ఈమాట » మార్చి 2009

విషయ సూచిక: మార్చి 2009

మార్చి 2009 సంచిక విడుదల

విరోధి నామసంవత్సర శుభాకాంక్షలతో ఈమాట మార్చ్ 2009 సంచికకు స్వాగతం!

ఈమాట సంపాదకులలో ఒకరైన శంకగిరి నారాయణస్వామి (నాసీ) గారు వ్యక్తిగత కారణాల వల్ల ఈమాట సంపాదక బాధ్యతల నుంచి వైదొలిగారు. వారు సంపాదక బృందంలో ఒకరుగా గత సంవత్సరంలో చేసిన కృషికి మా కృతజ్ఞతలు. ప్రత్యక్షంగా కాకపోయినా, ఈమాటకు వారి సహాయ సహకారాలు ఇకముందు కూడా ఉంటాయనే మా నమ్మకం.

- ఈ సంచికలో…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

ప్రపంచ సాహిత్యం - ప్రజాస్వామ్యీకరణం

విజ్ఞానం ప్రజల సొత్తు. ప్రపంచ ప్రజల సొత్తు. సమాజంలో ఏదోరకమైన ఆధిక్యత ఉన్న ప్రత్యేక వర్గాలు ‘ఇదంతా మాది’ అని గుత్తకి తీసుకోవడం అధర్మం, అన్యాయం. ఇవి అందమైన నినాదాలు. విజ్ఞానం అందరికీ అందుబాటులోకి తేవడం అనే కోరిక అద్భుతమైన కోరిక.

పూర్తిగా »       11 అభిప్రాయాలు

శ్రీ ఆంజనేయ రక్షా కవచం

తెల్లారిపోయిందన్న ధైర్యంతొ నెమ్మదిగా లేచివెళ్లి కిటికీ తలుపు తెరిచి తొంగిచూశా. బయటి వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడా రాత్రి తాలూకు భీభత్సం సూచనలేమీ లేవు.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       6 అభిప్రాయాలు

నాకు నచ్చిన పద్యం - వసుచరిత్రలో చంద్రోదయం

ప్రధాన పాత్రలయిన రాజకుమారుని గురించో, రాజకుమార్తె గురించో కొంచెం పొగుడుతారు. రాగాలతో, సరాగాలతో ఆ పాత్ర ఎవరో సభికులకు పరిచయం చేస్తారు. కొద్దిపాటి బూతునూ, సమయానుకూలంగా సంభాషణల్లో చొప్పిస్తారు.

పూర్తిగా »       4 అభిప్రాయాలు

భ్రంశధార

గులక రాళ్ళని తట్టి ఏనాటి ఊసులో తలబోసి
దిగులుపడి వెనుదిరిగిపోతోంది నది
నీటిగాలికి పులకించిపోతోంది నియమగిరి
రెప రెపల రేయింక అలసి నిల్చుంది.

పూర్తిగా »       4 అభిప్రాయాలు

అనంతకవితాకాంచి

జెజ్జాల కృష్ణ మోహన రావు

అనంతకవితాకాంచి ఒక పట్టీపైన రాయబడినది. కాంచి అంటే ఒడ్డాణము. అనంత అంటే అంతులేనిది. అంటే ఇది ఒక అంతులేని కవితా వృత్తము వంటిది.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

నిశ్శబ్దం

మూసుకున్న కనురెప్పల క్రింద
వెలుగుతున్న నీ కళ్ళు నాకు
కనిపించకపోయినా తెలుస్తున్నాయి కావా

పూర్తిగా »       3 అభిప్రాయాలు

బోడి పద్యం

దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం
సంస్కార్ విచ్చిన్నం సంసార స్వప్నక్రీడితం

పూర్తిగా »       43 అభిప్రాయాలు

అతడు, నేను, అతడి కథ

ఈ కథను అర్ధం చేసుకోవాల్సింది నేనే. ఇది మంచి సాహిత్యం కలిగించే అవసరం అనీ, ఇది నాకు నేను చేసుకుంటున్న సహాయం అని తెలుసు నాకు.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       8 అభిప్రాయాలు

నాచన సోమన చతుర వచో విలాసం

నాటకీయత సాధించే మహత్తర ప్రయోజనం పాత్రలని కళ్ళముందు కదిలించడమే కాకుండా సంభాషణల ద్వారా ఆయా పాత్రల స్వభావాలని, అంతరంగాలని ధ్వనింపజెయ్యడం కూడా.

పేజీలు: 1 2 3 4 5      అంతా ఒకే పేజీలో       16 అభిప్రాయాలు

కథ దేని గురించి?

ఆరి సీతారామయ్య

మన కథల్లో ఎక్కువ భాగం సమకాలిక సామాజిక స్థితిగతుల్ని గురించే ఉంటాయి. కానీ, సామాజిక సమస్యల గురించి రాసినవే మంచి కథలు అని నేను అనుకోను.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       23 అభిప్రాయాలు

‘అపు సంసార్ ‘ - సత్యజిత్ రాయ్ సినిమా

విష్ణుభొట్ల లక్ష్మన్న

ఒక రోజు, అపు నిద్ర లేచిన వెంటనే దిళ్ళ మధ్య తల పిన్ను పడి ఉండటం గమనిస్తూ, అంతలో, ఇంట్లో పనులు చేస్తున్న అపర్ణను తదేకంగా చూస్తూ ఉంటాడు.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       6 అభిప్రాయాలు

నన్నెచోడుని క్రౌంచపదము

జెజ్జాల కృష్ణ మోహన రావు

నన్నెచోడుడు ఒక చిన్న సామంత రాజు, కాని కవిరాజులకు రారాజు. పరమేశ్వరారాధకుడు మాత్రమే కాదు, ప్రబంధ పరమేశ్వరుడు కూడ. జాను తెలుగులో వస్తుకవితకు మార్గదర్శి.

పేజీలు: 1 2 3 4      అంతా ఒకే పేజీలో       25 అభిప్రాయాలు

మనకు తెలియని మన త్యాగరాజు - 4

ఇంత వరకూ లభ్యమైన త్యాగరాజ కృతుల్ని స్థాయిని బట్టీ, సాహిత్యాన్ని బట్టీ మూడు వర్గాలుగా విభజించారు. అవి దివ్య నామ సంకీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, ఘనరాగ పనచరత్నాలూ.

పేజీలు: 1 2 3 4 5 6 7      అంతా ఒకే పేజీలో       28 అభిప్రాయాలు

విశ్వగుణాదర్శ కావ్యపరిచయం

ఇది సమాజంలో చాలా పెద్ద మార్పు. ఇలాంటి మార్పు అప్పటి మనుషుల్లో వారి స్థితిని బట్టి, అలజడినో, ఆశనో, ఉత్సాహాన్నో, నిర్వేదాన్నో కలిగిస్తూ వుండి వుండాలి. అలాంటి కాలంలో వేంకటాధ్వరి రాసిన పుస్తకం ఈ విశ్వగుణాదర్శం.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       21 అభిప్రాయాలు

ఈమాట పూర్వాపరాలు - నా జ్ఞాపకాలు I

నా జ్ఞాపకాలను ఇలా నెమరు వేసుకోవడం ఇంటర్నెట్టులో తెలుగు వికాసానికి, ఈమాట పుట్టుకకి సంబంధించిన చారిత్రకాంశాలను — పాక్షికంగానైనా — కొత్తతరం వారికి పరిచయం చేయడానికి ఉపయోగపడుతుందన్న నమ్మకమే ఈ వ్యాస రచనకు పూనిక.

పూర్తిగా »       12 అభిప్రాయాలు

నాల్గవ కాలిఫోర్నియా సాహితీ సదస్సు

తెలుగు సాహిత్యంపై మక్కువతో సరదాగా మొదలెట్టిన సాహితీ సదస్సు ప్రతీయేటా తప్పకుండా చేద్దామన్న స్థాయికొచ్…

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు

గత సంవత్సరం సెప్టెంబరులో మా డిట్రాయిట్ లిటరరీ క్లబ్ పది సంవత్సరాల పండుగ సమావేశాలకొచ్చిన సాహితీ మిత్రులందరికి అభివందనాలు తెలుపుకుంటూ, ఈ సెప్టెంబరులో మళ్ళీ రమ్మని ఆహ్వానిస్తున్నాం.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి