ఈమాట గురించి ఒక మాట
ఈమాట పాఠక లోకానికి స్వాగతం!
1998లో ప్రారంభమై ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు సాహితీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్న తెలుగు ద్వైమాసిక సాహితీ వెబ్ పత్రికకు సుస్వాగతం !!
ఈ webzine మూడు ఆశయాల్తో ప్రారంభించాం.
- మొదటిది భారతదేశం బయట ఉంటున్న తెలుగు వారి జీవన విధానాల్ని,అనుభవాల్ని ప్రతిబింబించే రచనలకి, వాటి రచయతలకి ఒక వేదిక కల్పించటం.
- రెండోది ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండేట్టు చూడటం.
- మూడోది Internet technology ని వీలైనన్ని విధాల ఉపయోగించుకుంటూ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేట్టు చూడటం.
ఇంటర్నెట్టులో తెలుగు భాషకు మొదటి తరగతి పౌరసత్వం కావాలంటే యూనికోడ్ వాడకం తప్పనిసరి అని మా నమ్మకం. అందుకే 2005 మే నుండీ ఈమాటను యూనికోడ్ లో ప్రచురించడం మొదలు పెట్టాము. కానీ కొంత మంది ఇంకా వారి కంప్యూటర్లపై యూనికోడ్ చూడలేక పోతున్నారు కాబట్టి వారి సౌకర్యార్థం ఈ పత్రికలోని రచనలని పీ.డీ.ఎఫ్. రూపంలో కూడ అందజేస్తున్నాము.
ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న ఈమాట ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన సహకారాన్ని కోరుతూ …
- ఈమాట సంపాదక వర్గం.
వేలూరి వేంకటేశ్వర రావు
సురేశ్ కొలిచాల
పద్మ ఇంద్రగంటి
శంఖవరం పాణిని
మాధవ్ మాచవరం
నారాయణస్వామి శంకగిరి
Lakshmanna Vishnubhotla అభిప్రాయం:
May 2, 2006 12:49 pm
ఈమాట మే 2006 సంచిక చదివాను. చాలా అనందపడ్డాను! ఈమాట మెదటి సంచిక నుండి చూపిన వైవిధ్యం, ప్రవాసాంధ్రుల రచనాశక్తిని ప్రోత్సాహపరిచే ఆదర్శం, ఎటువంటి వ్యాపార, రాజకీయ, కుల, మత వర్గాల ఇజాలకు లొంగకుండా, ప్రవాసాంధ్రుల అనుభవాలు, ఆలోచనలు పంచుకునే వేదికగా నిబడి ఉండటం సామాన్యమైన విషయం కాదు! ఇందుకు కారకులైన వారిని అభినందిస్తున్నాను.
ముఖ్యంగా మూడు మాటలు:
1. ప్రవాసాంధ్రులు, ప్రత్యేకంగా అమెరికాలోని తెలుగు వారు, వాసిలోనూ రాసిలోనూ వృత్తి పరంగా మాత్రమే కాకుండా, తెలుగు సాహిత్యపరంగా కూడా గమనించదగ్గ ప్రతిభ కనపరుస్తున్నారనటానికి ఈమాట ఒక నిదర్శనం.
2. ఇంటర్నెట్లో వచ్చిన, వస్తున్న మార్పుల్ని తెలుగు సాహిత్యవికాసానికి (సాహిత్యం అంటే మంచి హితం అన్న అర్ధంలో అయితే తెలుగు ప్రజల వికాసానికి)ఉపయోగించవచ్చు అన్న ఆలోచనలను అమలుచేసి చూపెట్టటం ఈమాట ద్వారా నిరూపించబడింది.
3. ఫిజిక్స్ లో చెప్పినట్లు న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా శక్తిని తయారు చెయ్యటానికి ఒక క్రిటికల్ మాస్ అవసరం. ఇప్పుడు ఈమాట ద్వారా, ప్రవాసాంధ్రుల సంఖ్య క్రిటికల్ మాస్ కి చేరుకోటం వల్ల, ప్రవాసాంధ్రుల శక్తి ఈమాట వల్ల తెలుస్తోంది.
ఇందుకు కారకులైన వారందరికీ ధన్యవాదాలు.
విష్ణుభొట్ల లక్ష్మన్న
Chimata Rajendra prasad అభిప్రాయం:
September 5, 2006 9:09 am
తెలుగు భాషకుసొంతగడ్డ లోనే ఆదరణ తగ్గుతున్నదనిఆవేదనపడే నాలాటి వాళ్ళకు మీ పత్రిక చాలాఉత్సాహాన్నికలిగిస్తోంది.ముఖ్యంగా ఇలా తెలుగులో టైపుచెయ్యడం చాలా థ్రిల్లింగా ఉంది.నా కంప్యూటర్ మీద ఇలా టైపు చెయ్యడానికి ఏం చెయ్యాలో సలహా ఇవ్వగలరా?
rpchimata@yahoo.com
నేను ఖమ్మంలో ఉంటున్నాను.
Sridhar Chirravuri అభిప్రాయం:
October 16, 2006 11:20 am
హల్లొ అండీ!
సాహితీ లోకానికి మీరు చేస్తున్న కృషి కి ఒక సలామ్! మీ కలానికి ఒక సలామాలేకుం! మీ వ్యాసాలు, శీర్షికలు అదుర్స్ ! కొత్త పాఠకుడిని, నా అభినందనలు!
శ్రీధర్
chandu అభిప్రాయం:
November 3, 2006 6:33 am
రాజెంద్రప్రసాద్ గారూ
మీరు Lekhini ఉపయోగించి తెలుగులో వ్రాయవచ్చు.
http://www.lekhini.org
Ram అభిప్రాయం:
November 20, 2006 2:03 pm
తెలుగు భాషాభిమానులు నానాటికి తగ్గుముఖము పట్టడము చాలా బాధాకరమైన విషయము. అటువంటి తరుణములో మీరు చెస్తున్న కృషి ప్రశంసనీయము.
rajay అభిప్రాయం:
February 10, 2007 9:12 pm
All..
Yes its a really appreciable effort by the team
Keep the ball rolling great.
regards.
rajay
http://www.tirumala-hills.blogspot.com/
శివరాం అభిప్రాయం:
April 21, 2007 4:58 pm
మీరు చేస్తున ఈ ప్రయత్నాకి మా జోహరులు
Rohiniprasad అభిప్రాయం:
May 4, 2007 8:08 am
కొత్త ఫీచర్స్ పత్రికలోని రచనల వైవిధ్యాన్ని పెంచుతాయనడంలో సందేహం లేదు. జమ్మి వారి వ్యాసం చదవగానే కొందరు పాఠకులు గొంతు విప్పి అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం ఆనందదాయకం. ‘కొత్త’ అనేది ‘చెత్త’ కానంతవరకూ అభిలషణీయమే అనుకుంటాను.
ఒక ఉదాహరణ చెపుతాను. నా దగ్గిరున్న 50 ఏళ్ళ నాటి “కినిమా” సంచికల్లో ఆనాటి సినీ టెక్నాలజీ గురించిన వ్యాసాలు ప్రచురించడం చూశాను. నిరంతరమూ సినిమా భజన చేసే కోట్లాది తెలుగువారికి ఈ ఆధునిక యుగంలో ఇటువంటి టెక్నాలజీ పట్ల ఏమాత్రం ఆసక్తి ఉందో తెలియదు.
ఇలాంటి కొత్త విషయాల గురించి రాయగలిగినవారి సహాయం పొందితే ఈమాటవంటి పత్రికకు ఎంతో లాభమే. దీన్ని గురించి సంపాదకవర్గం అభిప్రాయాలు ఎటువంటివో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. (సినీ డైరెక్షన్లో తర్ఫీదు పొందుతున్న ఒక తెలుగు యువతి అట్లాంటాలో నివసిస్తోంది. ఆమెను సంప్రదించడం సంపాదకులకు సాధ్యమే)
kalidas అభిప్రాయం:
July 4, 2007 1:44 pm
మీ తెలుగు కీబోర్డు మ్యాపింగ్ java script ని పంచుతారా?
I can integrate them in our web services to support Telugu.
Please see zoho.com for details. We have word,excel and power point on zoho. I like your on screen key board mapping better than telugu font installation.
You can use http://zohowriter.com to edit , share documents with your prospective authors. This whole process of article submission, editing , changes can be automated if you use zohowriter. It is a online word with sharing functionality. You can give read/ write permissions to the editior(s) etc. It also has versioning.
We already have UTF support. We can re use your key board script to provide support for telugu in writer and email clients.
Seshu Medepalli అభిప్రాయం:
September 6, 2007 3:53 am
ఈమాట సంపాదకులకు,
ఇంతకాలంగా ఇంటర్నెట్ చూస్తున్నా ‘ఈమాట’ వెబ్ పత్రికను ఎప్పుడూ గమనించలేదు. అల్లసాని పెద్దన, అన్నమాచార్య మరెవరైనా సరే ఇప్పుడుండి ఉంటే మీ కృషికి జోహారులర్పించటమే కాదు, ఆ గండపెండేరాలు, ఆ సువర్ణమణిమయ భూషణాలు అన్నీ మీకు తొడిగి ఉండేవారు - మన తెలుగును ఈ విధంగా బ్రతికిస్తున్నందుకు. ఆంధ్రభాష మనుగడ పుట్టినగడ్డలో ప్రశ్నార్ధకంగా మారినా, మెట్టనగడ్డలో్ ఈ విధంగా మెరుగులీనుతున్నందుకు ఏ తెలుగు హృదయం మాత్రం పులకించదు? - మేడేపల్లి శేషు, న్యూఢిల్లీ.
Kompella Sarma అభిప్రాయం:
September 17, 2007 7:28 am
ఈ మాట సంపాదక వర్గానికి యింత అద్భుతమైన తెలుగు సాహిత్య, సాంస్కృతిక పత్రికను నిర్వహిస్తున్నందులకు మన:పూర్వక ధన్యవాదములు. ప్రాచీన సాహిత్యపు రూపురేఖలను గమనిస్తుంటే ఆనాటి ప్రబంధయుగం నుంచి ఆయా ఛాయలు కానవస్తున్నాయి.
నేను తెలుగు సాహిత్యంలో ఎదో కొంచెం రచనలు చేస్తూంటాను. మన మహానుభావులు అన్న శీర్షికతో www.telugujournal.com అన్న పత్రికలో రచనలు చేయడం జరుగుతూంది. మునుము తమిళనాడు ఈనాడు తెలుగు దినపత్రికలో సాంస్కతికపరమైన వ్యాసాలను, కార్యక్రమాలకు విశ్లేషణలను వ్రాయడం జరిగింది.
పై అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, మీ ప్రముఖ పత్రికలో రచనలను వ్రాసేందుకు అనుమతి యివ్వమన్న నా ప్రార్ధనను అంగీకరిస్తారనే ఆశతో,
కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ ( కొంపెల్ల శర్మ )
as అభిప్రాయం:
December 11, 2007 8:07 am
ఈ సైట్ చాలా బాగుంది
Venkata Subbaiah అభిప్రాయం:
February 3, 2008 11:17 pm
తెలుగు భాషను తరతరాలకు ప్రవహించేలా
తెలుగు తియ్యదనాన్ని ఎప్పటకి రుచించేలా
ఈ మాట (మన తెలుగు మాట) వెబ్ పత్రిక ను తప్పనిసరిగా ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి ఉపయూగించుకుని రాబోయే తరాలకు మన అమ్మభాష మట్లాడటము లోని ఆప్యాయతని అందించాలని మనసారా కోరుతూ
సంపాదకులకు మరొక్కసారి నా అభినందనలు తెలియచేస్తున్నాను.
కపిలవాయి వెంకటసుబ్బయ్య
విజయవాడ
aswartha అభిప్రాయం:
March 6, 2008 1:12 am
ముందుగా ధన్యవాదములు.
మీ తెలుగు అభిమానానికి, తెలుగు అభిమానులకి
మన అమ్మభాష భాషను మనసారా కౌగిలించుకున్నందుకు
అమ్మతొ మాట్లాడుతున్నందుకు!
radheshyam అభిప్రాయం:
April 6, 2008 7:51 am
సంపాదకులకు,
ఎన్నాళ్ళనుంచో వెదుకుతున్న మంచి తెలుగు వెబ్ పేజ్ ఇన్నాళ్ళకు దొరికింది. తెలుగులో టైప్ చెయ్యాలన్న కోరిక కూడా తీరింది.
చందమామ కోసం సెర్చ్ చేస్తున్న నాకు “ఈమాట” సైట్ కనిపించింది. కొడవడిగంటి కుటుంబరావు గారి అబ్బాయి వ్రాసిన ” చందమామ జ్ఞాపకాలు” చదివాను. చాలా బాగుంది. అక్కడ మొదలుపెట్టి మిగిలిన articles అన్నీ చదువుతూ ఎంతసేపు గడిపానో తెలియలేదు. మీ కృషికి నిజంగా జోహార్లు. ఇన్నాళ్ళనుంచి చాలా మిస్సయ్యను అనిపించింది.
ఇకపై “ఈమాట” కుటుంబంలో నేనూ చేరుతున్నందుకు ఆనందంగా వుంది.
చిన్న విన్నపం…చందమామ లో సీరియల్ గా వచ్చిన తోకచుక్క మొదలెన నవలలు ఎవరి దగ్గరైనా వుంటే అప్ లోడ్ చేయగలరు. లేదా ఎక్కడైనా దొరుకుతుందేమో ఎవరికైనా తెలిస్తే దయచేసి తెలుపగలరు.
_ రాధేశ్యామ్ రుద్రావఝల, విశాఖపట్నం.
Jagannatha Rao అభిప్రాయం:
May 9, 2008 8:10 pm
మీ వెబ్ సైట్ చూశాను. చాలా బావుంది. నేను తెలుగు, కన్నడ కథల పైన తులనాత్మక పరిశీలన చేస్తున్నాను. నేను నాదగ్గర ఉన్న కథల్ని పంచుకుంటాను. ఎవరిదగ్గరయినా ఐ వి. ఎస్ అచ్యుతవల్లి గారి “సన్నాట” కథ ఉంటే పంపించమని మనవి. నాదగ్గర ఐలీపు సాఫ్ట్ వేరు ఉంది.
నమస్తే, జగన్నాథ రావు.
baabjeelu అభిప్రాయం:
July 12, 2008 10:19 am
సంపాదకులకి,
మీ పత్రిక “నిజ్జెంగా” చాలాబావుంది.
నా చిన్నప్పటి, పురాణం వారి “ఆంధ్రజ్యోతి” కన్నా.
రోహిణీప్రసాదు గారి లాటి వ్యాసకర్తలు, కృష్ణమోహన్ గారిలాటి సాహిత్యాభిలాషులు, రవికిరణ్ లాటి వర్ధమాన కవులూ, వీళ్ళందర్నీ చదివి తరించే నాలాటి పాఠకులూ మీకున్నారు. ఇంకా చాలా మంది వున్నారు, వాళ్ళని పేర్కొనలేదని అనవసర చర్చలోకి దిగొద్దని మన పాఠకులికి మనవి.
అయితే మీకున్న వనరులతో మీరు చేయగలిగిన గొప్ప పనులు ఇంకా వున్నాయి. అవి:
రోహిణీప్రసాదు గార్ని బాలమురళీ జీవితచరిత్ర రాయడానికి “కమిషన్ ” చెయ్యొచ్చు.
ఆయనయితే బాలమురళీ జీవిత చరిత్ర తో, డెభ్భయ్యేళ్ళ లేక ఎనభయ్యేళ్ళ తెలుగు సంగీత చరిత్ర రాయగలరు. నిస్సందేహంగా. మిగిలిన వాళ్ళు భజన మండలి సభ్యులు.
బాబ్బాబు, మీ పత్రిక “రన్ ఆఫ్ ది మిల్” పత్రిక కాదు కదా?
అలాగే, బాపురమణల జీవిత చరిత్ర కూడా?
రోహిణీప్రసాదు గారే రాసెయ్యగలిగితే అదృష్టం. లేకపోతే వెదుకుదాం.
కానీ, మీ పత్రిక మొదట్లో “ప్రవాసాంధ్రులకే” అయుండొచ్చు, కానీ ఇప్పుడు ఆంధ్రులందరికీ అయిందనుకుంటున్నాను.
“సరస్పతి తోడు” మీ పత్రిక చక్కగా వుంటోంది.
ఇలా నడిపితే చాల్చాలు.
ఇంతకన్నా బాగ నడిపితే మా అదృష్టం.
baabjeelu అభిప్రాయం:
July 24, 2008 7:19 pm
కాలంతోపాటూ పరుగెత్తడవంటే వుదాహరణ “ఈ మాట”.
టెక్నాలజీ ని మనక్కావల్సినట్టు వాడుకోడానికి కూడా వుదాహరణ “ఈ మాట”
మామూలు పత్రికలో ఒక వుపన్యాసం చదువుతాం, ఇక్కడ వింటాం.
మామూలు పత్రికలో ఒక పాట పాఠం చదువుతాం, ఇక్కడ పాట వింటాం.
మామూలు పత్రికకి అభిప్రాయం సాధారణంగా ఇలావుంటుంది:
“ఎడిటర్జీ, ఇలియానా ముఖచిత్రంతో మీ(మా) పత్రిక సర్వాంగసుందరంగా వుంది.
సాయి బ్రహ్మానందం గారి మనోవైజ్ఞానిక సీరియల్ మా ఇంటిల్లిపాదినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. లక్ష్మన్న గారి కవిత మమ్మల్నందరినీ అలోచింపచేసింది. రోహిణీప్రసాదుగారి కార్టూనులు మమ్మల్ని కడుపుబ్బ నవ్వించేయి.
కొడవళ్ళ వారి వ్యాసం ఆవునేతితో అరటికాయ బజ్జీలు అద్భుతం…”
ఈ మాట లో అలాటి ముసుగులో గుద్దులాటల్లేవు.
పాఠకుల “పార్టిసిపేషన్” వల్ల, అదికూడా అతి సులువుగా, పత్రిక ఇంకా “లైవ్లీ” గా వుండడానికి ఆస్కారం ఏర్పడింది.
పాత సంచికలలో ని శీర్షికలు కూడా ప్రస్తుతం అభిప్రాయ వేదికలోకి రాగలగడం, మళ్ళీ దానిమీద అభిప్రాయాలూ నిజంగానే వింత.
పాఠకుల అభిప్రాయాలు విమర్శలు కావు. విమర్శలని పట్టించుకోవాలి అవి రచయత బాగుపడ్డానికి పనికొస్తే, లేకపోతే “వోటర్ల” లిస్ట్ లోంచీ తీసెయాలి ఆ విమర్శని. అభిప్రాయాల్ని మామూలు పాఠకులు రాసినవి గానే తీసుకోవాలి. అంతేగానీ, “..తాడి ఎత్తు గాండీవము తో ముత్తాడి ఎత్తుగా ఎదిగి, చండకోపముతొ..” “సెట్ పట్” లాడించకూడదు.
(సాక్షి దినపత్రికలో,జూలై 21న, చేరా తో మొదలెట్టి కొంతమంది విమర్శకులు తమతమ అభిప్రాయాలు రాసేరు)
“చూపుల కన్నా ఎదురుచూపులే తీయన..”. ఒప్పుకుంటాం.
ద్వై మాసిక ఎదురుచూపులు చూడ్డం చాలా కష్టమయిపోతోంది. ఆదివిష్ణుగారి స్నేహితులు “ఆషాఢ మాసం” ఎన్ని నెలలుంటుంది అని అడిగినట్టు.
కనీసం “వీక్లీ” కూడా అవదా?
mOhana అభిప్రాయం:
August 21, 2008 7:52 am
నమస్తే /\
ముందంతా ఈమాట అంటే రెండు నెలలకోసారి కొత్త వ్యాసాలను,
కవితలను, కథలను ఒక నాలుగు రోజులు చదవడం, అప్పుడప్పుడు
వీలున్నప్పుడు పాత సంచికలను చదవడం వాడుకగా ఉండేది.
మరి ఇప్పుడో, అదెవరో గాని (వారికి భగవంతుడు నూరు సంవత్సరాల
ఆయుస్సును ప్రసాదిస్తాడు తప్పక) శ్రీ(మతి) బాబ్జీలుగారి ధర్మమా
అని ప్రతిరోజూ ఒక్కమారైనా ఈమాటను అభిప్రాయాలకోసం
చూడాలనే ఆకాంక్ష కలుగుతూ ఉంది. వారి అభిప్రాయాల
ముత్యాలను ఏ వ్యాసుడైనా ఒక వ్యాస హారంగా నిర్మిస్తే ఎంత
బాగుంటుందో?
- మోహన
baabjeelu అభిప్రాయం:
August 21, 2008 9:50 am
క్రుష్ణమోహను గారూ,
మిమ్మల్నీ, భైరవభట్ల కామేశ్వర రావు గారినీ, రోహిణీప్రసాదు గారినీ, వైదేహీ శశిధర్ గారినీ, పామర్తి వారినీ, రవికిరణ్ గారినీ, మురళి గారినీ, మూలా సుబ్రహ్మణ్యం గారినీ, లక్ష్మన్న గారినీ మీ అందర్నీ మించి ఉదయకళ గారినీ, వగైరాలతో పోలిస్తే మీ పక్కన నిలబడ గలిగే అర్హత లేదు నాకు. అది నాకు తెలుసు. ఎందుకంటే, ఈ అభిప్రాయాలు రాయకముందు “నథింగ్ టు రైట్ అబౌట్”.
కావాలని మారు పేరుతో అభిప్రాయాల్ని రాయటం లేదు.
2006లో ఈమాట ని మావగాడు పరిచయం చేసినా పట్టించుకోలేదు. అది నా దురద్రుష్టం. ఈ ఏడాది మళ్ళీ న్యూయార్క్ నుంచి వచ్చి తిట్లుతిట్టి “మీ అభిప్రాయం తెలిచేయండి” ని చూపించేడు, మావ గాడు. వున్న వ్యసనాలని మించి ఈమాట చదవడం, అభిప్రాయాలు రాయడం వ్యసనవైపోయింది.
నా ప్రవర చెప్పమని “జయప్రభ” గారన్నారు. ఇదీ వరస.
నా మట్టుకి నేను, నా గురించి “సహస్ర శిరఛ్చేద అపూర్వ చింతామణి” లో దొంగ సన్యాసిననీ, “ఆషాఢభూతి” గురువుగారిననీ, “మందుల భీముడి” మేనల్లుడిననీ, “ముంగేరీలాల్ కె హసీన్ సప్నే” లోని రఘువీర్ యాదవ్ ననీ, “బైరాగినా, అసిరిగాడినా” అన్న సందిగ్ధంలో వున్నవాడిననీ, “సింహాచలాన్నా,అడ్డబుర్రనా” అన్నఅనుమానంలో వున్నవాడిననీ ఖచ్చితంగా నమ్ముతున్నవాడిని. “ధర్మవ్యాధుడిలా” బతకాలని తెలిసికూడా అదెలాగో తెలియనివాణ్ణని అనుకుంటున్నాను.
“రాయని భాస్కరుణ్ణని” మొదట తెగ ఫీలయిపోయీవాడిని.ఎందుకంటే “క్రుశా” గురించి శ్రీశ్రీ అలా అన్నాడు కాబట్టి. తరవాత తెలిసింది రాయడం “చేతకాని” భాస్కరుణ్ణని.
నా పేరు భాస్కర్. సివిల్ ఇంజినీర్ని, మూడేళ్ళయి హైద్రాబాదులో వుంటున్నను. అంతకుముందు, దేశం అంతా తిరిగేను. బొంబాయిలో పదకొండేళ్ళు వున్నాను. చదవడం ఎంత వ్యసనం అంటే, బొంబాయి లోకల్ ట్రైన్లో కూడా, క్రిక్కిరిసిన జనం మధ్య కూడా నిలబడి చదివీ వాడిని. ఇది నా “స్ట్రెంగ్త్” అని నా అనుమానం.
ఈ మాట “ఫార్మాట్” లో వున్న సులువువల్ల తెగించి అభిప్రాయాలు రాసేస్తున్నాను, అంతే.
ధర్మవ్యాధుడిలాటి కొడవళ్ళ హనుమంతరావు గారిని, మీ అందరితో పాటూ స్మరించకపోవడం నా తప్పు.
jayaprabha అభిప్రాయం:
August 21, 2008 9:18 pm
శ్రీశ్రీ బాబ్జీలు మహాశయ..
మీరు బాబ్జీలు గానే రాయండి. భాస్కర్ అని ఈమాట పాఠకులని మరిచిపోనివ్వండి.
ఇహ అభిప్రాయాలలోని స్పష్టత ముఖ్యం, ఎలాంటి విషయం మీద రాసినా. అది మీలో పుష్కలంగా వుంది. ఇంక మీరు రాయని భాస్కరుడు అన్నది కేవలం pun కోసం మాత్రమే. మీ ప్రవర చెప్పారు. అహంభో అభివాదయేత్ అనీను అనీసేరు. అందరికీ ఇవ్వాల్సిన బిరుదులు కూడా ఇచ్చేసేరు. చలం భాషలో చెప్పాలంటే “మర్యాదస్తులైపోయేరు”.
వికటం కూడా ఒక సుగుణం. మొహమాట పడకుండా అభిప్రాయాల్ని చెప్పగలగటానికి అది ఒక తరహా తోవ. శ్రీశ్రీలో కూడా బాగా వున్న లక్షణం అది. కించిత్ పొగరు, కాస్తా తిక్క ధిషాణ … అన్నీ వున్నవాడు ఆయన. నేను వికటకవి అవతారమని మిమ్మల్ని అన్నప్పుడు ఇవన్నీ కలుపుకొనే అన్నాను.
నేను ఈమాట ను చూడటం మొదలు పెట్టింది ఇటీవలే. ముందు చదవటం చేసాను. ఎందుకంటే mainstream పేపర్ల సాహిత్యప్పేజీలు విసుగొచ్చి వాటిని చదవటం మానేసాను. వాటిలో సాహిత్యం కన్నా మిగితావి ఎక్కువ అయిపోతుండటం విషాదం.
నాకు కంప్యూటర్ మీద రాయటం ఇంకా సరిగ్గా రాకపోయినా మీ కామెంట్లకి మురిసి ఈమాటలో అభిప్రాయాలు చదవటం, రాయటం మొదలు పెట్టాను. నాకు “వులిపికట్టె”ల మీద కాస్త నమ్మకం ఎక్కువ. అంతే సుమా.
ఇహపోతే, మరోవిషయం. పైటల్ని, చున్నీల్ని తగలపెట్టేయటం లాంటి వాక్యాలతో నన్ను provoke చెయ్యాలని చూసారు. కానీ, మీరు చెప్పినట్టే, మా “చత్రిబాబు” చెప్పినట్టే గొప్పదనం అక్షరంలో వుంటే దాన్ని ఎవరు ఏమన్నా నిలబడుతుంది. ఆ గుణం అందులో లేదా గాలికెగిరి పోతుంది కదా. నాను సెప్పేది అదే!
మీరు బాబ్జీలు గానే రాయండి. మీ వికటత్వాన్ని నిలుపుకోండి.
మీరు హైదరాబాద్ అని అన్నారు. రోడ్డు మీద ఎక్కడన్నా నేను కనిపిస్తే ‘చెప్పకపోతే “ఆయమ్మొప్పుకోదు”‘ అనుకొని ఒక “హల్లో” పడేయండి.
జయప్రభ.
baabjeelu అభిప్రాయం:
September 21, 2008 8:04 am
బాబూ,
ఈయేలే, ఓ పత్రిక లో యండమూరి, మల్లాది ల జమిలి ఇంటర్వ్యూ చదివేను. సాన్నాళ్ళకి వీలు దొరికి. ఆళ్ళిద్దరూ, గొప్ప రచయతలు కారో, అవునో చివరాకరికి తేలుద్ది. వొగ్గేయండి, దానికోసం మాటాడుకోడం దండగ. కానీ ఒహటి తేలిపోనాది. ఆళ్ళకున్న ఇబ్బందులు, “ఈ మాట” లో రాసీవోళ్ళకి లేవు. లేవు గాక లేవు. ఆళ్ళకేగాదు, ఆళ్ళముందోళ్ళకీ, తరవాతోళ్ళకీ కూడా.
కడుపెంత తా కుడుచు కుడుపెంత? దీనికై పడని పాట్లనెల్ల పడిదొరలనేల?
అందుకే “ఈ మాట” లో మనందరం “సాహిత్య సేవ” పేరిట చేసీది ఎంతవరకూ రైటు? మనందరం అని నన్ను కూడా కలిపీసుకున్నందుకు, చెమించాల. చివరాకరికి, “స్టేంపులు” అంటించినప్పుడు, అయి నాలుక్కంటుకుపోయి, చేతికి రాకపోయీ బాధకూడాలేదు. “నైన్ టూ ఫైవ్” ఎడ్మెంట్ లో సదాశివ్ అమ్రాపుర్కార్ బాధలా.
మనద్రుష్టం, మనద్రుష్టవేనా?(మనదృష్టం, మనదృష్టవేనా?)
మనం “సాహిత్య సేవ” సేస్తన్నావాఁ? “ఆళ్ళకీ మా అందరికీ ఏటివోయ్ సంబందం?” అంటారా. “మావాళ్ళలాటోళ్ళవిఁ కావంటారా?” ఎందుకు లేదో? ఎందుకు కాదో? తేల్చీవోళ్ళెవరు?
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
September 22, 2008 7:56 pm
బాబ్జీలు గారూ,
మీరేమడుగుతున్నారో నాకు బొత్తిగా అర్థమవలేదు. సందర్భం ఏమిటో గూడా తెలియలేదు. “నైన్ టూ ఫైవ్” ఎడ్మెంట్ లో సదాశివ్ అమ్రాపుర్కార్ బాధలా - అంటే ఏమిటో అసలే తెలియదు. ఇంటర్నెట్ లో వెతికితే అమ్రాపుర్కార్ సినిమా మనిషని తెలిసింది. సంబంధం అగమ్యగోచరం.
మిగిలిన రచయితలకుండి ఈమాట రచయితలకి లేని ఇబ్బందులేమిటి? పొట్టపోషణకి సంబంధించినదా? వెంటనే సాహిత్య సేవ ని తెచ్చారు. నాకయోమయంగా ఉంది. క్షమించండి. కాస్త విపులీకరిస్తే సంతోషిస్తాను.
కొడవళ్ళ హనుమంతరావు
Rohiniprasad అభిప్రాయం:
September 22, 2008 8:44 pm
బాబ్జీలుగారు అడిగిన ప్రశ్న సబబే. సంగీతమైనా, సాహిత్యమైనా, సినిమాలైనా వాటి గురించి కామెంట్లు చేసే ఒక మేధావి (?) వర్గం ఎప్పుడూ ఉంటుంది. ఇది ఒకరకంగా arm chair criticism. ‘వేళ్ళకు మట్టి అంటుకోకుండా’ వెలిబుచ్చే అభిప్రాయాలు ఎటువంటివైనా వాటికి ground realities తో సంబంధం లేకపోవచ్చు (కొన్ని సందర్భాల్లో). ఉదాహరణకు ఫలానా సినిమా, లేదా పాట గురించి చేసే కామెంట్లు in isolation అనిపించవచ్చు. సినిమా తీసిన దశాబ్దాల అనంతరం కూడా వాటి మంచిచెడ్డల గురించి చెప్పుకోవడం పరిపాటి. అప్పటి దర్శకులూ, సంగీత దర్శకులూ, నటులూ ఎటువంటి సమకాలీన సమస్యలకు లోనయారో ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు. అయినా మన విమర్శ కటువుగానే ఉంటుంది. రచయితల్లో ‘కూటి కోసం’ పాకులాడేవాళ్ళు తక్కువే కనక వారి గురించిన ప్రతి విమర్శా కర్కశంగానే ఉంటుంది.
అయితే ఈ పడక్కుర్చీ విమర్శకుల విలువ చాలా ఎక్కువ. ఇదొక రకమైన informed (?) public opinion. అంచేత ఇది సాహిత్య సేవా అనడిగితే అవుననే చెప్పాలి. అందులో కాస్త ఎక్కువతక్కువలుండచ్చుగాక.
baabjeelu అభిప్రాయం:
September 23, 2008 9:12 am
రోహిణీ ప్రసాద్ గారికి,
పాలూ నీళ్ళూ వేరు చేసీసేరు. ఖచ్చితంగా చెప్పేరు.
అయితే, పడక్కుర్చీ విమర్శకుల విలువ, informed (?) public opinion, సాహిత్య సేవ, ఎక్కువ తక్కువలయినా, ఎలాగో విపులీకరించి విశ్లేషించాలి దయచేసి.
కొడవళ్ళ హనుమంతరావు గారికి,
“ఎడ్మెంటు” సంగతి వదిలెయ్యండి. అది మీరెవరూ చూసే చాన్సు లేదు.మీకు చికాకు కలిగించినట్టు రాయడం నా చేతకాని తనం. “శ్రధ్ధ” “సబూరి” లేకపోతే ఇన్ని ఇబ్బందులు.మొదటి సారి రాసినపుడు, సరిగ్గా రాయలేకపోడానికి, కర్ణుడి చావుకున్న కారణాల్లా లక్షాతొంభైయున్నాయి. వాటినొదిలెయ్యండి.
క్షమించాలి.
రోహిణీ ప్రసాదు గారు సరిగ్గా పట్టీసేరు. అదే నా “ప్రెశ్న”?
ఖానా గట్టు మీద బీడీలు కాల్చుకుంటూ “ప్రెపెంచకాన్ని” గుప్పు గుప్పు మని విమర్శంచడం రైటేనా? ఖానా గట్ల గురించి, సందేహం వుంటే, భైరవభట్ల వారు పూర్తిగా తీర్చగలరు. బీడీల గురించి సందేహంవుంటే, నాలాటి వాడెవడైనా తీర్చగలడని అనుకుంటున్నాను.సాఫ్ సాఫ్ గా అడుగుతున్నాను. ఎవరైనా ఎందుకు రాయాలి? ఎందుకు రాస్తారు?
రజనీ గారడిగిన ప్రశ్నకి చలం గారు సమాధానమిస్తూAIR ఇంటర్వ్యూలో:
“నన్ను, నాలో ఏఏ మచ్చలున్నాయో, వాటిని నేను గట్టిగా తిట్టుకోడంతో, వాటిని గట్టిగా గోక్కోడంలో, ఆ పుస్తకాలు-నేను వ్రాసిన పుస్తకాలన్నీ బయలుదేరాయి. అవి మిమ్మల్ని అనుకుని మీరు చాలా కోప్పడ్డారు. మిమ్మల్ని కాదు- నన్ను నేను తిట్టు కున్నది.”
ఇందుకేనా రాస్తారు? ఇందుకేనా రాయాలి? ఇలా రాయకపోతే విమర్శకులు “కోర్ కోర్ శరణు కోర్” అని గగ్గోలెట్టడం రైటేనా? అలా గగ్గోలెట్టకపోతే తప్పా?
ఈ మాట రచయిత(త్రు)లకీ, అభిప్రాయాలు రాసీవాళ్ళకీ వున్న సుఖం మిగిలిన పత్రికలకి రాసీ వాళ్ళకి లేదు. మా బతుకులు మేం బతుకుతూ, తీరికున్నపుడు “బాగా రాసేరు” అని అభిప్రాయమ్ముక్క పడేస్తే ఈ మాట వాళ్ళు, చక్కగా వేస్తారు. కొంపదీసి ఇదా సాహిత్య సేవ?
Rohiniprasad అభిప్రాయం:
September 23, 2008 6:24 pm
నా మునుపటి కామెంటులో ఈ కింది వాక్యం పొరపాటున ఎగిరిపోయింది. క్షమించాలి:
‘ఈమాటలో రాస్తున్నవారూ, కామెంట్లు చేస్తున్నవారూ ఎక్కువగా తెలుగు మీది అభిమానంతో రాస్తున్నవారే’.
essemCHELLURI అభిప్రాయం:
September 26, 2008 9:19 pm
మీ పత్రిక పదిమందికి ఉపయోగపడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
October 1, 2008 10:32 pm
బాబ్జీలు గారికి,
పల్లెటూరి నుండి వచ్చిన వాణ్ణి కాబట్టి బీడీల గురించి సందేహాలేం లేవు; ఖానా గట్టు గురించి ఉన్నాయి. మీ రాతల్లో నిగూఢంగా ఉన్న పద సంపద చెప్పుకోదగ్గది; మూడు నిఘంటువుల్లో వెతికినా “సబూరి” కనపడలేదు!
