ఈమాట » సంపాదకీయం

Expand to right
Expand to left

సూచిక: సంపాదకీయం

Good Bye.

ఎనిమిదేండ్లకు పైగా ఈమాట ముఖ్యసంపాదకుడిగా శ్రమించిన వేలూరి వేంకటేశ్వర రావుగారు ఈ సంచికతో సంపాదకీయ బాధ్యతలనుండి వైదొలిగారు. వారికి మా హార్దిక కృతజ్ఞతలు. వారు ఇప్పటికీ ఎప్పటికీ ఈమాట కుటుంబ పెద్దలే. వారి మాట మాకు శిరోధార్యమే. - సం.

పూర్తిగా »       9 అభిప్రాయాలు

ఈ సంచిక గురించి…

“మనకంటూ స్వర్ణ యుగం అనేది ఉండేదో లేదో మనకిక ఎప్పుడూ తెలియదు. వేల సంవత్సరాల భారతీయ సంస్కృతి మనది అని గొప్పలు చెప్పుకోడానికి బాగున్నా, మన సంస్కృతి గురించి మనం తెలుసుకోగలిగినది గత ఐదు లేదా ఆరు శతాబ్దాల దాకానే. అంతకు ముందు చరిత్ర అని మనం అనుకుంటున్నది కేవలం మన ఊహాసృష్టి.”

పూర్తిగా »       12 అభిప్రాయాలు

అంబఖండి నుంచి అట్లాంటా దాకా…

నారాయణ రావు రోజుకో కవిత రాసేవాడని చెపితే మీరు నమ్మరు. రాజు, నేను ఆ కవిత చదవటం; ‘చెత్త, చింపెయ్యండి,’ అని అనడం మామూలు. నవ్యకవితలు కాకండా సంప్రదాయ కవిత్వం వల్లించినప్పుడు మాత్రం మాకు చిరాకేసేది; నిజం చెప్పొద్దూ! అవి మనకి అవసరం అని ఆయన ఆ రోజుల్లో అనేవాడు. ఇప్పుడు కదూ తెలిసింది అదెంత నిజమో!

పూర్తిగా »       5 అభిప్రాయాలు

కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012)

వ్యక్తిగతంగానో, ఆయన రచనల ద్వారానో తెలిసినవారికే కాదు, ఈమాటకు మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికీ రోహిణీప్రసాద్ ఆకస్మిక మరణం ఒక పిడుగుపాటు. ఈమాటకు రోహిణీప్రసాద్‌ లేని లోటు ఇంకెవరూ, ఇంకెప్పటికీ పూడ్చలేనిది.

పూర్తిగా »       10 అభిప్రాయాలు

మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి

అమెరికా నించి కృష్ణమూర్తిగారు తిరిగి వచ్చిన తరవాత తెలుగుశాఖ వాళ్ళే ఆయనని తమ శాఖలో కలుపుకుని ఉంటే ఏమయి ఉండేది అన్న ప్రశ్న నన్నెప్పుడూ ఆలోచింపజేస్తూ ఉంటుంది. మొదటిది, పరిశోధనలో అంతర్జాతీయంగా ఒప్పుకున్న ప్రమాణాలు ఆయన తెలుగుశాఖలలో అమలులోకి తెచ్చేవారు.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

చరిత్రాత్మక నవల అంటే?

మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభ కాలం నుండి, ఇప్పటివరకూ, అంటే ఈ నూరు సంవత్సరాలలో ప్రచురించబడ్డ ‘చారిత్రక నవలల’కు లూకాచ్ చెప్పిన లక్షణాలు ఉన్నాయా, లేవా? అనే ప్రశ్నకి సమాధానం వేరే మరొక వ్యాసం మరొకరు రాయవలసి ఉంటుంది. అసలు, లూకాచ్ ఉద్ఘాటించిన లక్షణాలు ఈ కాలపు చారిత్రక నవలలకి ఆపాదించవచ్చా అన్నది మౌలిక మైన ప్రశ్న.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

కొత్త ఏడాదికి కొత్త తీర్మానాలు

కొత్తసంవత్సరం ప్రారంభంలో అనేకమైన తీర్మానాలు చేసుకోవటం ఆనవాయితీ. బరువు తగ్గుదామని, బీడీలు తాగటం మానేస్తానని, బడికో, గుడికో దానధర్మాలు చేస్తాననీ… రకరకాల ప్రతిజ్ఞలు చేసుకోవటం మనకి తెలియని విషయం కాదు. అయితే అది వ్యక్తిగతమని, ఈ మాట పత్రికనీ కొందరు, నవ్వచ్చు; మరికొందరు కామెంటేతర్లు వెటకారం చెయ్యవచ్చు.

పూర్తిగా »       5 అభిప్రాయాలు

మన సంస్థలు - మన సంస్కృతి

నిజం చెప్పాలంటే మన రాజకీయ నాయకులకి మన సంస్కృతి , మన భాష - ఈ రెండూ అవసరం లేదు. చప్పట్ల కోసం చెప్పటం తప్ప, ఈ రెండింటి పైనా ఏ విధమైన గౌరవమూ లేదు. వాళ్ళ లాగానే మన సంస్థలు కూడా ఈ పడికట్టు మాటలు వల్లెవేయడం నేర్చుకున్నాయి. అంతే!

పూర్తిగా »       7 అభిప్రాయాలు

ప్రపంచ సాహిత్యం - ప్రజాస్వామ్యీకరణం: రెండో సారి!

గూగుల్ మొదలుపెట్టిన పథకం ఒక రకంగా మంచి పథకమే. కోట్లకొద్దీ జనానికి మరో ప్రచురణకి నోచుకోని లక్షల కొద్దీ పరిశోధన గ్రంథాలు అందుబాటులోకి వచ్చేవి. రచయితలకి డిజిటల్ పుస్తకాలు ‘అమ్ముడు’ పోవడం మూలంగా డబ్బులొచ్చేవి. కొద్ది రుసుము కట్టుకుంటే గ్రంథాలయాలకి లక్షల గ్రంథాలు అందుబాటులో వుండేవి.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

ఈమాట ప్రచురణలో చిన్న మార్పు

ఈ మధ్య ఒకరిద్దరు రచయితలు, తమ వ్యాసాలను మరింత తరుచుగా ప్రచురించే వీలుంటే బాగుండునని మాతో తమ కోరిక వెలిబుచ్చారు. మాకూ సబబే అనిపించింది.

పూర్తిగా »       4 అభిప్రాయాలు

« పాత సంచికలలో ·