జూలై 2009 సంచికలో–
నిద్రిత నగరం - వైదేహి శశిధర్ కవితా సంకలనం పై కె. వి. గిరిధరరావు సమీక్ష, వెల్చేరు నారాయణరావు విశ్లేషణాత్మక వ్యాసం: కవిత్వం లో ‘ప్రభావం’ అంటే ఏమిటి?, జెజ్జాల కృష్ణ మోహన రావు స్మృతి పథం: ఫాదర్స్ డే. ఇంకా కథలు, కవితలు, వ్యాసాలు.
విషయ సూచిక: జూలై 2009
జూలై 2009 ఈమాటకు స్వాగతం
అచ్చులో పత్రికలు అంతరిస్తాయా?
మంచి నాణ్యత గల సాహితీ పత్రిక ప్రచురించడానికి లాభాపేక్ష లేని పెద్ద సంస్థల లేదా వ్యక్తుల మద్దతు అవసరం.
పూర్తిగా » 14 అభిప్రాయాలుగోవిందా! గోవిందా!
అప్పుడు అబ్బిగాడు చంటాడు. అకస్మాత్తుగా వాడికి జబ్బుచేసి ప్రాణమ్మీదికి వచ్చినప్పుడు, “స్వామీ! ఆపద మొక్కుల వాడా! బ్రతికి బట్ట కడితే, వీడి పుట్టువెంట్రుకలు నీ సన్నిధిలో తీయిస్తాను” అంటూ జానకి ఆ మొక్కు పెట్టుకుని ఐదేళ్లకు పైనే అయ్యింది.
పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 2 అభిప్రాయాలుపెట్టె బయట
ఇక్కడిదంతా ఒక ఫాషనైపోయింది. ఇన్నేళ్ళుగా పనికొచ్చిన పధ్ధతులేవీ ఇప్పుడు నచ్చవుట. ఇప్పుడు కొత్తగా ఏదో పొడిచెయ్యాలని మా మానేజర్ గాడి ఉద్దేశం.
పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో 4 అభిప్రాయాలుఈ కానుకనివ్వలేను
నేను మాట్లాడినప్పుడల్లా ఆయనకి తన అమెరికా ప్రయాణం, ఎందుకొచ్చాడు అన్నది గుర్తొస్తుందట. వాళ్లబ్బాయిని నేను జాగ్రత్తగా పంపానన్నదీ గుర్తొస్తుందట. అంతే…
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 9 అభిప్రాయాలుపడమట సంధ్యారాగం
ఎయిర్‌మెయిల్ ఉత్తరం. పార్ అవియన్ లోగో. ఎక్కడనుంచి వచ్చిందో సరిగా తెలియటల్లేదు. అరడజను పోస్టల్ ముద్రలున్నాయి. కవరు తెరిచే ఉంది.
పూర్తిగా » 18 అభిప్రాయాలునిద్రిత నగరం వైదేహి ప్రపంచం
కవి ఊహలకు, ఆ ఊహలకు ఊపిరి పోసేందుకు ఎంచుకున్న వర్ణాలను, చిత్రించడానికి ఎన్నుకున్న కుంచెలను చూసేక ఇది ఈ కవయిత్రి మొదటి కవితా సంకలనం అంటే ఆశ్చర్యమేసింది.
పూర్తిగా » 3 అభిప్రాయాలునాకు నచ్చిన పద్యం - నిగమశర్మ అక్క పలకరింపు
ముఖ్యంగా మన తెలుగిండ్లలో ఆడపడుచులకు వుండే స్వతంత్రం చెప్పనలవి గానిది. పెండ్లయి అత్తింటికి పోయినా పుట్టింటి ధ్యాస వుంటూనే వుంటుంది వారికి. అన్నలూ, తమ్ములూ, వారి కాపురాలూ క్షేమంగా వుండాలని కోరుకునేది ఆడబడుచే.
పూర్తిగా » 2 అభిప్రాయాలుహాయిహాయిగా ఆమని సాగే
అయినా పట్టు విడవకుండా ఈ పాటనే సాధన చేసే వాడిని. ఈ పాట తప్ప మరే పాటా పాడకుండా దాదాపు ఒక సంవత్సర కాలం ఈ రాగమాలికే సాధన చేసినట్టు గుర్తు.
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 23 అభిప్రాయాలుకవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి?
మనం ఏ పద్యం చదివినా, విన్నా, అంతకు ముందు కొన్ని పద్యాలు వినే వుంటాం. అప్పుడు మనకి ఒక పద్యం అర్థం అయే తీరు, మనం అంతకు ముందు చదివిన, విన్న పద్యాల మీద ఆధారపడి వుంటుంది.
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 6 అభిప్రాయాలురాగమాలిక
రాగమాలిక అంటే వివిధ రాగాలనీ ఒక దండలా గుది గుచ్చడమన్నమాట. పాటలోని ఒక్కొక్క అంగమూ ఒక్కొక్క రాగంలో స్వరపరిచి రచన భావం, సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే ప్రక్రియే రాగమాలిక.
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 11 అభిప్రాయాలుఫాదర్స్ డే
ఈ రోజు నేను కూడా ఒక తండ్రిని, నా పిల్లలు విదేశీవాతావరణంలో పెరిగిన వాళ్లు. ఫాదర్స్ డే రోజు బహుమతులను లేక విందు భోజనాలను లేక ఫోన్‌లో హర్షాభినందనలను ఇస్తారు.
పూర్తిగా » 4 అభిప్రాయాలుఅంచులలో అందాలు
మన శరీరంలోని కుడి ఎడమ భాగాలు సరాసరి బింబప్రతిబింబాలే. ముఖ్యంగా మన చేతులు ఈ దర్పణ సౌష్ఠవానికి ఒక గొప్ప ఉదాహరణ. కుడి ఎడమయితే వచ్చే పొరపాటు ఇంతింత కాదు!
పూర్తిగా » ఒక అభిప్రాయంఏడు గంటల వార్తలు
పొడుగైన భవంతులలోకి దూసుకొస్తూ ప్రయాణీకుల విమానాలు. పొగ, దుమ్ము, పరిచయమైన అవే ఆకారాల్లో, మబ్బుల్లా దట్టంగా. కిటికీల గుండా మంటలు బైటికి నాలికలు చాస్తూ.
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 2 అభిప్రాయాలుకొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతులు - ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు రిజిష్ట్రేషన్
ఇరవయ్యో శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన సాహితీ మూర్తుల గురించి, వారి సాహిత్యాన్ని గురించి తెలుసుకోవడం, చర్చించడంతో పాటు, తెలుగు సాహితీ మిత్రుల్ని ముఖతః కలుసుకునే అవకాశాన్ని వదులుకోరని ఆశిస్తున్నాం.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండి