ఈమాట » సెప్టెంబర్ 2009

విషయ సూచిక: సెప్టెంబర్ 2009

సెప్టెంబరు 2009 ఈమాటకు స్వాగతం

సెప్టెంబరు 2009 సంచికలో మీకోసం -
శ్రీమతి డీ. కే. పట్టమ్మాళ్ స్మృత్యర్థం గొర్తి బ్రహ్మానందం వ్యాసం కంచి పట్టు కచేరీ; ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది - వేమూరి వెంకటేశ్వర రావు వ్యాసం; శాశ్వత్, వింధ్యవాసిని కన్నడ మూలం నుంచి అనువాదం చేసిన కథ కెంధూళి; పాబ్లో నెరూడా కవితకు తెనుగు సేత ఈ రాత్రి నేను రాయగలను - బొల్లోజు బాబా కవిత.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

తెలుగు నిఘంటువు గురించి…

సర్వ సమగ్రమైన తెలుగు నిఘంటువు ప్రచురించటానికి సుమారు నలభై సంవత్సరాలు పట్టింది. అది ఈరోజు కొనదల్చుకున్నా దొరకదు. మనకి ఉన్న ఈ ఒకే ఒక సమగ్రమైన నిఘంటువు ఈ రోజున మనకు దొరకదు. ఇది హాస్యాస్పదమే కాదు; అవమానకరం కూడాను!

పూర్తిగా »       35 అభిప్రాయాలు

పెదవి దాటనివి

నా కళ్లలో తెలీలేదా? ప్రేమ పాటలన్నీ పనిగట్టుకుని హై వాల్యూమ్ లో పెట్టినప్పుడు వికాస్ మాత్రం కంప్యూటర్లోకి దూరి ఉంటే ఎలా తెలుస్తుంది? నేను తనకేదో చెప్పాలని ఆరాటంగా వస్తే, తను చాట్ విండోలో జోక్ కి నవ్వుకుంటూ నా మాట వినిపించుకోనప్పుడు ఎలా తెలుస్తుంది?

పూర్తిగా »       10 అభిప్రాయాలు

మిగారమాత

స్వర్గ తుల్యమైన సుఖాలు వదులుకుని కట్టుబట్టల్తో సన్యసించాలంటే ఎంతటి మనోధైర్యం కావాలి? తథాగతుడైనాక ఒక్కసారి కూడా ‘నా మాట నమ్ము’ అని అనలేదని వింది.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       2 అభిప్రాయాలు

నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన

బహూశా విశ్వనాథ సత్యనారాయణ రావణాసురుడంతటి వాడు. ఈమాట నేను చులకన భావంతో అనడం లేదు. ఆయన సర్వజ్ఞత, సమర్థతల మీద అపారమైన గౌరవంతో అంటున్నాను. ఆయన ఊహాదృష్టి ప్రసరించని ప్రదేశం ఈ చతుర్దశ భువనాల్లో ఉండి వుండదు. ఆయన ఊహలూ, కల్పనల అపురూపత మరే కవిలోనూ కానరాదు.

పూర్తిగా »       10 అభిప్రాయాలు

వానా వానా…

నేలజేరు చినుకులన్ని వీధులెంట పరుగులెట్టి
వెంటనున్న మబ్బునిప్పి, విడిది చేసె తడవకుండ.

పూర్తిగా »       5 అభిప్రాయాలు

హంస గీతం

బలము కరవై బ్రతుకు బరువై
మోయ జాలని భారమయ్యెను,
దినము గడుచుటె కష్టమాయెను

పూర్తిగా »       2 అభిప్రాయాలు

మరోపువ్వు

సాయంకాలం
గూళ్ళని చేరే పక్షులతోపాటు
నా మనసుకూడా
పాటనుండి క్రమంగా

పూర్తిగా »       4 అభిప్రాయాలు

జమ్మిబంగారం చెట్టు

అంబులపొదిలో అస్త్రాలేవీ
అక్కరకురానట్టే
సమస్యలు బాణాలై సంధిస్తాయి

పూర్తిగా »       15 అభిప్రాయాలు

వానకూడా వింతే!

వానని ప్రేమించడానికి
ఆకుపచ్చని అడవిని ఊహించడానికి
స్థిమితం కావాలి

పూర్తిగా »       5 అభిప్రాయాలు

గుర్రం జాషువా పాపాయి పద్యాలు

విష్ణుభొట్ల లక్ష్మన్న

గుర్రం జాషువా సాహిత్యానికి తగ్గ సంగీతం, సంగీతానికి దీటైన సాహిత్యం రెండూ పోటాపోటీలుగా కలవటం అరుదైన వ…

పూర్తిగా »       12 అభిప్రాయాలు

ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది?

ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? అన్న ప్రశ్నకి సమాధానం, గణితంలో ప్రవేశం ఉన్నవాళ్ళకి కూడా ఇంగ్లీషులో చెప్పటమే చాల కష్టం. గణితంలో ప్రవేశం లేని వారికి ఇంగ్లీషులో చెప్పబూనుకోవటం కష్టతరం. గణితంలో ప్రవేశం లేని వారికి తెలుగులో చెప్పటానికి ప్రయత్నించటం కష్టతమం.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       46 అభిప్రాయాలు

పుష్పవిలాపం - రాగాలతో సల్లాపం

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

అభ్యుదయ కవిత్వం తెలుగువారిని ఉత్తేజపరిచిన 1950లలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారివంటి కవుల రచనలకు ఇంతటి ప్రజాదరణ కలగటానికి ఏకైక కారణం ఘంటసాల స్వరపరచి పాడడమే.

పూర్తిగా »       8 అభిప్రాయాలు

కంచి పట్టు కచేరీ

ప్రతీ రోజూ పట్టమ్మాళ్ ఇంటికి కూరలమ్మే ఒకామె కూతురు పెళ్ళికి పిలిస్తే, పట్టమ్మాళ్ వెళ్ళడమే కాకుండా అక్కడ తన పాటతో పెళ్ళికొచ్చిన పలువురినీ అలరించారట. సంగీతంలోనే కాక ఒక మనిషిగా కూడా ఎంతో ఔన్నత్యం చూపిన వ్యక్తి పట్టమ్మాళ్.

పూర్తిగా »       4 అభిప్రాయాలు

ఈ రాత్రి నేను వ్రాయగలను

ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
తనను నేను ప్రేమించాను. ఒక్కోసారి తనుకూడా నన్ను.

పూర్తిగా »       5 అభిప్రాయాలు

కెంధూళి

వేపచెట్టుకింద తన కైనెటిక్ హోండాను నిలిపి దానికి ఆనుకుని నిలబడి, మేము చేస్తున్న ఆచారాలన్ని చూస్తోందో యువతి. “ఎవరామె?” అని అడిగాను. “ఆమే!…” గుసగుసగా చెప్పింది అక్క.

పూర్తిగా »       2 అభిప్రాయాలు