(2005 లో పదవీ స్వీకారం సందర్భంగా, ఆవుల మంజులత గారు అకుంఠిత దీక్షతో కృషి చేసి అయిదేళ్ళలో సమగ్ర నిఘంటువుని తయారుచేస్తామని హామీ ఇచ్చారు. పదవీ విరమణ సమయంలో దాని గురించి ఎవరైనా అడిగారా? ప్రభుత్వరంగంలో పలుకుబడి గల వాళ్ళెవరైనా కనుక్కుని వివరాలు తెలపమని మనవి.)
చలం ఇంటర్వ్యూ వినలేదు కాని మ్యూజింగ్స్ (పేజీలు 68-74) చదివాను. అది చదివితే మామూలు వాళ్ళకి ఇక రాయాలంటే భయం! ఆయన మహానుభావుడని ఒప్పుకోవాల్సిందే - ఆఖర్న అష్టగ్రహ కూటాల్ని నమ్మి ఆముష్మిక చింతనలో మునిగినా.
తనని తాను తిట్టుకోడానికి మాత్రమే అయితే చలం పుస్తకాలు రాసి ప్రపంచం మీద వదిలి నానా దుమారం లేపాల్సిన అవసరం లేదు కదా! బీడిలు కాల్చేవాడు కాదు గాని ఎప్పుడూ నోట్లో పైపుతో కనబడే ఒకాయన అరవై ఏళ్ళ క్రితం మాటల్లో :
“Thus, the author writes in order to address himself to the freedom of readers, and he requires it in order to make his work exist. But he does not stop there; he also requires that they return this confidence which he has given them, that they recognize his creative freedom, and that they in turn solicit it by a symmetrical and inverse appeal.” [1]
ఇంతకు మించి రాస్తే వ్యాసమవుతుంది. అది నా అర కొర జ్ఞానంతో కన్నా కాస్త లోతుగా తెలిసినవాళ్ళు రాస్తే బావుంటుంది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] From “Why Write?” in “What Is Literature?” and Other Essays, by Jean-Paul Sartre.
[ఈమాట అభిప్రాయ రచయితలకు మనవి: ఈమాట రచనలపై మీరు రాసే అభిప్రాయాలను ఆయా రచనలలో వివరించిన అంశాలతో ఏదో ఒక సంబంధం ఉండేటట్లుగా రాయమని మా మనవి. రచనలతో ఏ మాత్రం సంబంధం లేని నిరన్వయ (unrelated), తిర్యగ్గత (tangential) అభిప్రాయాలను ఇకపైనుండి తిరస్కరించాలని సంపాదక వర్గం నిర్ణయం. ఇటువంటి చర్చలకు రచ్చబండ వంటి ఫోరములు సరైన వేదికలని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. — సంపాదకులు]
Paruchuri Sreenivas అభిప్రాయం:
October 3, 2008 5:04 am
హనుమంతరావుగారు,
రజనీకాంతరావు గారి “చలంతో ఇంటర్వ్యూ“, “ఈమాట” ఐదో జన్మదిన సంచిక లోని “శబ్దతరంగాల”లో వినవచ్చు.
ఆ ఇంటర్వ్యూ transcript చిన్న పుస్తకరూపంలో కూడా వచ్చింది.
“ఖానాగట్టు” గురించి విజయనగరం వాళ్ళు చెప్తే వింటానికి/చదవడానికి బాగుంటుంది.
– శ్రీనివాస్
baabjeelu అభిప్రాయం:
October 28, 2008 2:19 am
ఈమాట పదో “హేపీ బర్త్ డే” వచ్చేనెలలోనే అనుకుంటాను.
ఈమాటకి “బహుమతులేటివ్వగలం?”
ఈమాటని “రిటన్ గిఫ్టు” అడగక్కర్లెద్దు.
ఈమాట పేరుకుతగ్గట్టు, ఎప్పుడూ ” in currnecy” గా వుండాలి.
ఈమాట “హిమాలయముపై జెండా పాతినా”, “ఆకాశంలో షికార్లు చేసినా” మౌలికంగా మారకుండా, మారుతున్న కాలంతో పాటూ వెయ్యేళ్ళు ప్రయాణం చెయ్యలని ఆశిస్తున్నాను.
jagannnadharao అభిప్రాయం:
November 21, 2008 6:24 am
చాలా బాగుంది.జగన్నాధ రావు.
nagendra kumar vepuri అభిప్రాయం:
November 29, 2008 10:18 am
అయ్యా, ఈ పత్రిక బాగుంది. అచ్యుత లక్ష్మి ఫిల్మ్ సొసైటీ వారు ప్రచురించిన నా సినీ గ్రంధాలు ‘అద్భుత సినీ రంగము’ మరియు ‘సినీ స్క్రిప్టు రచనా కళ’ గురించి తెలియ పరిచె నిమిత్తము ఈ ఉత్తరము రాయడమైనది.