించి రాయమంటావూ?” అని నేనడిగినప్పుడు, “ఏదో ఒకటి రాయి. పిల్లి గురించో, కుక్క గురించో రాయి” అంటావు కదా?

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       14 అభిప్రాయాలు

“ఎవరో!” - ఒక నిసీ షామల్ కథ

లైలా యెర్నేని

సౌందర్యమే సౌఖ్యము ;
సౌఖ్యమే -జీవిత సాఫల్యమని
ఎంచు కీట్స్ మధుర కాంక్షా నవతా
యువతా కవితా కల్పనా జగతి లోనే
నన్నుంచుమా! ప్రియతమా!

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       6 అభిప్రాయాలు

డి. టి. ఏల్. సీ. - కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాల పై సమీక్ష

జెజ్జాల కృష్ణ మోహన రావు

రెండు రోజుల సమావేశాలు సాహిత్యపరంగా చాలా ఆసక్తికరంగా జరిగాయి. దీనికి డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్బు ఎంతో కష్టపడి విజయవంతం చేశారు. పాత మిత్రులను కలవడానికి, కొత్తవారితో పరిచయం చేసికొనడానికి అవకాశం దొరికింది.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       5 అభిప్రాయాలు

విశ్వాంతరాళం: పుస్తక పరిచయం

తెలుగులో శాస్త్రవిజ్ఞాన పుస్తకాల అవసరం ఇంకా ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి చేసిన ప్రయత్నమే రోహిణీప్రసాద్ గారు అంతరిక్షాన్ని గురించి రాసిన “విశ్వాంతరాళం” పుస్తకం.

పూర్తిగా »       5 అభిప్రాయాలు

నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని మధుకేళి వర్ణన

వసంతోత్సవం అనేది ఒక ఉల్లాసకరమైన పండుగ. ఇలాంటిదాన్ని వర్ణించే అవకాశాన్నీ ఏ కవి వదులుకుంటాడు? శ్రీనాధుని వంటి రాసిక్య రాశి అసలే వదులుకోడు.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

రెండు అమెరికన్ రుతాలు

కదలని కెరటాల పాల సముద్రం
ఊరంతా
గాఢమైన యోగ నిద్ర

పూర్తిగా »       3 అభిప్రాయాలు

నాయినమ్మ యిల్లు

తరాలుగా
తడి పీతాంబరాలు మోసి
వొరిగిన దండెం

పూర్తిగా »       4 అభిప్రాయాలు

రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది

మూకుడులో రొట్టె చల్లారిపోయింది
చమురు దీపం మూలన అల్లల్లాడింది

పూర్తిగా »       3 అభిప్రాయాలు

ప్రశ్న

“అమ్మ నీకెందుకు నచ్చింది?
అమాయికంగానే అడిగినట్టూ
అమాంతంగా అడిగేస్తే-

పూర్తిగా »       ఒక అభిప్రాయం

నింగి-నేల

నేలమీంచి చూసే ఆకాశం కన్నా
ఆకాశంలోంచి చూసే నేలే
అందంగా ఉంటుంది

పూర్తిగా »       5 అభిప్రాయాలు

పత్త్రపతనకాలము

వృద్ధమయినట్టి గాత్రంబు విడిచి మఱల
తరుణదేహంబు నెట్లాత్మ దాల్చుచుండు
తరువులట్టులె జీర్ణపత్త్రంబు లుడిగి

పూర్తిగా »       ఒక అభిప్రాయం

కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

మా నాన్నా, మా బాబాయీ ప్రతిఏటా తల్లిదండ్రులకు తద్దినాలు పెడుతూ ఉండేవారు. ఒకసారి తమతో ఉపవాసం ఉండవలసిన పురోహితుడు కర్మకు ముందు రహస్యంగా హోటలుకెళ్ళి తినిరావడం వారి కంటబడిందట.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

కొ.కు ఉత్తరాలు - 1

కొడవటిగంటి కుటుంబరావు

రచయిత ఆర్. సుదర్శనానికి కొ. కు. రాసిన మూడు ఉత్తరాలను మొదటిసారిగా ఈమాట పాఠకులకు ప్రత్యేక కానుకగా ప్రచురిస్తున్నాం.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

కొ.కు ఉత్తరాలు - 2

కొడవటిగంటి కుటుంబరావు

రచయిత ఆర్. సుదర్శనానికి కొ. కు. రాసిన మూడు ఉత్తరాలను మొదటిసారిగా ఈమాట పాఠకులకు ప్రత్యేక కానుకగా ప్రచురిస్తున్నాం.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కొ.కు ఉత్తరాలు - 3

కొడవటిగంటి కుటుంబరావు

రచయిత ఆర్. సుదర్శనానికి కొ. కు. రాసిన మూడు ఉత్తరాలను మొదటిసారిగా ఈమాట పాఠకులకు ప్రత్యేక కానుకగా ప్రచురిస్తున్నాం.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా?

విష్ణుభొట్ల లక్ష్మన్న

సాహిత్య సదస్సులో నేను ఏమిటి మాట్లాడాలి అనుకుంటుండగా “ఆ పాత సాహిత్యంలో ఏముంది మాట్లాడటానికి?” అన్న నా మిత్రుని ప్రశ్న నన్ను నిజంగానే ఆలోచింపచేసింది.

పూర్తిగా »       11 అభిప్రాయాలు

ఐశ్వర్యం – ఓ పరిచయం

కొడవళ్ళ హనుమంతరావు

కుటుంబరావు చాలా రచనల్లో నాకు కొట్టొచ్చినట్లు కనిపించే విషయం – ఆయన పాత్రలు వయసుకి మించి ఎదిగి ఉంటాయని.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

కొ.కు. స్వగతం - బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం విమర్శన

కొడవటిగంటి కుటుంబరావు కథల సంపుటి ‘స్వగతం’ పైన భారతి (జనవరి 1938) పత్రికలో బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం రాసిన విమర్శా వ్యాసం.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

బుర్రా విమర్శకు కొ.కు. సమాధానం

కొడవటిగంటి కుటుంబరావు

కొడవటిగంటి కుటుంబరావు ప్రతివిమర్శ, భారతి పత్రిక, ఫిబ్రవరి 1938.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

భావుకుల రచయిత కొ.కు.

రచయితగా కుటుంబరావుని విశ్లేషిస్తూ రా.రా. 1983లో వ్రాసిన విమర్శాత్మక వ్యాసం.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

తన రచనల గురించి …

కొడవటిగంటి కుటుంబరావు

ఫిబ్రవరి 1953లో ఆలిండియా రేడియోలో పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావుల మధ్య జరిగిన సాహిత్యచర్చాపాఠం ఇది.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

సమాజంలో స్త్రీ స్థానం

మహీధర రామ్మోహనరావుగారు (వారి శతజయంతి కూడా ఈ సంవత్సరమే) కొడవటిగంటి కుటుంబరావు పంచకళ్యాణి నవల గురించి చర్చించిన ఈ వ్యాసాన్ని మీకందిస్తున్నాం.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

ప్రాణాధికం

కొడవటిగంటి కుటుంబరావు

కొడవటిగంటి కుటుంబరావు 1931లో రాసిన మొట్టమొదటి కథ ఇది.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపక స్థానానికి భూరి విరాళం

ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన, పరిశోధనల నిమిత్తం అధ్యాపక పదవి నెలకొల్పడానికై కొప్పాక వారు భూరి విరాళం ఇచ్చారు. మీ వంతు సహాయం మీరూ చేయమని విజ్ఞప్తి.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

“మనలో మనం” సదస్సుకు ఆహ్వానం

“మనలో మనం” వేదిక, మహిళాధ్యయన కేంద్రం, నాగార్జున విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో 2009 నవంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రస్థాయి రచయిత్రుల సదస్సుని ఏర్పాటుచేస్తోంది.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

2009 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు

2009 బ్రౌన్ పురస్కారానికి జెజ్జాల కృష్ణమోహనరావు గారిని, ఇస్మాయిల్ అవార్డుకు వైదేహి శశిధర్ గారిని ఎంపిక చేశారు.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి